ముందస్తు సమాచారం లేకుండానే గ్రీవెన్స్ రద్దు
ABN, First Publish Date - 2023-04-11T00:26:35+05:30
ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కలెక్టరేట్‌లో సోమవారం జరగాల్సిన గ్రీవేన్స్ సెల్ రద్దవడంతో దరఖాస్తు దారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ, అధికారులు హైదరాబాద్‌లో సమావేశం ఉండటంతో రాజధానికి వెళ్లిన నేపథ్యంలో సోమవారం నిర్వహించాల్సిన గ్రీవెన్స్‌ను రద్దు చేశారు. ఈ విషయం తెలియక జిల్లా నలుమూలల నుంచి తరలి వచ్చిన ప్రజలు నిరాశతో వెనుదిగారు. ఎం
వరంగల్ కలెక్టరేట్, ఏప్రిల్ 10: ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కలెక్టరేట్‌లో సోమవారం జరగాల్సిన గ్రీవేన్స్ సెల్ రద్దవడంతో దరఖాస్తు దారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ, అధికారులు హైదరాబాద్‌లో సమావేశం ఉండటంతో రాజధానికి వెళ్లిన నేపథ్యంలో సోమవారం నిర్వహించాల్సిన గ్రీవెన్స్‌ను రద్దు చేశారు. ఈ విషయం తెలియక జిల్లా నలుమూలల నుంచి తరలి వచ్చిన ప్రజలు నిరాశతో వెనుదిగారు. ఎండా కాలం కావడం దూర ప్రాంతాల నుంచి వినతి పత్రాలు ఇవ్వడానికి వస్తే, ఎలాంటి సమాచారం లేకుండా రద్దు చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మూడు రోజులుగా సెలవులు రావడం సోమవారం గ్రీవెన్స్ లేదని సమాచారం లేకపోవడం మాకు చాలా ఇబ్బంది కలిగిందని చాలా మంది నిరాశతో వెళ్లిపోయారు. కొందరు ఇంత దూరం వచ్చామని కలెక్టరేట్ ఏవోకు ఇన్‌వార్డులో వినతి పత్రాలను అందజేశారు. కలెక్టరేట్ కార్యాలయం ప్రజలకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సమాచారం ప్రసార సాధనాల ద్వారా తెలపాలని పలువురు అన్నారు.
8 మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతిని మంగళవారం ఉదయం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహిస్తున్నట్టు వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కార్యక్రమానికి మంత్రులు, శాసన మండలి డిప్యూటీ చైర్మన్, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ చీఫ్ విప్, జడ్పీ చైర్మన్, ప్రజా ప్రతినిధులు, అధికారులు హాజరవుతారని పేర్కొంది.
Updated Date - 2023-04-11T00:26:35+05:30 IST