ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అందరి చూపు.. ‘గురుకులం’ వైపు..

ABN, First Publish Date - 2023-03-02T00:07:12+05:30

పేద, మధ్య తరగతి వర్గాల పిల్లలకు ఉచితంగా ఆంగ్లమాధ్యమంలో విద్యనందించడమే లక్ష్యంగా కేజీ టు పీజీ విద్య మిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభావంతులైన నిరుపేద పిల్లల బంగారు భవిష్యత్‌కు ప్రభుత్వ గురుకుల పాఠశాలలు బాటలు వేస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

  • 5 నుంచి ఇంటర్‌ వరకు ఉచిత వసతి, విద్య

  • పేద, మధ్య తరగతి తల్లిదండ్రుల ఆసక్తి

  • ప్రవేశం కోసం ‘వీటీజీ సెట్‌-2023’ నిర్వహణ

  • 6వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ

  • జిల్లాలో 16 గురుకులాలు

కేసముద్రం, మార్చి 1 : పేద, మధ్య తరగతి వర్గాల పిల్లలకు ఉచితంగా ఆంగ్లమాధ్యమంలో విద్యనందించడమే లక్ష్యంగా కేజీ టు పీజీ విద్య మిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభావంతులైన నిరుపేద పిల్లల బంగారు భవిష్యత్‌కు ప్రభుత్వ గురుకుల పాఠశాలలు బాటలు వేస్తున్నాయి. ఇందులో భాగంగా దళిత, గిరిజన, వెనుకబడిన తరగతుల(ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ)తోపాటు మైనార్టీ, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు 2017 జూన్‌లో సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖల ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటిలో 2023-2024 విద్యాసంవత్సరానికి ఐదో తరగతి ఆంగ్లమాధ్యమంలో ప్రవేశం కోసం నిర్వహించే ‘వీటీజీ సెట్‌-2023’(5వ తెలంగాణ గురుకుల ఉమ్మడి ప్రవేశపరీక్ష-2023)కు బాలబాలికల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు చెల్లించలేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ గురుకులాల్లో చేర్పించేందుకు అమిత ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. గురుకులాల్లో ఎలాగైనా సీటు సంపాదించాలని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటుగా ప్రత్యేక శిక్షణకు సైతం పంపిస్తుండడం గమనార్హం. సీటు వస్తే 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు ఆంగ్లమాధ్యమంలో విద్యతోపాటు ఉచితంగా భోజన, వసతి, ఇతర సౌకర్యాలు కల్పిస్తారు. ఉమ్మడి జిల్లాను యూనిట్‌గా ప్రవేశపరీక్షలోని మార్కులు, రిజర్వేషన్లను అనుసరిస్తూ సీట్లను భర్తీ చేయనున్నారు.

గురుకులాల ప్రత్యేకతలివే...

  • సుదీర్ఘ అనుభవం గల ఉపాధ్యాయులతో ఇంగ్లీష్‌ మీడియంలో బోధన

  • విద్యార్థులపై 24 గంటలు ఉపాధ్యాయుల పర్యవేక్షణ

  • ఉత్తమ ర్యాంకులతో ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశం కోసం ఐఐటీ, నిట్‌, ఎంసెట్‌, నీట్‌ వంటి జాతీయస్థాయి పోటీ పరీక్షలకు నిపుణులతో శిక్షణ.

  • అత్యధిక సంఖ్యలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌లలో ప్రవేశాలు పొందేలా ఉత్తమ శిక్షణ

  • సెంట్రల్‌, అజీమ్‌ ప్రేమ్‌జీ, ఢిల్లీ యూనివర్సిటీల వంటి టీఐఎస్‌ఎస్‌ వంటి ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాల్లో ప్రవేశానికి ఉత్తమ శిక్షణ.

  • విద్యార్థుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు హౌస్‌ మాస్టర్‌, హౌజ్‌ పేరెంట్‌ వ్యవస్థ.

  • పాఠ్యాంశాలతోపాటు సహ పాఠ్యాంశాలు, క్రీడలు తదితర వాటిపై ప్రత్యేక శ్రద్ధ.

  • యోగ, శారీరక విద్య, మార్షల్‌ ఆర్ట్స్‌లలో శిక్షణ.

  • తరగతి గదిలో చదువుతోపాటు క్షేత్ర పర్యటన, తోటి విద్యార్థులు, ప్రయోగశాలల ద్వారా చదువుకునే అవకాశం కల్పించడం.

  • చదువుతోపాటు సహపాఠ్యాంశాలు, క్రీడలు, లలితకళలు, వైజ్ఞానిక ప్రదర్శనలు, యూత్‌ పార్లమెంటు వంటి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం.

విద్యార్థులకు కల్పించే ఉచిత సౌకర్యాలు

  • సన్నబియ్యంతోపాటు మటన్‌, చికెన్‌, కోడిగుడ్లు, అరటిపండ్లు వంటి అన్ని పోషక విలువలతో కూడిన చక్కటి రుచికరమైన ఆహారాన్ని విద్యార్థులకు అందిస్తారు.

  • విద్యార్థుల స్టేషనరీ (పెన్నులు, పెన్సిళ్లు, రికార్డు పుస్తకాలు) పాఠ్యపుస్తకాలు, నోట్‌పుస్తకాలు పంపిణీ చేస్తారు.

  • మూడు జతల స్కూల్‌ యూనిఫాంలు, ట్రంక్‌ బాక్సులు అందజేస్తారు.

  • ఫిజికల్‌ ట్రైనింగ్‌ డ్రెస్‌, ట్రాక్‌ సూట్‌, స్పోర్ట్స్‌ షూ, ఇతర సౌకర్యాలను కల్పిస్తారు.

  • ప్రతి విద్యార్థికి ప్లేట్‌, గ్లాస్‌, బెడ్‌షీట్‌, పరుపులు, దిండ్లు, బ్లాంకెట్‌, ట్రంక్‌బాక్స్‌లను అందజేస్తారు.

  • ‘హెల్త్‌కిట్‌’ ద్వారా కాస్మోటిక్స్‌ వస్తువులు, ప్రతి విద్యార్థికి సబ్బుల కొనుగోలు కోసం డబ్బులను పంపిణీ చేస్తారు.

అర్హులు వీరే...

ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు 2022-23 విద్యాసంవత్సరంలో ప్రభుత్వ, గుర్తింపు పొందిన పాఠశాలలో 4వ తరగతి చదువుతూ ఉండాలి. ఓసీ, బీసీ విద్యార్థులైతే 01-09-2012 నుంచి, ఎస్‌సీ, ఎస్‌టీలైతే 01-09-2010 నుంచి 31-08-2014 మధ్య తేదీల్లో జన్మించి ఉండాలి. విద్యార్థుల తల్లిదండ్రులకు 2022-23 ఆర్థిక సంవత్సర ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ.1.5లక్షలు, పట్టణ ప్రాంతంలో రూ.2లక్షలకు మించి ఉండరాదు. సైనికోద్యోగుల పిల్లలకు ఆదాయ పరిమితి నిబంధనలు వర్తించవు. ప్రవేశ పరీక్ష 3, 4వ తరగతి స్థాయిలో తెలుగుకు 20 మార్కులు, ఇంగ్లీష్‌ 25, గణితం 25, మెంటల్‌ ఎబిలిటీ 10, పరిసరాల విజ్ఞానం 20 మార్కుల చొప్పున 100 మార్కుల ఆబ్జెక్టీవ్‌ టైప్‌లో ఉంటుంది. అర్హులైన విద్యార్థులు (టీజీసెట్‌.సీజీజీ.జీ వోవి.ఇన్‌) ఆన్‌లైన్‌లో వివరాలతో దరఖాస్తు చేయాలి. ఇందుకోసం స్టడీ సర్టిఫికెట్‌, ఫొటో, ఆధార్‌ వివరాలతో ఆన్‌లైన్‌లో రూ.100ల పరీక్ష ఫీజుతో మార్చి 6 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చారు. పరీక్షకు 10 రోజుల ముందు నుంచి హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునే వీలుంది. ప్రవేశపరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్‌, స్థానికత, ప్రత్యేక కేటగిరీల ఆధారంగా సీట్ల భర్తీ ఉంటుంది.

జిల్లాలో 16 గురుకులాలు..

మహబూబాబాద్‌ జిల్లాలో సాంఘిక, గిరిజన, బీసీ సంక్షేమ శాఖల పరిఽధిలో 16 గురుకుల పాఠశాలు ఉన్నాయి. జిల్లాలో జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల(ఎంజేపీటీ బీసీడబ్ల్యూఆర్‌)లు గుమ్ముడూరు, కేసమ్రుదం, దంతాలపల్లి, గూడూరు, పెద్దవంగర, మరిపెడల్లో ఉన్నాయి. సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల(టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌)లు ఇనుగుర్తి, మహబూబాబాద్‌, తొర్రూరు, మరిపెడ, నర్సింహులపేట, గిరిజన సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల(టీటీడబ్ల్యూఆర్‌ఎస్‌)లు మహబూబాబాద్‌, కేసముద్రం, మరిపెడ, కొత్తగూడ, దామరవంచ ప్రాంతాల్లో ఉన్నాయి. జిల్లాల్లోని 16 గురుకులాల్లో 5వ తరగతిలో 80 చొప్పున 1280 సీట్లను భర్తీచేయనున్నారు.

విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి : కొత్త జగన్మోహన్‌రెడ్డి, విద్యాశాఖ మండల నోడల్‌ అధికారి, కేసముద్రం

విద్యార్థులకు 5వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు ఉచితం గా భోజన, వసతితో విద్యనం దించే గురుకులాలను సద్విని యోగం చేసుకోవాలి. పేద, మధ్య తరగతి వర్గాల తల్లిదం డ్రులు తమ పిల్లలతో ఈ ప్రవేశ పరీక్ష రాయించి ప్రభుత్వం అందించే సౌకర్యాన్ని వినియోగించుకోవాలి. సంక్షేమ శాఖల గురుకులాల్లోని విద్యార్థులు ఎన్నో విజయాలను సాధిస్తున్నారు.

Updated Date - 2023-03-02T00:07:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!