ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పడకేసిన పారిశుధ్యం

ABN, First Publish Date - 2023-08-21T00:11:57+05:30

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు టాయిలెట్లు లేక నానాయాతన పడుతు న్నారు. ఒంటికి, రెంటికి ఇబ్బందులు పడుతు న్నారు. చాలా పా ఠశాలల్లో మూత్రశా లలు, మరుగుదొడ్లు సరైన రీతిలో లేవు.

డీఈవో కార్యాలయం సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్డి, నడికూడ మండలం కంఠాత్మకూరులోని ప్రభుత్వ పాఠశాలలో తులుపులు లేని మరుగుదొడ్లు

పాఠశాలల్లో కంపుకొడుతున్న మరుగు దొడ్లు

ఆవరణ, గదుల్లో పేరుకుపోతున్న చెత్తాచెదారం

వర్షాకాలం అంటువ్యాధులు ప్రబలే అవకాశం

పారిశుధ్య కార్మికులు లేక ఇబ్బందులు

స్వచ్ఛ కార్మికుల తొలగింపుతో కష్టాలు

పనిభారంతో పంచాయతీ కార్మికులు సతమతం

వెంటనే నియమించాలని విద్యార్థి సంఘాల డిమాండ్‌

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు టాయిలెట్లు లేక నానాయాతన పడుతు న్నారు. ఒంటికి, రెంటికి ఇబ్బందులు పడుతు న్నారు. చాలా పా ఠశాలల్లో మూత్రశా లలు, మరుగుదొడ్లు సరైన రీతిలో లేవు. ఉన్నా నిర్వహణ లోపం కారణంగా విద్యార్థులు వాటిని ఉపయోగిం చుకోలేని పరిస్థితి. పాఠశాలల్లో పారిశుధ్య కార్మికులు లేకపోవడంతో మూత్రశాలలు, మరుగుదొడ్లు కంపుకొడుతున్నాయి. కొన్ని చోట్ల పాఠశాలల ఉపాధ్యాయులే సొంత డబ్బులతో పైవేటు పారిశుధ్య కార్మికులతో శుభ్రం చేయిస్తున్నారు. గ్రామ పంచాయతీ, మునిసిపాలిటీ సిబ్బంది పాఠశాలల్లోని టాయ్‌లెట్స్‌ని సరిగా శుభ్రం చేయడం లేదు. దీంతో పాఠశాలలు అస్తవ్యస్తంగా మారగా, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

హనుమకొండ రూరల్‌, ఆగస్టు 20: హనుమకొండ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల న్నిటిలో టాయ్‌లెట్లు అస్తవ్యస్తంగా మారిపోతు న్నాయి. మరికొన్ని చోట్ల మరుగుదొడ్లలో నీటి వసతి లేకపోవడంతో అవి నిరుపయోగంగా మారిపోయాయి. జిల్లాలో 567 పాఠశాలలు ఉండ గా వీటిలో 54,347 మంది విద్యార్థులు చదువుకుం టున్నారు. చాలా పాఠశాలల్లో మూత్రశాలలు, మరుగుదొడ్ల నిర్వహణ సరిగా లేక ఆధ్వాన్న స్థితికి చేరుకుంటున్నాయి. వాటి చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగి చిత్తడిగా మారుతున్నాయి. విద్యార్ధులు, ఉపాధ్యాయులు అటుగా వెళ్లడానికి జంకుతున్నారు. ‘మన ఊరు– మన బడి’ కార్యక్రమంలో జిల్లాలో మొదటి విడతలో మొత్తం 176 పాఠశాలలు ఎంపికయ్యాయి. వాటిల్లో ప్రారంభించిన 359 టాయ్‌లెట్లు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి. మరికొద్ది రోజులు అవి పూర్తయి వినియోగంలోకి వచ్చినా పారిశుధ్య కార్మికులు లేక అవి కూడా పాత టాయ్‌లెట్లు పరిస్థితికి చేరుకునేలా ఉంది.

స్వచ్ఛ కార్మికుల తొలగింపుతో..

2015లో ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుధ్య పనుల కోసం రాష్ట్ర విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో స్వచ్ఛ కార్మికు లను నియమించుకునేందుకు సమగ్ర శిక్ష గ్రాంటును ప్రభుత్వం కేటాయించింది. ఇందులో భాగంగా జిల్లాలో 680 మంది స్వచ్ఛ కార్మికులు సమగ్ర శిక్ష నిధులతో పని చేశారు. పాఠశాలలో 40 మందిలోపు విద్యార్థులుంటే ఒకరిని రూ.2వేలు, అంతకంటే ఎక్కువ మంది విద్యార్థు లుంటే ఇద్దరు కార్మికులను రూ.2500 చొప్పున వేతనంతో నియమితులయ్యారు. అతితక్కువ వేతనంతోనే ఈ కార్మికు లు నిత్యం పాఠశాల ప్రాంగణాలు, తరగతి గదులు, టాయిలెట్లను శుభ్రం చేసేవారు. ఉన్నత పాఠశాలల్లో వందలాది మంది విద్యార్థులకు వీరి సేవలు ఎంతో విలువైనవిగా కొనసాగాయి. అయితే వీరిని 2020 మే నెలలో ప్రభుత్వం తొలగించింది. ఈ పనులను పంచాయతీ సిబ్బంది (మల్టీపర్పస్‌ వర్కర్స్‌) చేయాలని ఆదేశించింది.

పంచాయతీల ఆధ్వర్యంలో..

కరోనా అనంతరం గ్రామ పంచాయతీ, మునిసిపా లిటిల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు.. వారి పరిధి లోని పాఠశాలల్లో పారిశుధ్య పనులు చేపట్టాలని ప్రభు త్వం ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం పంచాయతీ కార్మికులు తమ పరిధిలోని వారంలో నాలుగు రోజులకో సారి తమ పరిధిలోని పాఠశాలల ఆవరణలు, తరగతి గదులను శుభ్రం చేయాల్సి ఉంది. అయితే వారు మాత్రం తరగతి గదులను నామమాత్రంగా శుభ్రం చేస్తున్నారు తప్పా మూత్రశాలలు, మరుగుడొడ్లను పట్టించుకోవడం లేదని విద్యార్ధులు, ఉపాధ్యాయులు వాపోతున్నారు. పాఠశాలల్లో పారిశధ్య పనులు చేయించడానికి సర్పంచులు, పంచాయతీ కార్యదర్శుల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఉపాధ్యా యులంటున్నారు.

మల్టీపర్పస్‌ వర్కర్లు

గ్రామ పంచాయతీ కార్యాలయంతో పాటు గ్రామ పరిధిలోని ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా పారిశుఽ ద్య పనులు కూడా చేయడం వీరి బాధ్యత. గతంలో పాఠశాలల్లో స్వచ్ఛ కార్మికులు ఉన్నారు కనుక మల్టీపర్సస్‌ వర్కర్ల సేవలను వినియోగించు కోవలసిన అవసరం ఏర్పడలేదు. స్వచ్ఛకార్మికులను తొలగించినందువల్ల ఇప్పుడు పాఠశాలల్లో పారిశుధ్య పనుల బాధ్యతను వీరికి అప్పగిస్తూ పంచాయతీ రాజ్‌ కమిషనర్‌ సర్క్యులర్‌ జారీ చేశారు. మల్టీపర్పస్‌ వర్కర్లు తమ గ్రామ పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలను శుభ్రం చేయాల్సి ఉంటుంది. పాఠశాల కూడా ప్రభుత్వ సంస్థే కనుక అక్కడ కూడా పని చేయడం వీరి విధి అని వివరిస్తున్నారు. వారంలో రెండుసార్లు పాఠశాలలను శుభ్రం చేస్తే సరిపోతుంది. అంతేగానీ వారిని శాశ్వతంగా అక్కడే పని చేయమనడం లేదని చెబుతున్నారు.

మా వల్లకాదు..

అయితే పంచాయతీ పారిశుధ్య సిబ్బంది వాదన మరో విధంగా ఉంది. ఇప్పటికే తమపై పని భారం పెరిగిందని, ఇప్పుడు పాఠశాలలను కూడా అప్పగిస్తే ఆభారం మరింత ఎక్కువవుతుందంటున్నారు. పాఠశాలల ఆవరణల వరకు శుభ్రం చేస్తాం కానీ.. అందులోని గదులన్నిటినీ ఊడ్వడం, మరుగుదొడ్లు, మూత్రశాలలను శుభ్రం చేయడం, కుర్చీలు, బెంచీలను సర్దడం, బీరువాలను తుడవడం వంటి పనులను చేయలేమని నిస్సహాయత వ్యక్తం చేస్తు న్నారు. అయితే పాఠశాలల్లో వర్షాకాలం వల్ల అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలల్లో పారిశుధ్యం మెరుగుపడాలంటే పారిశుధ్య కార్మికులను వెంటనే ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

పాఠశాలల్లో పరిశుభ్రత నెలకొల్పాలి

– పెండెం రాజు, టీఎస్‌ యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి, హనుమకొండ

మన ఊరు– మనబడి పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం పారిశుధ్య కార్మికులను తొలగించడం అన్యాయం. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అరకొర వేతనం చెల్లించడం మూలంగా పారిశుధ్య కార్మికులు ముందుకు రావడం లేదు.

విద్యార్థుల సంఖ్యను బట్టి మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలి

– బి.నర్సింహారావు, పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు

ప్రతి పాఠశాలకు ఇద్దరు పారిశుధ్య కార్మికులను రెగ్యూలర్‌ ప్రాతిపదికన తక్షణమే నియమించాలి. విద్యార్థుల సంఖ్యకనుగుణంగా మరుగుదొడ్లతో పాటు ఇతర మౌలిక వసతులు కల్పిం చాలి. మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులు తాగునీటికి సైతం ఇబ్బందులు పడాల్సి వస్తోంది. వర్షాలతో నీరు నిలిచే పాఠశాలల్లో మొరం పోయించి చదువు చేయాలి.

Updated Date - 2023-08-21T00:11:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising