కార్మికులకు 32 ఎకరాలు
ABN, First Publish Date - 2023-03-04T00:02:31+05:30
జంజామిల్లు మాడిఫైడ్ వలంటరీ రిటైర్‌మెంట్ కార్మి కులకు హసన్‌పర్తి మండలం అనంతసాగర్, మడిపల్లి గ్రామాల పరిధిలోని కాకతీ య పట్టణాభివృద్ధి సంస్థ (కుడా)కి చెందిన 32ఎకరాలు దక్కింది. ఈమేరకు సు ప్రీంకోర్టు ఆర్డర్ కాపీని న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ శుక్రవారం ‘కుడా’ అధికారు లు, కార్మికులకు అందజేశారు. 318మంది మాడిఫైడ్ వలంటరీ రిటైర్‌మెంట్ కార్మి కులకు 200గజాల చొప్పున ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ 17ఏళ్లుగా హైకోర్టు సీనియ ర్ న్యాయవాది ప్రభాకర్ చేస్తున్న పోరాటానికి విజయంగా
ఆజంజాహి మిల్ కార్మికులకు ఔటర్‌రింగ్‌రోడ్డులో ప్లాట్లు
సుప్రీం ఆర్డర్ కాపీని ‘కుడా’, కార్మికులకు అందించిన న్యాయవాది
గిర్మాజిపేట, మార్చి 3 : ఆజంజామిల్లు మాడిఫైడ్ వలంటరీ రిటైర్‌మెంట్ కార్మి కులకు హసన్‌పర్తి మండలం అనంతసాగర్, మడిపల్లి గ్రామాల పరిధిలోని కాకతీ య పట్టణాభివృద్ధి సంస్థ (కుడా)కి చెందిన 32ఎకరాలు దక్కింది. ఈమేరకు సు ప్రీంకోర్టు ఆర్డర్ కాపీని న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ శుక్రవారం ‘కుడా’ అధికారు లు, కార్మికులకు అందజేశారు. 318మంది మాడిఫైడ్ వలంటరీ రిటైర్‌మెంట్ కార్మి కులకు 200గజాల చొప్పున ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ 17ఏళ్లుగా హైకోర్టు సీనియ ర్ న్యాయవాది ప్రభాకర్ చేస్తున్న పోరాటానికి విజయంగా ‘కుడా’కు చెందిన మిల్లు ఖాళీ స్థలంతోపాటుగా దాని ఎదురుగా ఉన్న ఓ సిటీలోని భూమి కలిపి 22.24 ఎక రాల భూమి ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు గత ఏడాది అక్టోబరు 26న ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ భూములు అత్యంత విలువైనవి కావడంతో పాటు గా వరంగల్ కలెక్టరేట్ నిర్మాణం ఈ స్థలం పక్కనే ఉండటంతో ‘కుడా’ అధికారులు ఈ భూములకు ప్రత్యామ్నాయంగా మడిపల్లి సమీపంలోని ‘కుడా’ మా సిటీ వెం చర్‌ను కార్మికులకు ప్రతిపాదించారు. కార్మికులు దీనికి అంగీకరించకపోవడంతో అధికారులు అవుటర్‌రింగ్ రోడ్డుకు సమీపంలోని మడిపల్లి, ఉనికిచెర్లలోని 32ఎక రాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. దీనికి కార్మికులు అంగీకరించడంతో అధికా రులు రోడ్లు, డ్రైనేజి, విద్యుత్ దీపాల సదుపాయాలతో పూర్తిస్థాయి లేఅవుట్ చేసి 318 కార్మికులకు ఒక్కొక్కరికి 200గజాల చొప్పుల ప్లాటింగ్ చేసి 32 ఎకరాలు కార్మి కులకు ఇస్తున్నట్లు కుడా అధికారులు గతనెల 16న సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. దీంతో అన్ని మౌలిక సదుపాయాలతో మడిపల్లి, అనంతసాగర్ గ్రామాల్లో మూడు నెలల్లోగా కార్మికులకు ఇవ్వాలని సుప్రీంకోర్టు గతనెల 24న ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం న్యాయవాది ప్రభాకర్ హనుమకొండలోని కుడా కార్యాలయానికి చేరుకుని సుప్రీంకోర్టు ఉత్తర్వులు అధికారులకు అందచేశా రు. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా 3 నెలల్లోగా అన్ని మౌలిక సదుపాయాలతో కార్మికులకు ప్లాటింగ్ చేసి భూమి రిజిస్ట్రేషన్ చేసి అప్పగించాలని కోరారు.
న్యాయవాదిని సత్కరించిన కార్మికులు
ఇదిలా ఉండగా 17 ఏళ్లపాటు సుదీర్ఘ న్యాయపోరాటం చేసి, ఇంటిస్థలం ఇప్పి స్తున్న న్యాయవాది ప్రభాకర్‌ను శుక్రవారం కార్మికులు సత్కరించారు. వరంగల్ రైల్వేస్టేషన్ రోడ్డులోని మున్సిపల్ బాపూజీ కమ్యూనిటీ హాల్‌లో ఆజంజాహిల్లు మాడిఫైడ్ వలంటరీ రిటైర్డ్ (2002) ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కార్మికులకు సుప్రీంకోర్టు ఉత్తర్వులను న్యాయవాది అందచేశారు. కాపీని చూడటంతోనే కార్మి కులు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అజంజాహిల్లు మాడిఫైట్ వలంటరీ రిటైర్డ్ కార్మికుల సంఘం అధ్యక్షుడు యిప్ప ఆదినారా యణ, కార్యదర్శి జన్ను ప్రభాకర్, ఉపాధ్యక్షుడు సాం బయ్య, నాయ కులు చంద్రమౌళి, నర్సింగం,రాజు పాల్గొన్నారు.
Updated Date - 2023-03-04T00:02:31+05:30 IST