మృత్యువుతో పోరాడి..
ABN, First Publish Date - 2023-02-27T00:32:43+05:30
కాకతీయ మెడికల్ కాలేజీకి చెందిన పీజీ మొదటి సంవత్సరం (అనస్థీషియా) విద్యార్థిని ధారావత్ ప్రీతి కథ విషాదాం తమైంది.
మెడికో పీజీ విద్యార్థి ప్రీతి కన్నుమూత
నిమ్స్‌లో ఆదివారం మరణించినట్లు వైద్యుల ప్రకటన
ఐదురోజులుగా ఫలించని డాక్టర్ల ప్రయత్నాలు
తీవ్ర శోకసముద్రంలో కుటుంబ సభ్యులు
కేఎంసీ, ఎంజీఎం మెడికోలలో తీవ్ర విషాదం
రెండు చోట్ల భారీగా మోహరించిన పోలీసులు
హనుమకొండ అర్బన్, ఫిబ్రవరి 26: కాకతీయ మెడికల్ కాలేజీకి చెందిన పీజీ మొదటి సంవత్సరం (అనస్థీషియా) విద్యార్థిని ధారావత్ ప్రీతి కథ విషాదాం తమైంది. ఐదు రోజలుగా హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో మృత్యువుతో చేస్తున్న పోరాటంలో ఓడిపోయిం ది. డాక్టర్ల బృందం చివరి నిమిషం వరకు ఎంత ప్రయ త్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆదివారం సాయంత్రం కన్నుమూసింది. ప్రీతి మృతితో కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. ఆమె మరణవార్తతో కేఎంసీలోని వైద్య విద్యార్థులు కన్నీటి పర్యంతం అయ్యారు. ఎంజీఎం ఆస్పత్రిలోనూ సీనియర్ డాక్టర్లు, పీజీలు, హౌస్‌సర్జన్లు సైతం విషాదంలో మునిగిపోయారు.
ఆత్మహత్యాయత్నం
ఎంజీఎంలోని అనస్థీషియా విభాగంలో పని చేస్తున్న ప్రీతి తన సీనియర్ పీజీ విద్యార్ధి ఎంఏ సైఫ్ వేధింపులు భరించలేక మత్తుకు సంబంధించిన ఒక ఇంజక్షన్ తీసుకోవడం ద్వారా ఈనెల 22న ఉదయం ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. అత్యవసర ఆపరేషన్ థియేటర్‌లో అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను మొదట ఎంజీఎం ఆస్పత్రిలోనే అత్యవసర చికిత్స అందిం చారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అదే రోజు హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందింది. నిమ్స్‌లో చేర్చినప్పటి నుంచి ప్రీతి ఆరోగ్య పరిస్థితి ఏ మాత్రం మెరుగుపడలేదు. ప్రత్యే క బృందం ఆమె ప్రాణాలను కాపాడేందుకు విశ్వప్రయ త్నం చేశారు. ఆమె అవయవాలన్నీ దెబ్బతినడం వల్ల చికిత్సకు ఏ మాత్రం స్పందించలేకపోయాయి. ఆరోగ్యం అంత కంతకూ క్షీణిస్తూ వచ్చింది. శనివారం నుంచి ఆమె శరీరం రంగు మారుతూ వచ్చింది.
వేధింపులు తట్టుకోలేక..
ప్రీతి ఆత్మహత్యాయత్నం సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. వైద్య విద్యార్థి లోకంలో కలకలం సృష్టించింది. జనగామ జిల్లా కొడకండ్ల మండ లం మొడ్రాయి గ్రామ శివారు గిర్నితండాకు చెందిన ప్రీతి తండ్రి నరేందర్ రైల్వేలో ఏఎస్‌ఐగా పనిచేస్తున్నాడు. 20 ఏళ్ల కిందటే ప్రీతి కుటుంబం హైదరాబాద్‌కు వెళ్లి స్థిరపడింది. పీజీ అనస్థీషియా మొదటి సంవత్సరం చదువుతున్న ప్రీతి కేఎంసీ హాస్టల్‌లో ఉంటోంది. కొద్ది నెలలుగా ఎంజీఎంలోని అనస్థీషియా విభాగంలో పనిచే స్తోంది. ఇదే విభాగంలో పని చేస్తున్న సీనియర్ పీజీ అనస్థీషియా విద్యార్థి సైఫ్ అమె మానసికంగా వేధించి నట్టు ఆరోపణలు ఉన్నాయి. విధులకు సంబంధించి ప్రీతిని కించేపరిచే రీతిలో వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్‌లు పెట్టడడడమే కాకుండా ఆమెకు తోటి విద్యార్థులు ఎవరూ సహకరించరాదని చెప్పడంతో అవమానంగా భావించిన ప్రీతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
వెల్లువెత్తిన నిరసనలు
ఈ సంఘటనకు నిరసనగా వివిధ విద్యార్థి సంఘాలు కేఎంసీ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. నిరసన ప్రదర్శనలు జరిపాయి. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థి తులు నెలకొన్నాయి. సీనియర్ విద్యార్థి వల్ల ప్రీతి వేధింపులకు గురవుతోందని ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోలేదని ఆమె తండ్రి ధారావత్ నరేందర్ ఆరో పించారు. కేఎంసీ ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకువచ్చినా ఆయన కూడా పట్టించుకోలేదన్న విమర్శలు వెల్లువెత్తా యి. కాగా, మరోవైపు సైఫ్‌కు మద్దతుగా ఎంజీఎంలో పీజీ విద్యార్థులు, జూనియర్ డాక్టర్లు విధులను బహిష్కరించి ప్లకార్డులు ధరించి నిరసన ప్రదర్శన జరిపారు. దీనితో అటు కేఎంసీలో ఇటు ఎంజీఎంలోనూ ఉద్రితక్త పరిస్థి తులు నెలకొన్నాయి. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ప్రీతిని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు పలువురు ప్రముఖులు పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని కోరారు. నిమ్స్ ఆస్పత్రి అధికారులు కూడా ప్రీతి ప్రాణాలు కాపాడేందుకు చివరి వరకు తమ వంతు ప్రయత్నాలు చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది.
సీపీ స్వయంగా..
ప్రీతి ఆత్మహత్యాయత్నం సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో పోలీసులు ఈ కేసును సీరి యస్‌గా తీసుకున్నారు. సీపీ స్వయంగా రంగంలోకి దిగా రు. ఎంజీఎంను సందర్శించి స్వయంగా విచారణ జరిపా రు. ప్రత్యేక పోలీసు బృందంతో కూడా విచారణ జరిపిం చారు. వ్యాట్సాప్ సందేశాలను పరిశీలించిన తర్వా త సైఫ్ కావాలనే ప్రీతిని వేధించినట్టు స్పష్టం కావడంతో ఆయన ను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచగా జైలుకు సైఫ్ రిమాండ్ అయ్యారు. ప్రీతి ఆత్మహత్యాయత్నం ఘటనపై ఎంజీఎం ఆస్పత్రిలో కూడా త్రిసభ్య కమిటీని వేసి విచారణ జరిపించారు. ఈ కమిటీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడడానికి దారి తీసిన పరిస్థి తులు, కారణాలపై అన్ని కోణాల నుంచి వి చారణ జరిపి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ డైరెక్టర్‌కు నివేదికను పంపింది.
మోహరింపు
ప్రీతి మృతి చెందిన వార్త వెలువడగానే ముందు జాగ్రత్త చర్యగా కేఎంసీ, ఎంజీఎం ఆస్పత్రి వద్ద పోలీసు లను పెద్ద ఎత్తున మోహరించారు. ఈ రెండు ప్రాంతా లను పోలీసులు దాదాపు దిగ్బంధం చేశారు. విద్యార్ధి సంఘాల నాయకులు పెద్దఎత్తున ఆందోళనకు దిగే అవకాశాలు ఉండడంతో ఎటువంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఐఏఎస్ కావాలని..
ప్రీతికి ఐఏఎస్ కావాలని ఉండేది. ఆ కల నెరవేరకుండానే కన్నుమూసింది. చదువులో ఎంతో చురుకుగ్గా ఉండే ప్రీతి.. ఒకసారి ప్రయత్నించింది కానీ సఫలం కాలేదు. రెండో ప్రయత్నంలో కచ్చితంగా విజయం సాధిస్తాననే నమ్మకంతో ఉన్నదని ప్రీతి కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమవుతూ చెప్పారు, ప్రీతి బాల్యం అంతా హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో గడిచింది. అక్కడి రైల్వే స్కూల్‌లో పదో తరగతి వరకు చదువుకున్నది. ఇంటర్ కూడా రైల్వే జూనియర్ కాలేజీనే చేసింది. ఎంసెట్‌లో మంచి ర్యాంక్ సాధించి ఎంబీబీఎస్ సీటు సాధించింది. ఎంబీబీఎస్ తర్వాత పీజీ అనస్థీషియాలో చేరింది. కేఎంసీలో మొదటి సంవత్సరం చదువుతుండగానే ఈ దుర్ఘటన జరిగింది. ప్రీతి తండ్రి రైల్వే ఏఎస్‌ఐ. ప్రీతి తల్లి శారద. ప్రీతి మూడో సంతానం. ఆమెకు ఇద్దరు అక్కలు, ఒక తమ్ముడు ఉన్నారు. ప్రీతి అక్క వైశాలి ఇన్‌కమ్‌టాక్స్ ఇన్స్‌పెక్టర్. తమ్ముడు కేయూలో ఎంబీఏ చేస్తున్నాడు.
Updated Date - 2023-02-27T00:32:44+05:30 IST