ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

హ్యాపీ జర్నీ..

ABN, First Publish Date - 2023-12-08T23:56:18+05:30

మహిళలకు నూత న తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎన్నికల్లో కాంగ్రెస్‌ రూపొందించిన మేనిఫెస్టోలో భాగంగా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. మహిళలు, యువతులు, అమ్మాయిలతో పాటు ట్రాన్స్‌ జెండర్‌లు కూడా రాష్ట్ర పరిధిలో ఎంత దూరమైనా ఆర్టీసీ బస్సుల్లో ఇక నుంచి ఉచితంగా ప్రయాణం చేయవచ్చు.

జనగామ డిపోకు చెందిన బస్సులో మహిళా ప్రయాణికులు

నేటి నుంచే మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం

మధ్యాహ్నం 2 గంటల నుంచి అమలు

తెలంగాణలో ఎక్కడికైనా వెళ్లే అవకాశం

ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌ బస్సులకే వర్తింపు

జిల్లాలో 2,67,116 మంది మహిళలు

సగటున రోజుకు 18 వేల మంది ప్రయాణం

జనగామ టౌన్‌, డిసెంబరు 8: మహిళలకు నూత న తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎన్నికల్లో కాంగ్రెస్‌ రూపొందించిన మేనిఫెస్టోలో భాగంగా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. మహిళలు, యువతులు, అమ్మాయిలతో పాటు ట్రాన్స్‌ జెండర్‌లు కూడా రాష్ట్ర పరిధిలో ఎంత దూరమైనా ఆర్టీసీ బస్సుల్లో ఇక నుంచి ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉచిత ప్రయాణానికి సంబంధించి ఆర్టీసీ అధికారులకు గైడ్‌లైన్స్‌ పంపించింది. ఏదైనా గుర్తింపుకార్డు వెంట తీసుకుని ప్రయాణం చేయవచ్చని, ఎలాంటి షరతులు లేవని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయంపై మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మహిళా విద్యార్థినులు చాలా మంది ఆర్టీసీ బస్సుల్లో నెలవారీ పాసులు తీసుకుంటూ విద్యాసంస్థలకు వెళ్తుంటారు. ఇప్పుడు ఉచిత ప్రయాణం కల్పించడంతో విద్యార్థినులతో పాటు వారి తల్లిదండ్రులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌, మినీ బస్సుల్లో...

ఉచిత ప్రయాణానికి సంబంధించి డీలక్స్‌, గరుడ, లగ్జరీ, సూపర్‌ లగ్జరీ వంటి పెద్ద బస్సులు మినహా అన్ని బస్సుల్లో ప్రయాణానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌, మినీ బస్సుల్లో మహిళలు ఉచిత ప్రయాణం చేయవచ్చని జనగామ డిపో మేనేజర్‌ జ్యోత్స్న తెలిపారు. మొదటి మూడు రోజుల పాటు ఎలాంటి గుర్తింపు కార్డు లేకున్నా ప్రయాణానికి వెసులుబాటు కల్పిస్తామని ఆమె చెప్పారు. వారికి అలవాటు కావాలనే ఉద్దేశ్యంతో మూడు రోజుల పాటు ఈ అవకాశం కల్పించినట్లు వివరించారు.

రోజుకు 18 వేల మంది మహిళల ప్రయాణం..

జనగామ ఆర్టీసీ డిపో పరిధిలో ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌ కలిపి వంద బస్సులు ఉండగా వీటిలో సుమారుగా రోజుకు 18 వేల మంది ప్రయాణం చేస్తున్నారు. ఇందులో కొందరు సుదూర ప్రాంతాలకు వెళ్లే వారు కాగా.. మరికొందరు వంద కిలోమీటర్ల లోపు ప్రయాణించే వారుంటారు. ఇప్పుడు వీరందరికి గృహలక్ష్మి పథకం కింద లబ్ధి చేకూరనుంది. మరోవైపు వివిధ ప్రాంతాల నుంచి జనగామకు అమ్మాయిలు చదువుకునేందుకు వస్తుంటారు. ఇలాంటి నెలవారీ బస్‌ పాస్‌ కలిగిన వారు సుమారు 3,600 మంది ఉన్నారు. ఇక నుంచి వీరికి పాస్‌ తీసే శ్రమ ఉండదు. జనగామ జిల్లాలో మొత్తం జనాభా 5,34,991 మంది ఉండగా... ఇందులో మహిళలు 2,67,116 మంది ఉన్నారు. వీరందరు ఉచిత బస్సు ప్రయాణం కింద లబ్ధి పొందవచ్చు. హైదరాబాద్‌ నుంచి ఈ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం మధ్యాహ్నం 1:30 గంటలకు లాంఛనంగా ప్రారంభించనున్నారు. అనంతరం జనగామ డిపోలో మధ్యాహ్నం 2 గంటలకు ఆర్టీసీ అధికారులు ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి ఎక్సైజ్‌ శాఖ జిల్లా అధికారి కృష్ణప్రియను ముఖ్య అతిథిగా ఆర్టీసీ డీఎం జ్యోత్స్న ఆహ్వానించారు.

కండక్టర్లు, డ్రైవర్లకు గైడ్‌లైన్స్‌..

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంలో భాగంగా ఆర్టీసీ అధికారులు కండక్టర్లు, డ్రైవర్లకు పలు గైడ్‌లైన్స్‌ ఇచ్చారు. వయసుతో సంబంధం లేకుండా ప్రతీ మహిళలను అనుమతించాలని సూచించారు. మొదటి మూడు రోజుల పాటు గుర్తింపు కార్డు కోసం ఒత్తిడి చేయొద్దన్నారు. ప్రతీ ట్రిప్పులో మహిళలు ప్రయాణించిన వివరాలను స్టార్‌ డాక్యుమెంట్‌లో పొందుపరచాలన్నారు. రద్దీ ఎక్కువ ఉండే అవకాశం ఉన్నందున ఓర్పు, సహనంతో కండక్టర్లు, డ్రైవర్లు ప్రవర్తించాలని ఆదేశించారు.

Updated Date - 2023-12-08T23:56:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising