ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేయాలి

ABN, First Publish Date - 2023-06-18T01:22:57+05:30

‘వరంగల్‌ తూర్పు నియోజకవర్గ అభివృద్ధికి చక్కగా పని చేస్తున్న తమ్ముడు నన్నపునేని నరేందర్‌... సీఎం కేసీఆర్‌ ఆశీర్వాదం, ప్రజల దయ ఉంటే మంచి మెజారిటీతో ఎమ్మెల్యేగా మరోసారి గెలిచివస్తాడు..’ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మునిసిపల్‌ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్‌) అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాంగ్రెస్‌, బీజేపీ మోసపు మాటలు నమ్మొద్దు..

వరంగల్‌ తూర్పులో నరేందర్‌ మళ్లీ గెలవడం ఖాయం

నియోజకవర్గంలో వందల కోట్ల విలువైన అభివృద్ధి పనులు జరుగుతున్నాయి

దసరా నాటికి సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభం

‘తూర్పు’పై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రేమ ఎక్కువ

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌

వరంగల్‌ ఏజే మిల్లు గ్రౌండ్‌లో హోరెత్తిన బహిరంగ సభ

గిర్మాజిపేట(వరంగల్‌), జూన్‌ 17 : ‘వరంగల్‌ తూర్పు నియోజకవర్గ అభివృద్ధికి చక్కగా పని చేస్తున్న తమ్ముడు నన్నపునేని నరేందర్‌... సీఎం కేసీఆర్‌ ఆశీర్వాదం, ప్రజల దయ ఉంటే మంచి మెజారిటీతో ఎమ్మెల్యేగా మరోసారి గెలిచివస్తాడు..’ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మునిసిపల్‌ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్‌) అన్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని అన్ని స్థానాల్లో బీఆర్‌ఎస్‌ గులాబీ జెండాను ఎగురవేయాలని, కాంగ్రెస్‌, బీజేపీ మోసపు మాటలను నమ్మి ఆగం కావొద్దంటూ కేటీఆర్‌ పిలుపునిచ్చారు. వరంగల్‌ ఓ–సిటీ వద్ద గల ఏజే మిల్లు గ్రౌండ్‌లో శనివారం రాత్రి బీఆర్‌ఎస్‌ వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు అరూరి రమేష్‌ అధ్యక్షతన బహిరంగసభ జరిగింది. మంత్రి కేటీఆర్‌ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

గత ప్రభుత్వాలతో పోలిస్తే వరంగల్‌ తూర్పు నియోజకవర్గాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధతో కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నారని కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి వరంగల్‌ తూర్పులో నిర్మాణం జరుగుతున్నదన్నారు. దీనిని దసరా నాటికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించనున్నారని అన్నారు. శనివారం ఒక్కరోజే 618 కోట్ల రుపాయలతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసుకున్నామంటే సీఎంకు వరంగల్‌ తూర్పు నియోజకవర్గ అభివృద్ధిపై ఉన్న ప్రత్యేక శ్రద్ధను చెబుతుందని అన్నారు.

మిల్లు గ్రౌండ్‌లో రూ.80 కోట్లతో కలెక్టరేట్‌, రూ.75 కోట్లతో అఽధునాతన వరంగల్‌ ఆర్‌టీసీ బస్‌స్టేషన్‌ నిర్మిస్తున్నామని అన్నారు. అలాగే రూ.12 కోట్లతో డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు, రూ.135 కోట్లతో వరంగల్‌లో రోడ్లు నిర్మించుకున్నామని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. అలాగే 313 కోట్ల రూపాయలతో చేపడుతున్న ఇన్నర్‌ రింగ్‌రోడ్డు వచ్చే 6 నెలలు లేదా 9 నెలల్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి కేటీఆర్‌ చెప్పారు.

తూర్పుపై కేసీఆర్‌కు ప్రేమ..

వరంగల్‌ తూర్పుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రేమ ఎక్కువ అని అందుకే పలువురి నాయకులకు పదవులిచ్చారంటూ వరంగల్‌ తూర్పు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పలువురు నాయకులను మంత్రి కేటీఆర్‌ బహిరంగసభ వేదికపై పేరుపేరునా పరిచయం చేశారు. జీవితామంతా ముదిరాజ్‌ల సంక్షేమం కోసం పని చేసిన బండా ప్రకాష్‌ రాజ్యసభసభ్యుడిగా పనిచేసి, ఇపుడు విధానమండలి డిప్యూటీ చైర్మన్‌గా పని చేస్తున్నాడని అన్నారు. అలాగే బస్వరాజు సారన్న మంత్రిగా పనిచేసి, ఇపుడు ఎమ్మెల్సీగా ఉన్నారని, గుండు సుధారాణి మేయర్‌గా, రాష్ట్ర రోడ్డు భవనాల సంస్థ చైర్మన్‌గా మెట్టు శ్రీనివాస్‌, రాష్ట్రస్థాయి చైర్మన్‌లుగా మౌలానా, బొల్లం సంపత్‌, డిప్యూటీ మేయర్‌ రిజ్వానా షమీమ్‌లను కేసీఆర్‌ కడుపులో పెట్టుకుని పదవులు ఇచ్చారని మంత్రి కేటీఆర్‌ పరిచయం చేశారు.

బీఆర్‌ఎ్‌సను గెలిపించాలంటూనే ఎమ్మెల్యే నరేందర్‌ చక్కగా పని చేస్తున్నాడని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశీర్వాదం.. మీ (ప్రజల) దయఉంటే మంచి మెజారిటీతో బ్రహ్మాండంగా మరోసారి గెలిచివస్తాడంటూ కేటీఆర్‌ తన ప్రసంగాన్ని ముగించారు. సుమారు 27 నిమిషాలు 31 సెకండ్ల పాటు కేటీఆర్‌ ప్రసంగించారు. ఇందులో 3 నిమిషాలు ఉర్దూలో మాట్లాడారు.

మండే ఎండలో కేటీఆర్‌ టూరు

వరంగల్‌ తూర్పులో ఉత్సాహంగా సాగిన పర్యటన

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

గీసుగొండలో యంగ్‌వన్‌ కంపెనీకి శ్రీకారం

నూతన కలెక్టరేట్‌కు భూమి పూజ

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పార్టీ శ్రేణులతో మమేకం

వరంగల్‌ సిటీ, జూన్‌ 17 : వరంగల్‌ జిల్లాలో శనివారం బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పర్యటన ఆద్యం తం ఉత్సాహపూరితంగా సాగింది. ఉదయం నుంచి సాయం త్రం వరకు ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. నాయకులతో, పార్టీ శ్రేణులతో మమేకం అయ్యారు. అందరినీ పేరు పేరునా పలకరించారు. ఎండ తీవ్రత, ఉక్కపోతను లెక్క చేయకుండా బిజీబిజీగా గడిపారు. నాయకులు, ప్రజాప్రతినిధులు వెంటరాగా టూరిజం బస్సులో నగరాన్ని చుట్టేశారు.

కేటీఆర్‌ శనివారం ఉదయం 10.38 గంటలకు హెలీకాప్టర్‌లో పరకాల నియోజకవర్గంలోని గీసుగొండ మండలం శాయంపేట హవేలిలో గల కాకతీయ టెక్స్‌టైల్‌ పార్కుకు చేరుకున్నారు. యంగ్‌వన్‌ కంపెనీ ప్రతినిధులు కీహాక్‌ సంగ్‌, ఛాంగ్‌ జీ బ్యాక్‌, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యేలతో కలిసి 11.56 గంటలకు ఎవర్‌టాప్‌ టైక్స్‌టైల్‌ అండ్‌ అప్పేరల్‌ కాంప్లెక్స్‌ కంపెనీ స్థాపనకు భూమిపూజ నిర్వహించారు. యంగ్‌వన్‌ సంస్థ ఇక్కడి 261 ఎకరాల్లో 900 కోట్ల పెట్టుబడులతో 11 యూనిట్లను ఏర్పాటు చేయనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్‌ మాట్లాడారు.

అనంతరం రోడ్డు మార్గంలో వరంగల్‌ చేరుకొని, ఓ–సిటీలో నూతనంగా నిర్మించిన వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని 12.45 గంటలకు ప్రారంభించారు. అనంతరం మంత్రి దయాకర్‌రావు, మండలి డిప్యూటీ చైర్మన్‌ బండా ప్రకాశ్‌, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎంపీ దయాకర్‌, మేయర్‌ గుండు సుధారాణి, తూర్పు కార్పొరేటర్లతో కలిసి భోజనం చేశారు. 2.35 గంటల వరకు క్యాంపు కార్యాలయంలోనే బిజీ బీజీగా గడిపిన కేటీఆర్‌ అక్కడి నుంచి 2.38 గంటలకు అజంజాహి మిల్లు గ్రౌండుకు చేరుకున్నారు. అక్కడ 16 ఎకరాల 29 గుంటల్లో రూ.80 కోట్ల వ్యయంతో నిర్మించనున్న కలెక్టరేట్‌ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం 3.05 గంటలకు దేశాయిపేటకు చేరుకొని జర్నలిస్టుల కోసం రూ. 12 కోట్ల వ్యయంతో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆరుగురు జర్నలిస్టులకు ఇళ్ల కేటాయింపు పత్రాలను అందజేశారు.

అనంతరం వరంగల్‌ గోపాలస్వామి ఆలయ చౌరస్తాలో కొండా లక్ష్మణ్‌బాపూజీ విగ్రహంతో పాటు చేనేతన్న విగ్రహాలను 3.55 గంటలకు ఆవిష్కరించారు. అక్కడి నుంచి డాక్టర్స్‌ కాలనీలో స్థానిక వస్త్ర వ్యాపారి కాసం నమశ్శివాయ గృహానికి వెళ్లారు. ఇటీవలె వివాహమైన నమశ్శివాయ కుమారుడు, కోడలిని ఆశీర్వదించారు. అక్కడి నుంచి వరంగల్‌ చౌరస్తా చేరుకొని స్మార్ట్‌ సిటీ రోడ్లను ప్రారంభించారు. 4.46 గంటలకు వరంగల్‌ బస్టాండ్‌కు చేరుకొని రూ. 75 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్‌ బస్టాండ్‌కు భూమి పూజ చేశారు. అక్కడ నుంచి నేరుగా రంగశాయిపేట శివారులోని ఆర్టీఏ జంక్షన్‌ చేరుకొని రూ. 313 కోట్ల ‘కుడా’ నిధులతో నిర్మించనున్న ఇన్నర్‌ రింగ్‌రోడ్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

అనంతరం 5 గంటలకు ఉర్సు రంగసముద్రం చేరుకొని మురుగు నీటి శుద్ధి ప్లాంట్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత ఉర్సు చెరువు కట్టపై ట్యాంక్‌ బండ్‌ పనులతో పాటు వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అక్కడ నుంచి ఉర్సులోని మాషుక్‌ రబ్బాని దర్గాకు చేరుకొని రూ. 83.5 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. దర్గా పీఠాధిపతులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అక్కడ నుంచి రంగశాయిపేటలోని మహంకాళి ఆలయం మైదానంలో రూ. 4 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.

6.30 గంటలకు ఖిలా వరంగల్‌లోని కాకతీయుల కోటకు చేరుకొని ఫకాడ్‌ లైటింగ్‌ పనులను ప్రాంభించారు. లైట్‌షోలో కేసీఆర్‌ చిత్రపటాలను వీక్షించారు. 7.30 గంటలకు వరంగల్‌ అజంజాహి మిల్లు గ్రౌండ్‌కు చేరుకొని బహిరంగ సభలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌, బీజేపీపై నిప్పులు చెరిగారు. బీఆర్‌ఎస్‌కు మళ్లీ పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. సరిగ్గా అర్ధగంట పాటు మాట్లాడారు. 8.15 గంటలకు ప్రసంగం ముగించారు. ఎండ తీవ్రతను లెక్క చేయకుండా ఉదయం నుంచి విరామం లేకుండా కేటీఆర్‌ వరంగల్‌ నగరంలో సుడిగాలి పర్యటన చేశారు.

కాగా, సమయాభావం వల్ల మండి బజార్‌, పోచమ్మమైదాన్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయలేదు. దీంతో ఆయా ప్రాంతాల్లో ఏర్పాట్లు వృథా అయ్యాయి. ఇదిలావుండగా, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రారంభించిన అనంతరం కేటీఆర్‌ను కలిసేందుకు నాయకులు పోటీ పడ్డారు. 37వ డివిజన్‌ కార్పొరేటర్‌ భర్త భోగి సురేష్‌ను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. అలాగే విఽధినిర్వహణలో ఉన్న జర్నలిస్టుల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు.

కేటీఆర్‌ టూరులో వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌తో పాటు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాష్ట్ర విధానమండలి డిప్యూటీ చైర్మన్‌ బండా ప్రకాష్‌, ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, మేయర్‌ గుండు సుధారాణి, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ గండ్ర జ్యోతి, శాసనసభ్యులు అరూరి రమేష్‌, పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కలెక్టర్‌ ప్రావీణ్య, అదనపు కలెక్టర్‌ అశ్విని తానాజీ వాకడే, గ్రేటర్‌ వరంగల్‌ బల్దియా కమిషనర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌, డాక్టర్‌ హరిరమాదేవి, కార్పొరేటర్‌ చింతాకుల అనిల్‌కుమార్‌, రైల్వే జడ్‌ఆర్‌యూసీసీ చింతాకుల సునిల్‌, ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-18T01:22:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising