ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ప్రజలు కోరుకున్న ప్రభుత్వం ఆవిష్కృతమైంది..

ABN, Publish Date - Dec 23 , 2023 | 12:29 AM

‘నాలుగున్నర కోట్ల ప్రజలు కోరుకున్న ప్రజా ప్రభుత్వం తెలంగాణలో ఆవిష్కృతమైంది.. తమ గళాన్ని విని, సమస్యను పరిష్కరించే పాలన రావాలని ప్రజలు కోరుకున్నారు.. ఇక మోసపోయింది చాలు, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్సే తమ ఆశలకు జీవం పోయగలదని భావించి ప్రజలు కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పర్చుకుని, దొరల పాలనకు చరమగీతం పాడారు.’ అని రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు.

నియంతృత్వ సంకెళ్లు తెగడంతో ‘తెలంగాణ’ విముక్తి పొందింది

సబ్బండ వర్గాలు పండుగలా భావిస్తున్నాయి..

ముఖ్యమంత్రి రేవంత్‌ మాటే మా పాలనకు గీటురాయి..

ఆరు నెలలు కాదు, 20 ఏళ్ల వరకు కాంగ్రె్‌సకు ఢోకా లేదు..

వరంగల్‌ నగరాన్ని అభివృద్ధి పరచడమే ధ్యేయం

‘ఆంధ్రజ్యోతి’తో రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ

హనుమకొండ సిటీ, డిసెంబరు 22: ‘నాలుగున్నర కోట్ల ప్రజలు కోరుకున్న ప్రజా ప్రభుత్వం తెలంగాణలో ఆవిష్కృతమైంది.. తమ గళాన్ని విని, సమస్యను పరిష్కరించే పాలన రావాలని ప్రజలు కోరుకున్నారు.. ఇక మోసపోయింది చాలు, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్సే తమ ఆశలకు జీవం పోయగలదని భావించి ప్రజలు కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పర్చుకుని, దొరల పాలనకు చరమగీతం పాడారు.’ అని రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టాక శుక్రవారం రాత్రి ఆమె హనుమకొండకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె తన మనోగతాన్ని ‘ఆంధ్రజ్యోతి’తో పంచుకున్నారు...

ప్రశ్న: కాంగ్రెస్‌ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమేంటి...?

జవాబు : ఒక్కటే కారణం.. ప్రజలు కేసీఆర్‌ కబంధ హస్తాల నుంచి విముక్తి కావాలనుకున్నారు. రాష్ట్రాన్ని ఆ కుటుంబ సంకెళ్ల నుంచి బయటపడేయాలని నిశ్చయించారు. మరోమారు మోసపోవద్దని నిర్ణయించుకున్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్సే తమ ఆశలను నిజం చేయగలదని ప్రజలు విశ్వసించారు. ఫలితమే తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు. అంతే మరో మాటే లేదు. నియంతృత్వ సంకెళ్లు తెగాయి. తెలంగాణకు స్వేచ్ఛ లభించింది.

ప్ర : బీఆర్‌ఎస్‌ది ప్రజా వ్యతిరేక పాలన అని ఎలా చెబుతున్నారు..?

జ : మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణను అప్పులమయంగా మార్చారు. అసెంబ్లీ సమావేశాల ద్వారా బీఆర్‌ఎస్‌ ఆర్థిక విధ్వంస పాలనను ప్రజల ముందు ఉంచాం. రాష్ట్రాన్ని అప్పులమయంగా మార్చింది కేసీఆర్‌ ప్రభుత్వం. ఇంతకంటే ఏం నిదర్శనం కావాలి ప్రజావ్యతిరేక పాలన అనడానికి. కేసీఆర్‌ కుటుంబ స్వార్థం కోసమే తప్ప ప్రజలు కోరుకునే పాలన జరగలేదు.

ప్ర : అలవికాని హామీలతోనే కాంగ్రెస్‌కు పవర్‌ దక్కిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అంటున్నారు..?

జ : అన్ని కోణాల్లో విశ్లేషించే ఆరు గ్యారంటీల రూపకల్పన జరిగింది. ఇప్పటికే రెండు గ్యారెంటీలు అమల్లోకి వచ్చాయి. 28నుంచి మరో రెండు గ్యారెంటీలు అమల్లోకి రానున్నాయి. ప్రకటించిన ఆరు గ్యారెంటీలను ప్రజలకు వర్తింప చేయడం ’గ్యారెంటీ’. కేసీఆర్‌లా అధికారం కోసం అప్పటికప్పుడు హామీలు గుప్పించడం.. ప్రజలను నమ్మించి మోసం చేయడం మాకు రాదు. కాంగ్రెస్‌ అంటే నమ్మకం. ప్రజల ఆశలను నిజం చేయడం. అందుకే ఆంధ్రప్రదేశ్‌లో దెబ్బతింటామని తెలిసినా సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు.

ప్ర : కాంగ్రెస్‌ పాలన స్వేచ్ఛాయుత పాలన అని ఎలా చెబుతారు?

జ : కేసీఆర్‌ నియంతృత్వ పాలన ముగియగానే ఉద్యోగులు టపాసులు పేల్చారు. రైతు రాజ్యం ఏర్పడబోతుందని రైతులు హర్షించారు. ఉద్యోగాలు లభించనున్నాయంటూ నిరుద్యోగులు సంతోషం వెలిబుచ్చారు. ఇక మహిళా సంక్షేమానికి బాటలు పడ్డాయని మహిళలు.. ఇలా సబ్బండ వర్గాలు సంతోషంతో తెలంగాణలో పండుగ వాతావరణం ఏర్పడింది. ఇంతకంటే ఇంకేమి కావాలి కాంగ్రెస్‌ ప్రభుత్వానిది ప్రజలు కోరుకునే స్వేచ్ఛాయుత పాలన అని.

ప్ర : పాలకులం కాదు.. ప్రజా సేవకులం.. అనే నినాదానికి పరిపూర్ణతను కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇస్తుందా..?

జ : నూటికి నూరుపాళ్లు పరిపూర్ణత ఇస్తాం. ముఖ్యమంత్రి రేవంత్‌ అన్న మాటే మా పాలనకు గీటురాయి. మేం కచ్చితంగా ప్రజా సేవకులంగానే ప్రజల ముంగిట ఉంటాం.

ప్ర : ఆరు నెలల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలుతుందని బీఆర్‌ఎస్‌ నేతలంటున్నారు...

జ : బీఆర్‌ఎ్‌సను ప్రజలు తిరస్కరించినా ఇంకా ఆ పార్టీ నేతలకు అధికార వ్యామోహం తగ్గడం లేదు. భ్రమల్లో బతుకుతున్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అడ్డదారులు తొక్కే విష సంస్కృతి వాళ్లది. కానీ వాళ్ల ఆటలు చెల్లవు. ముందుగా వాళ్లను బీఆర్‌ఎ్‌సను కాపాడుకోమనండి. రానున్న 20 ఏళ్ల వరకు రాష్ట్రంలో కాంగ్రె్‌సకు ఢోకా లేదు.

ప్ర : వరంగల్‌ నగరాభివృద్ధిపై మీ విజన్‌ ఏంటి..?

జ : నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యం. మాస్టర్‌ప్లాన్‌, అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ ఇతర ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సమీక్షలు జరగాల్సి ఉంది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నగరాభివృద్ధిని విస్మరించింది. టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటుపై హంగామా చేసి వదిలేశారు. నగర పారిశుధ్యం మెరుగ్గా ఉండాలి. లేకుంటే శానిటరీ ఇన్‌స్పెక్టర్లే బాధ్యులవుతారు. పర్యావరణాన్ని సమష్ఠిగా కాపాడుకోవాలి. ప్లాస్టిక్‌రహిత నగరంగా వరంగల్‌ను తీర్చిదిద్దాలి.

ప్ర : ఆలయాల అభివృద్ధిపై నిర్ణయాలు ఏమిటి?

జ : దేవాదాయ శాఖపై ఇప్పటికే మూడు మార్లు సమీక్షలు జరిపాం. ముఖ్యంగా ఆలయాల ధ్వజస్తంభాలకు కలపను గతంలో కాకుండా ఉచితంగానే సరఫరా చేయాలని నిర్ణయించాం. ప్రభుత్వ నిబంధనలకు లోబడే అమలు ఉంటుంది. అదేవిధంగా రాష్ట్రంలోని అన్ని ఆలయాల అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాం. నిలిచిన ఆలయ అభివృద్ధి పనులను పూర్తి చేసే లక్ష్యంతో ఉన్నాం.

ప్ర : ఉమ్మడి వరంగల్‌ జిల్లా అధికారులకు మీరిచ్చే సందేశం?

సురేఖ: నిర్బంధం తొలిగింది. ప్రజలకు స్వేచ్ఛగా సేవలు అందించండి. అవినీతిని సహించేది లేదు. ప్రజల సమస్యలు సత్వరమే పరిష్కారం కావాలి. ప్రజల కోసమే ఏర్పడ్డ ప్రభుత్వమిది. దీనిని దృష్టిలో పెట్టుకొని సేవలు అందించాలని కోరుతున్నాం.

Updated Date - Dec 23 , 2023 | 12:29 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising