ధర్మారం పాఠశాల రాష్ట్రానికే ఆదర్శం
ABN, First Publish Date - 2023-03-11T00:07:58+05:30
వరంగల్ 16వ డివిజన్‌లోని ధర్మారం జడ్పీ పాఠశాల రాష్ట్రానికే ఆదర్శమని కలెక్టర్ గోపి అన్నారు. పాఠశాల ఏర్పాటు చేసి 75 సంవత్స రాలు పూర్తి అయిన సందర్భంగా పూర్వవిద్యార్థుల అల్యూమిని వజ్రోత్సవ వేడుకల ను శుక్రవారం నిర్వహించింది. కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని వే డుకలను ప్రారంభించి మాట్లాడారు. 75ఏళ్లలో పాఠశాలలో చదువుకున్న విద్యార్థు లు ఏకమై అల్యూమినిగా ఏర్పడి పాఠశాల అభివృద్ధికి తోడ్పాటును అందించటం అభినందనీయమన్నారు. ప్రభుత్వం కూడా పాఠశాల
ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లోనే అద్భుత ప్రతిభ..
పాఠశాల వజ్రోత్సవాల్లో కలెక్టర్ గోపి
గీసుగొండ, మార్చి 10: వరంగల్ 16వ డివిజన్‌లోని ధర్మారం జడ్పీ పాఠశాల రాష్ట్రానికే ఆదర్శమని కలెక్టర్ గోపి అన్నారు. పాఠశాల ఏర్పాటు చేసి 75 సంవత్స రాలు పూర్తి అయిన సందర్భంగా పూర్వవిద్యార్థుల అల్యూమిని వజ్రోత్సవ వేడుకల ను శుక్రవారం నిర్వహించింది. కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని వే డుకలను ప్రారంభించి మాట్లాడారు. 75ఏళ్లలో పాఠశాలలో చదువుకున్న విద్యార్థు లు ఏకమై అల్యూమినిగా ఏర్పడి పాఠశాల అభివృద్ధికి తోడ్పాటును అందించటం అభినందనీయమన్నారు. ప్రభుత్వం కూడా పాఠశాలకు మన ఊరు-మనబడి కింద రూ.60 లక్షలను మంజూరు చేసిందన్నారు. దీని ద్వారా 12రకాల వసతులను విద్యార్థులకు కల్పించబడుతాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థుల కు అద్భుత ప్రతిభ ఉంటుందన్నారు. తాను పీజీ వరకు ప్రభుత్వ పాఠశాల, కళా శాల్లోనే చదివి కలెక్టర్ అయ్యానని గుర్తుచేశారు. పాఠశాల పూర్వ విద్యార్థుల ఒక బ్యాచ్ ఏకం చేయాలంటే ఎంతో కష్టపడుతారని, కానీ 75 ఏళ్లలో పూర్వ విద్యా ర్థులను ఏకం చేయటం అభినందనీయమన్నారు. దీనిని అన్ని పాఠశాలలు ఆదర్శం గా తీసుకోవాలన్నారు.
డీఈవో వాసంతి మాట్లాడుతూ తరగతులకు అనుగుణంగా ఆయా విద్యార్థుల్లో విద్యా సామర్థ్యాలు విధిగా ఉండేందుకు విద్యాశాఖ తొలిమెట్టు కార్యక్రమం చేపట్టిం దన్నారు. దీని ద్వారా మంచి ఫలితాలు వస్తున్నట్లు చెప్పారు. టెన్త్ విద్యార్థులకు 40రోజులపాటు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అల్యూ మినిని ఏర్పాటు చేసి ఒక బ్యాంక్ అకౌంట్ తీసుకొని విరాళాలు సేకరించి పాఠశాల అభివృద్ధి తోడ్పాటు అందించాలని కోరారు. అనంతరం పూర్వవిద్యార్థులను సన్మానిం చారు. కార్యక్రమంలో తహసీల్దార్ విశ్వనారాయణ, ఈఈ శంకరయ్య, హెచ్‌ఎం తీగల సుజాత, రిటైర్డ్ ప్రొఫెసర్ గాదె దయాకర్, రిటైర్డ్ హెచ్‌ఎంలు నర్సింహారెడ్డి, సుధాకర్‌రావు, పూర్వ విద్యార్థులు సీనియర్ జర్నలిస్ట్ వై.రాజేంద్రప్రసాద్, జీకే రాం బాబు, శ్రీకాంత్, ఎస్‌ఎంసీ చైర్మన్ రమేష్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Updated Date - 2023-03-11T00:07:58+05:30 IST