ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సమస్యల వలయం

ABN, First Publish Date - 2023-06-19T00:20:31+05:30

ఆడపిల్లల చదువు ఎంతో ప్రధానమైంది. పురుషులకు సమానంగా అన్ని రంగాల్లో రాణించాలంటే అమ్మాయిలు విద్యావంతులు కావడంతో ఎంతో ముఖ్యం.

భూపాలపల్లి పట్టణంలోని కస్తూర్భాగాంధీ విద్యాలయం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘కస్తూర్బా’ విద్యార్థినులకు తప్పని కష్టాలు

తీవ్ర అసౌకర్యాల నడుమ విద్యార్జన

పెరగని మెస్‌చార్జీలు

సరిగా అందని పౌష్టికాహారం

మూడేళ్లుగా జాడలేని కాస్మొటిక్‌ కిట్లు

మహిళా అధికారి లేక పర్యవేక్షణ కరువు

భూపాలపల్లిటౌన్‌, జూన్‌ 18: ఆడపిల్లల చదువు ఎంతో ప్రధానమైంది. పురుషులకు సమానంగా అన్ని రంగాల్లో రాణించాలంటే అమ్మాయిలు విద్యావంతులు కావడంతో ఎంతో ముఖ్యం. సమాజిక అసమానతలను రూపుమాపేందుకు ఇదెంతో దోహపడుతుంది. ఇదే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం కస్తూర్బాగాంధీ విద్యాల యాలను నిర్వహిస్తోంది. అయితే... ఆ పాఠశాలల్లో సౌకర్యాలకంటే సమస్యలే అధికంగా ఉంటున్నాయి. జిల్లాలోని కస్తూర్బా పాఠశాలల పరిస్థితి దయనీయంగా ఉంది. ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థినులను పట్టించు కొనే నాథుడే కరువయ్యాడు. తమ బాధలను చెప్పుకోవ డానికి కనీసం జిల్లాకు ఒక మహిళా అధికారి (జీసీడీవో–గర్స్ల్‌ చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ అధికారి) లేకపోవ డంతో బాలికలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ పాఠశాలల్లో సరైన పౌష్టికాహారం అందదు. మెస్‌చార్జీలు పెరగకవు. మూడు నెలలకోసారి ఇచ్చే కాస్మొటిక్‌ కిట్లు కూడా అందవు. ఇన్ని అసౌకర్యాల మధ్య చదువు కొనేందుకు విద్యార్థినులు తీవ్ర అవస్థ పడుతున్నారు.

ఐదేళ్లుగా పెరగని మెస్‌చార్జీలు

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా 11 మండలాలు ఉన్నాయి. అన్ని మండలాల్లో కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలను ప్రభుత్వం నెలకొల్పింది. వీటిలో 2414 మంది బాలికలు విద్యనభ్యసి స్తున్నారు. 10 విద్యాలయాల్లో ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు ఉండగా మిగతా వాటిలో ఆరు నుంచి పదో తరగతి వరకు నడుస్తున్నాయి. 2017లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మెస్‌చార్జీలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఐదేళ్లు గడిచినా మెస్‌ చార్జీలు మాత్రం పెరగలేదు. నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి. ఒక్కో విద్యా ర్థినికి రోజుకు రూ.34.60 ఖర్చు అవుతుండగా నెలకు రూ.1,040 వెచ్ఛించాల్సి ఉండగా అదనంగా మరో రూ. 200 ఖర్చు అవుతోందని పలువురు ప్రత్యేక అధికారులు అంటున్నారు. దీంతో బాలికలకు పౌష్టికాహారం అందని ద్రాక్షలా మారింది. రోజువారీ మెను ప్రకారం టిఫిన్స్‌, కోడిగుడ్లు, చికెన్‌, మటన్‌, స్నాక్స్‌ ఇవ్వాల్సి ఉంది. కానీ వాటిలో నాణ్యత కొరవడుతోందని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు.. ఏదైనా ఆరోగ్య సమస్య ఏర్పడితే వైద్యం కోసం పిల్లలను బయటికి తీసుకెళ్తే మెడికల్‌ చార్జీలు కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదని చెబుతున్నారు.

కాస్మొటిక్‌ కిట్ల జాడేది..?

కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో బాలికలకు కాస్మొటిక్‌ కిట్ల పంపిణీకి ప్రభుత్వం 2017లో శ్రీకారం చుట్టింది. మూడేళ్లుగా వాటి జాడలేదని విద్యార్థినులు అంటున్నారు. బాలికలకు తప్పని సరిగా కాస్మొటిక్‌ కిట్లు అవసరమని భావించిన రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లకు చేతులు ఎత్తేసిందని తల్లిదండ్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలలకోసారి ఈ కిట్లు పంపిణీ చేయాల్సి ఉండగా వాటిని పూర్తిగా నిలిపివేశారని చెబుతున్నారు. రిబ్బన్స్‌, టిక్లీ, సోప్స్‌, నాప్‌కిన్స్‌, దువ్వెన, కొబ్బరినూనె, పౌడర్‌, పేస్ట్‌, టంగ్‌క్లీనర్‌, బట్టల సబ్బులు తదితర సరుకులు ఒక బాక్స్‌లో పెట్టి వచ్చేవి. 2020 నుంచి ఆ ఊసే లేదని చెబుతున్నారు. ఈ కాస్మొటిక్స్‌ ఖర్చును బాలికలే భరించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రత్యేక అధికారి లేక..

కస్తూర్బా విద్యాలయాల పర్యవేక్షణ కోసం జిల్లాకు ప్రత్యేక మహిళా అధికారిని నియ మించాల్సి ఉంది. గతంలో జిల్లాకు ఒకరు ఉండగా ఆమె జీవో 317ప్రకారం ఇతర ప్రాం తానికి బదిలీపై వెళ్లారు. ఏడాదిన్నర కావస్తు న్నా మరో అధికారిణిని నియమించలేదు. పైగా ప్రస్తుతం సీఎంవోగా పనిచేస్తున్న కిషన్‌రావు అనే అధికారికి ఇన్‌చార్జి బాధ్యత లు అప్పగించారు. ఈ క్రమంలో ఆయన విద్యాలయాలకు పర్యవేక్షణ కోసం వెళ్తున్నప్ప టికీ ఆయనకు తమ సమస్యలను కులంకు శంగా చెప్పుకోలేక పోతున్నామని బాలికలు, సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్ప టికైనా జీసీడీవోను నియమించాలని ఉపా ధ్యాయులు, విద్యార్థినులు కోరుతున్నారు.

ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది..

– కిషన్‌రావు, ఇన్‌చార్జి అధికారి

కాస్మొటిక్‌ కిట్లు మూడేళ్లుగా రావడం లేదనే విషయం వాస్తవమే. ఈ క్రమంలో విద్యార్థినులతో అకౌంట్లు ఓపెన్‌చేసి వారి ఖాతాలో డబ్బులు జమ చేయడానికి ప్రయత్నం చేశాం. కానీ ఈ ప్రక్రియలో జాప్యమవుతోంది. అలాగే పిల్లలకు కావాల్సిన నాప్‌కిన్స్‌ కోసం కలెక్టర్‌ ప్రత్యేక చొరవ తీసుకుని రూ.40 లక్షలు వెచ్ఛించారు. ఈ క్రమంలో విద్యాలయాల్లో ప్రత్యేక మిషన్లను ఏర్పాటు చేశాం. పిల్లలకు మరో ఏడాది వరకు నాప్‌కిన్స్‌కు ఇబ్బంది లేదు. ఇంటర్మీడియట్‌ విద్యార్థినులకు ప్రత్యేక అధ్యాపకుల నియామకం కోసం సర్య్కూలర్‌ వచ్చింది. త్వరలో పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తాం.

Updated Date - 2023-06-19T00:20:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising