ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మళ్లీ ‘గ్రీన్‌ఫీల్డ్‌’ సర్వే

ABN, First Publish Date - 2023-01-18T00:08:17+05:30

గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణానికి అక్రమంగా సర్వేలు చేస్తే సహించేదే లేదని భూ నిర్వాసిత రైతులు హెచ్చరించారు. దామెర మండలం పులుకుర్తి, గట్లకానిపర్తి, పోచారం తదితర గ్రామాల్లోని రైతుల వ్యవసాయ పంట భూముల్లో గ్రీన్‌ఫీల్డ్‌ హైవేకు చెందిన అధికారులు, సిబ్బంది డ్రోన్‌ కెమెరాలతో సర్వే చేపట్టారు. విషయం తెలుసుకుని రైతులు అక్కడికి చేరుకున్నారు.

డ్రోన్‌ కెమెరాను పోలీసులకు అప్పగిస్తున్న రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అక్రమంగా సర్వేలు చేస్తే సహించేది లేదని హెచ్చరిక

దామెర, జనవరి 17: గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణానికి అక్రమంగా సర్వేలు చేస్తే సహించేదే లేదని భూ నిర్వాసిత రైతులు హెచ్చరించారు. దామెర మండలం పులుకుర్తి, గట్లకానిపర్తి, పోచారం తదితర గ్రామాల్లోని రైతుల వ్యవసాయ పంట భూముల్లో గ్రీన్‌ఫీల్డ్‌ హైవేకు చెందిన అధికారులు, సిబ్బంది డ్రోన్‌ కెమెరాలతో సర్వే చేపట్టారు. విషయం తెలుసుకుని రైతులు అక్కడికి చేరుకున్నారు. సర్వే చేస్తున్న డ్రోన్‌ కెమెరాలను వారి వద్ద నుంచి రైతులు స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే నిర్మాణానికి సర్వే ఏ విధంగా చేపడతారని వారిని రైతులు నిలదీశారు. పంట భూముల నుంచి రోడ్డు నిర్మాణాన్ని చేపట్టడాన్ని తామ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు. రూ.కోట్లాది రూపాయల విలువైన పంట భూముల నుంచి గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే నిర్మాణాన్ని చేపట్టనివ్వబోమని తేల్చి చెప్పారు.

ఈ నేపథ్యంలో అధికారులు, రైతుల నడుమ కాసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. రైతులు స్వాధీనం చేసుకున్న డ్రోన్‌ కెమెరాను దామెర పోలీస్‌ స్టేషన్‌లో పోలీసులకు అప్పగించారు. ఈ సందర్భంగా దామెర మండలం పులుకుర్తి, ఊరుగొండతో పాటు నడికూడ మండలం వెల్లంపల్లి, గట్లకానిపర్తి, పోచారం, గంగదేవిపల్లి తదితర గ్రామాలకు చెందిన భూ నిర్వాసిత రైతలు బూర్గుల రాంచందర్‌రావు, టి.రాజగోపాల్‌, బొల్లు రాజిరెడ్డి, గొంది రవీందర్‌రెడ్డి, పెండ్లి సరోజన, అబ్బాడి రవీందర్‌రెడ్డి, చల్ల స్వరూప, పెండ్లి మల్లారెడ్డి, నాగభూషణం తదితర రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-18T00:08:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising