హెలీకాప్టర్‌లో రైల్వేలైన్ సర్వే
ABN, First Publish Date - 2023-01-18T00:01:38+05:30
విజయవాడ - మధ్యప్రదేశ్ ఇటార్సీ వరకు రైల్వే మూడో లైన్‌కోసం రైల్వే శాఖ ఏరియల్ సర్వే నిర్వహిస్తోంది. ఇందుకోసం మంగళవారం సాయంత్రం రైల్వేకు సంబంధించిన ఇద్దరు ఉన్నతాధికారులు తుంబి ఎయిర్‌లైన్ హెలీకాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే ప్రారంభించారు. సర్వే నిర్వహిస్తుండగా సాయంత్రం కావడంతో కాజీపేట సెయింట్ గ్యాబ్రియేల్ స్కూల్ మైదానంలో హెలీకాప్టర్‌ను ల్యాండ్ చేశారు.
కాజీపేట, జనవరి 17: విజయవాడ - మధ్యప్రదేశ్ ఇటార్సీ వరకు రైల్వే మూడో లైన్‌కోసం రైల్వే శాఖ ఏరియల్ సర్వే నిర్వహిస్తోంది. ఇందుకోసం మంగళవారం సాయంత్రం రైల్వేకు సంబంధించిన ఇద్దరు ఉన్నతాధికారులు తుంబి ఎయిర్‌లైన్ హెలీకాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే ప్రారంభించారు. సర్వే నిర్వహిస్తుండగా సాయంత్రం కావడంతో కాజీపేట సెయింట్ గ్యాబ్రియేల్ స్కూల్ మైదానంలో హెలీకాప్టర్‌ను ల్యాండ్ చేశారు. ఇద్దరు రైల్వే అధికారులు, ఒక పైలెట్, కో-పైలెట్ మొత్తం నలుగురు ఈ హెలీకాప్టర్‌లో వచ్చినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల ఉన్నతాధికారుల ఆదేశాలతో కాజీపేట సీఐ మహేందర్ రెడ్డి బృందం హెలీకాప్టర్‌కు బందోబస్తు నిర్వహించారు. బుధవారం ఉదయం హెలీకాప్టర్ బృందం రైల్వే ఏరియల్ సర్వే పూర్త్తిచేసుకుని తిరిగి హైదరాబాద్‌కు వెళ్తుందని పోలీసులు తెలిపారు.
Updated Date - 2023-01-18T00:01:39+05:30 IST