ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పేస్కేల్‌ ఎప్పుడో..?

ABN, First Publish Date - 2023-10-30T23:51:10+05:30

గ్రామాల్లో కూలీలకు ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ద్వారా పనులు కల్పిస్తూ వలసలను నివారిస్తూ.. వారి ఆర్థికాభ్యున్నతికి పాటుపడుతున్న ఉపాధి హామీ ఉద్యోగుల కష్టాలు మాత్రం తీరడం లేదు. తమకు రెగ్యులరైజేషన్‌ అవుతుందన్న ఆశతో 17 ఏళ్లుగా ఉపాధి హామీని నమ్ముకుని చాలీచాలని వేతనాలతో ఉద్యోగులు పని చేస్తున్నారు. రెగ్యులరైజేషన్‌ చేసి పేస్కేల్‌ అమలు చేయాలని అనేక ఏళ్లుగా డిమాండ్‌ చేస్తున్నప్పటికి ఆచరణకు నోచుకోక పోవడంతో ఉపాధి ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు.

తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మెలో రిలే దీక్షల్లో పాల్గొన్న ఉపాధి హామీ ఉద్యోగులు (ఫైల్‌)

ఉపాధి హామీ ఉద్యోగులకు తప్పని నిరీక్షణ

ఉద్యోగ భద్రతపై భయాందోళన

17 ఏళ్లుగా ఎదురుచూపులు

జిల్లాలో 150 మంది విధుల నిర్వహణ

కురవి, అక్టోబరు 30 : గ్రామాల్లో కూలీలకు ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ద్వారా పనులు కల్పిస్తూ వలసలను నివారిస్తూ.. వారి ఆర్థికాభ్యున్నతికి పాటుపడుతున్న ఉపాధి హామీ ఉద్యోగుల కష్టాలు మాత్రం తీరడం లేదు. తమకు రెగ్యులరైజేషన్‌ అవుతుందన్న ఆశతో 17 ఏళ్లుగా ఉపాధి హామీని నమ్ముకుని చాలీచాలని వేతనాలతో ఉద్యోగులు పని చేస్తున్నారు. రెగ్యులరైజేషన్‌ చేసి పేస్కేల్‌ అమలు చేయాలని అనేక ఏళ్లుగా డిమాండ్‌ చేస్తున్నప్పటికి ఆచరణకు నోచుకోక పోవడంతో ఉపాధి ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎన్‌ఆర్‌ఈజీఎస్‌)కు 2005లో పార్లమెంటులో చట్టం చేసి 2006 ఫిబ్రవరి 2వ తేదీన అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా బండ్లపల్లి గ్రామంలో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ప్రారంభించారు. ఈ పథకం పారదర్శకంగా అమలు పర్చడం కోసం గ్రామ స్థాయి నుంచి వివిధ హోదాల్లో 2006లో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులను నియమించింది. ఇందులో ప్రోగ్రాం మేనేజర్లు, రిసోర్స్‌ మేనేజర్లు, డీవీడీ డైరెక్టర్స్‌, ఏపీవోలు, ఈసీలు, టీఏలు, ప్లానిటేషన్‌ మేనేజర్స్‌, సూపర్‌వైజర్స్‌, కంప్యూటర్‌ ఆపరేటర్లు, బీఎఫ్‌టీ టెక్నీషియన్స్‌ ఉన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తామని ప్రకటించడంతో 4వేల మంది ఉద్యోగులు ఎంతో ఆనంద పడ్డారు. కానీ నేటి వరకు రెగ్యులరైజేషన్‌, ఉద్యోగ భద్రత గాని లభించలేదు. మహబూబాబాద్‌ జిల్లాలో 150 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఈ పథకంలో పనిచేసే ఉద్యోగులందరూ పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారే. రాష్ట్రంలో ఇప్పటి వరకు 52లక్షల 92వేల జాబ్‌కార్డులు ఉండగా అందులో 1కోటి 11లక్షల 47వేల మంది కూలీలు నమోదు చేసుకున్నారు. ఇందులో ప్రతి సంవత్సరం కనీసం 50లక్షల మందికి ఉపాధి కల్పిస్తూ కొన్ని వందల కోట్ల రూపాయల ద్వారా కూలీలకు లబ్ధి చేకూరుస్తూ దేశంలోనే అతి ఎక్కువ పని చేసిన రాష్ట్రంగా జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులను అందిస్తున్నారు. అలాగే కూలీలకు ఆదాయం సమకూర్చడమే కాదు.. సుస్థిర ఆస్తుల ఏర్పాటు లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్రంలో అనేక పనులు చేపడుతున్నారు.

భయాందోళనలో ఉపాధి ఉద్యోగులు

ఉపాధి హామీ పథకంలో పనిచేసే సుమారు 4 వేల మంది ఉద్యోగులు తెలంగాణ ఉద్యమం, సకల జనుల సమ్మెలో చురుగ్గా పాల్గొని స్వరాష్ట్ర సాధనకు ఉద్యమించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలోనైనా ఉపాధి హామీ ఉద్యోగులకు న్యాయం జరుగుతుందని ఎదురుచూస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తామని ప్రకటించడంతో ఉపాధి ఉద్యోగులు ఎంతో ఆనందపడ్డారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఉద్యోగులు ప్రతిరోజు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను కలిశారు. తమకు న్యాయం చేయండని ప్రజాప్రతినిధులను వేడుకున్నారు. ఉద్యోగ భద్రత కోసం రాష్ట్ర వ్యాప్తంగా 4వేల మంది ఉపాధి ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు.

మమ్మల్ని కనికరించండి : ఎడ్ల యాకాంబ్రం, జిల్లా ఏపీవోల సంఘం అధ్యక్షుడు

17 ఏళ్లుగా ఉపాధి హామీలో విధులు నిర్వర్తిస్తున్నాను. ఉద్యోగులందరిని రెగ్యులరైజ్‌ చేయాలి. గ్రామీణాభివృద్ధి శాఖలో పథకాలను సమర్ధవంతంగా అమలు చేస్తూ దేశంలోనే రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలిపిన ఉద్యోగులకు పేస్కేల్‌ ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 4వేల మంది ఉద్యోగులకు న్యాయం చేయాలి.

Updated Date - 2023-10-30T23:51:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising