ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముగిసిన పోలీసు దేహదారుఢ్య పరీక్షలు

ABN, First Publish Date - 2023-01-04T00:33:25+05:30

తెలంగాణ రాష్ట్ర పోలీసు నియామక మండలి ఆధ్వర్యంలో హనుమకొండ కేయూ మైదానంలో గత 27 రోజులుగా నిర్వహించిన స్టైఫండరీ ఎస్‌ఐ, పోలీసు కానిస్టేబుల్‌ దేహదారుఽడ్య పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. సెలవులు, పండుగలకు ఎంపికలకు మినహాయింపు ఇవ్వగా, మిగతా 22 రోజుల పాటు మహిళలకు, పురుష అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు.

షాట్‌పుట్‌ విసురుతున్న అభ్యర్థి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనారోగ్యంగా ఉన్న వారికి చివరి రోజు ఎంపికలు

రాత పరీక్షకు 15,670 మంది ఎంపిక

హనుమకొండ క్రైం, జనవరి 3: తెలంగాణ రాష్ట్ర పోలీసు నియామక మండలి ఆధ్వర్యంలో హనుమకొండ కేయూ మైదానంలో గత 27 రోజులుగా నిర్వహించిన స్టైఫండరీ ఎస్‌ఐ, పోలీసు కానిస్టేబుల్‌ దేహదారుఽడ్య పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. సెలవులు, పండుగలకు ఎంపికలకు మినహాయింపు ఇవ్వగా, మిగతా 22 రోజుల పాటు మహిళలకు, పురుష అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు.

అర్హత

ఈ ఎంపికలకు ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన 24,612 మంది పురుష అభ్యర్థులకు హాల్‌టిక్కెట్లు జారీ చేయగా 21,581 మంది అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 12,387 మంది అభ్యర్థులు తుది రాత పరీక్షకు అర్హత సాధించినట్టు అధికారులు వెల్లడించారు. ఇంకా మహిళల విభాగంలో 4,784 మంది అభ్యర్థులకు హాల్‌ టికెట్లు జారీ చేయగా 4,458 మంది అభ్యర్థులు ఎంపికలకు హాజరయ్యారు. వీరిలో 3,283 మంది అభ్యర్థులు రాత పరీక్షకు అర్హత సాధించారు. మైదానంలో జరుగుతున్న ఈవెంట్లను ఎప్పటికప్పుడు వరంగల్‌ సీపీ ఏ.వీ రంగనాథ్‌ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ ఎంపికల సమయంలో శ్రమించి విజయవంతం చేసిన పోలీసు అధికారులు, సిబ్బంది సీపీ రంగనాథ్‌ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందించారు.

అపశ్రుతులు

ఎంపికల సమయంలో ములుగు జిల్లా పందికుంట శివారు శివతండాకు చెందిన బానోతు రాజేందర్‌ అనే అభ్యర్థి గుండెపోటుతో చికిత్స పొందుతూ ఎంజీఎంతో మృతి చెందిన విషయం తెలిసిందే. అదే విధంగా లాంగ్‌జంప్‌ సమయంలో చాలా మంది యువతీ, యువకులకు గాయాలు కావడంతో పోలీసులు స్పందించిన చికిత్స చేయించారు.

చివరి రోజు

మంగళవారం ఉదయం 5 గంటల నుంచే పోలీసు అధికారులు ఎంపికల ప్రక్రియ ప్రారంభించారు. పోలీసు అధికారులు, ఫిజికల్‌ డైరెక్టర్లు, టెక్నికల్‌ సిబ్బంది అభ్యర్థులకు సర్టిఫికెట్ల పరిశీలన చేసిన తర్వాత మహిళలకు 800, పురుషులకు 1600 మీటర్ల పరుగులో పోటీ నిర్వహించారు. పరుగులో ఉత్తీర్ణత సాధించిన వారి నుంచి బయోమెట్రిక్‌ పద్దతిలో వేలిముద్రలు, ముఖం గుర్తింపు ఆధారాలను కంప్యూటర్‌లో నమోదు చేశారు. తర్వాత అభ్యర్థులకు ఆర్‌ఎ్‌ఫఐడీ కలిగిన రిస్ట్‌బ్యాండ్‌ను చేతికి అలంకరించారు. పరుగుతో పాటు లాంగ్‌జంప్‌, షాట్‌పుట్‌ విభాగాల్లో 25మంది చొప్పున మైదానంలో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. ఈ ఎంపికల కార్యక్రమంలో పరిపాలనా విభాగం అదనపు డీసీపీ వైభవ్‌ గైక్వాడ్‌, చీఫ్‌ సూపరింటెండెంట్‌ తిరుపతిరెడ్డి, ఏఆర్‌ అదనపు డీసీపీలు సంజీవ్‌, సురే్‌షకుమార్‌, ఏసీపీలు అనంతయ్య, నాగయ్య, కృపాకర్‌, సురేంద్ర, జనార్ధన్‌రెడ్డి, సాంబయ్యలతో పాటు ఇన్‌స్పెక్టర్లు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, ఆర్‌ఎ్‌సఐలు పరిపాలనా విభాగం సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2023-01-04T00:33:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising