ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బియ్యం ఫ్రీ

ABN, First Publish Date - 2023-01-04T23:29:15+05:30

జిల్లాలోని రేషన్‌ కార్డు హోల్డర్లతో పాటు వారి కుటుంబ సభ్యులు మరో సంవత్సరం పాటు ఉచిత రేషన్‌ బియ్యం పొందనున్నారు. కార్డు హోల్డర్‌ కుటుంబంలోని ప్రతీ ఒక్కరిరి 5 కిలోల ఉచిత బియ్యం ప్రభుత్వం అందించనుంది. గతంలో ప్రభుత్వం ప్రకటించిన 10 కిలోల ఉచిత బియ్యం కార్యక్రమం గతనెల (డిసెంబరు)తో ముగిసింది. అయితే కేంద్రప్రభుత్వం 5 కిలోల ఉచిత బియ్యాన్ని మరో సంవత్సరం పాటు పొడిగింపు చేస్తున్నట్లు ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మరో 12 నెలలు ఉచితమే...

మనిషికి 5 కిలోల రేషన్‌ బియ్యం...

జిల్లాలో లబ్ధి పొందనున్న 2.7 లక్షల కార్డు హోల్డర్లు

రాష్ట్ర వాటా ఉచితంపై సందిగ్ధత

సన్న బియ్యం ఇవ్వాలంటున్న లబ్ధిదారులు

వరంగల్‌ సిటీ, జనవరి4 : జిల్లాలోని రేషన్‌ కార్డు హోల్డర్లతో పాటు వారి కుటుంబ సభ్యులు మరో సంవత్సరం పాటు ఉచిత రేషన్‌ బియ్యం పొందనున్నారు. కార్డు హోల్డర్‌ కుటుంబంలోని ప్రతీ ఒక్కరిరి 5 కిలోల ఉచిత బియ్యం ప్రభుత్వం అందించనుంది. గతంలో ప్రభుత్వం ప్రకటించిన 10 కిలోల ఉచిత బియ్యం కార్యక్రమం గతనెల (డిసెంబరు)తో ముగిసింది. అయితే కేంద్రప్రభుత్వం 5 కిలోల ఉచిత బియ్యాన్ని మరో సంవత్సరం పాటు పొడిగింపు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో జిల్లా పరిధిలోని 2.7 లక్షల మంది కార్డు హోల్డర్ల కుటుంబసభ్యులకు ప్రతీ ఒక్కరికి 5 కిలోల బియ్యం ఉచితంగా అందనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం జిల్లా పౌరసరఫరాల శాఖకు మాత్రం ఏ నెల కోటాను అదే నెలలో కేటాయిస్తోంది. గతంలో రూ. 2కు కిలో బియ్యం చొప్పున 5 కిలోల బియ్యం పంపిణీ అయ్యేవి. కరోనా అనంతరం కేంద్రం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యం పంపిణీ చేసింది. బియ్యం ఉచిత పంపిణీ గత నెలతో గడువు ముగిసింది. ఈ క్రమంలో కేంద్రం రేషన్‌ కార్డుదారులకు మరో సంవత్సరం పాటు డిసెంబరు 2023 వరకు ఉచితంగానే 5 కిలోల బియ్యాన్ని అందజేయనున్నట్లు ప్రకటించింది. ఇంకా రాష్ట్రప్రభుత్వం మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న 5 కిలోల బియ్యం మాత్రమే ఉచితంగా అందనున్నాయి. అయితే ప్రతీనెల సన్న బియ్యం ఇస్తే బాగుంటుందనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. ప్రతీనెల సన్న బియ్యం ఇస్తే పీడీఎస్‌ బియ్యం పక్కదారి పట్టకుండా ఉంటుందనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. అంత్యదయ కార్డు లబ్ధిదారుకు 35 కిలోలు, అన్నపూర్ణ కార్డు లబ్ధిదారుడికి 10 కిలోలు, సాధారణ తెల్ల కార్డులోని లబ్దిదారులకు ఒక్కొక్కరికీ 5 కిలోల బియ్యం ఉచితంగా అందనున్నాయి. జనవరి కోటా కింద ఇప్పటికే 13 మండలాల్లోని 650 చౌకధరల దుకాణాలకు 6877.399 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ పంపిణీ చేసింది.

సన్న బియ్యం ఇస్తే సద్వినియోగం అవుతాయి : శాకపురం రాజేశ్వరి, కాశిబుగ్గ

చౌకధరల దుకాణాల ద్వారా ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తే సద్వినియోగం అవుతాయి. సన్నబియ్యం పంపిణీ చేయడం ద్వారా ప్రతీ కుటుంబానికి ప్రభుత్వం చేయూతనిచ్చినట్లు అవుతుంది. వండుకొని తినేందుకు ఉపయోగపడుతాయి. ఇక నుంచి ప్రతీనెల సన్న బియ్యం ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

బియ్యం దందా ఆగిపోతుంది : ముష్కె ప్రమీల, తిలక్‌రోడ్‌

సన్న బియ్యం పంపిణీ చేస్తే బియ్యం దందా పూర్తిగా నిర్మూలించ బడుతుంది. ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన బియ్యం సద్వినియోగం అవుతాయి. దొడ్డు బియ్యం ఇవ్వడంతో వాటిని తినలేక కొంత మంది అమ్ముకుం టున్నారు. చౌక ధరల దుకాణాల ద్వారా ఒక్కొసారి దొడ్డు బియ్యం పాడైపోయి వస్తున్నాయి. అలా కాకుండా ప్రతీనెల సన్న బియ్యం ఇస్తే బాగుంటుంది.

ప్రభుత్వం నెల వారి కోటా విడుదల : మూడూరి గౌరీశంకర్‌, జిల్లా పౌరసఫరాల అధికారి

మరో సంవత్సరం పాటు ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్ర కటించింది. దీనికి సంబం ధించి నెల నెల మాత్రమే మాకు ప్రభుత్వం కోటాను విడుదల చేస్తుంది. ప్రభుత్వం విడుదల చేసిన ఉచిత 5కిలోల బియ్యాన్ని మేము చౌకధరల దుకాణాలకు నిర్ధేశిత మెట్రిక్‌ టన్నుల్లో బియ్యాన్ని పంపిణీ చేస్తున్నాము. జనవరి కోటాను ఇప్పటికే అన్ని మండలాల్లోని చౌకధరల దుకాణాలకు పంపిణీ చేశాం.

Updated Date - 2023-01-04T23:29:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising