అభివృద్ధిలేని ఆలయాలు
ABN, First Publish Date - 2023-02-11T00:22:21+05:30
ఆధ్యాత్మికను పంచుతున్న ఆలయాలు అభివృద్ధికి నోచుకోకపోవడంతో భక్తులు మండిపడుతున్నారు. స్వరాష్ట్రం వస్తే దేవాలయాలు బాగుపడతాయని భావిస్తే.. అవేవీ జరగడం లేదని వాపోతున్నారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖను కనీసం పట్టించుకునే వారే కరువయ్యారు. ప్రభుత్వం నుంచి ఈ శాఖకు నిధులు లేక ఆలయాల అభివృద్ధి కుంటుపడింది. కాకతీయుల ఆలయాలు ప్రాభవం కోల్పోతున్నాయి. జిల్లా వ్యాప్తంగా చిన్న, పెద్ద కలుపుకొని మొత్తం 400 దేవాలయాలున్నాయి. కాకతీయులు నిర్మించిన దేవాలయాలతోపాటు స్వయంభు దేవాలయాలు ఉన్నాయి. వీటిలో ఆదాయం కలిగిన ఆలయాలు దాదాపు 50 వరకు ఉన్నాయి.
ఆదాయమున్నా... కమిటీల ఊసేలేదు..
ఒక్కో ఈవోకు ఐదారు ఆలయాలు..
ఇన్‌చార్జుల అధికారులతో సరిపుచ్చుతున్న వైనం..
నిధులు కేటాయించని ప్రభుత్వం
భక్తులు, దాతలతో పర్వదినాల్లో ఏర్పాట్లు..
వరంగల్ కలెక్టరేట్, ఫిబ్రవరి 10 : ఆధ్యాత్మికను పంచుతున్న ఆలయాలు అభివృద్ధికి నోచుకోకపోవడంతో భక్తులు మండిపడుతున్నారు. స్వరాష్ట్రం వస్తే దేవాలయాలు బాగుపడతాయని భావిస్తే.. అవేవీ జరగడం లేదని వాపోతున్నారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖను కనీసం పట్టించుకునే వారే కరువయ్యారు. ప్రభుత్వం నుంచి ఈ శాఖకు నిధులు లేక ఆలయాల అభివృద్ధి కుంటుపడింది. కాకతీయుల ఆలయాలు ప్రాభవం కోల్పోతున్నాయి. జిల్లా వ్యాప్తంగా చిన్న, పెద్ద కలుపుకొని మొత్తం 400 దేవాలయాలున్నాయి. కాకతీయులు నిర్మించిన దేవాలయాలతోపాటు స్వయంభు దేవాలయాలు ఉన్నాయి. వీటిలో ఆదాయం కలిగిన ఆలయాలు దాదాపు 50 వరకు ఉన్నాయి.
అంతా.. ఇన్‌చార్జీల పాలన..
జిల్లా వ్యాప్తంగా ఈవో స్థాయి కలిగిన 17 దేవాలయాలు ఉండగా, కేవలం నలుగురు అధికారులు మాత్రమే పనిచేస్తున్నారు. ఒక ఈవో స్థాయి అధికారి నాలుగు దేవాలయాలకు ఇన్‌చార్జి అధికారిగా కొనసాగుతున్నారు. పూర్తి స్థాయిలో ఈవోలు లేక ఇన్‌చార్జీలతోనే నెట్టుకొస్తున్నారు. ఏ ఆలయానికి కూడా ఇప్పటి వరకు కమిటీలను ఏర్పాటు చేయలేదు. ఆదాయం కలిగిన శ్రీరామ లింగేశ్వర దేవాలయం, శ్రీదుర్గేశ్వరాలయాలకు మాత్ర మే కమిటీలు ఉన్నాయి.
దాతలసాయంతో ఏర్పాట్లు...
ఆలయాల్లో పర్వదినాలు, కార్తీక, శ్రావణ మాసాల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఈ సమయాల్లో ఆలయాల్లో కమిటీలు లేక ఉత్సవాల నిర్వహణ ఇబ్బందికరంగా మారుతోంది. చాలా చోట్ల భక్తుల సహకారంతో ఆలయాల్లో పూజా, సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దాతలు, సేవాకర్తలు, స్వచ్ఛంద సంస్థలు స్వచ్ఛందంగా భక్తులకు మౌలిక వసతులు కల్పిస్తున్నాయి.
ఎవరికీ పట్టని ఆలయాలు..
వరంగల్ జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాలు రాయపర్తి, సన్నూరు, కొమ్మాల, గీసుగొండ, చెన్నారావుపేట, నర్సంపేట, పర్వతగిరి, వర్ధన్నపేట, సంగెం, నెక్కొండ, దుగ్గొండి మండలాల్లో చారిత్రక దేవాలయాలున్నాయి. కానీ ఈ ఆలయాల అభివృద్ధిని మాత్రం ఎవరు పట్టించుకోవడం లేదు. దాతలు ఉన్నా కూడా అధికారులు అభివృద్ధికి మాత్రం ఆమడదూరంగానే ఉంటున్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చొరవతో సన్నూరులోని శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయానికి ప్రత్యేక నిధుల కేటాయింపుతో ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. కలెక్టర్ ప్రత్యేక చొరవతో అన్ని శాఖల అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి పనుల పర్యవేక్షణ చేపట్టారు.
అభివృద్ధికి నోచుకోని నగరంలో ప్రసిద్ధ ఆలయాలు
వరంగల్ నగరంలో మహిమాన్వితమైన ఆలయాలు ఉన్నా యి. కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నాయి. వీటి పాలన మాత్రం ఇన్‌చార్జీల అధికారులతోనే నడుస్తున్నాయి. కుంటిభద్రయ్య దేవా లయం, రామలింగేశ్వరాలయం, దుర్గేశ్వరాలయం, భోగేశ్వరాలయం, రం గంపేటలోని శివాలయం, శ్రీగోవిందరాజుల స్వామి దేవాల యంతో పాటు పలు దేవాలయాలకు నిత్యం వందలాది మంది భక్తులు ఆలయాలను సందర్శిస్తారు. ఆలయ అభివృద్ధికి నిధులు కూడా సమకూరుస్తారు. కానీ అధికారులు మాత్రం ఏమీ పట్టిం చుకోవడం లేదని భక్తుల మండిపడుతు న్నారు. పర్వదినాల్లో మాత్రం భక్తులే ఒక బృందంగా ఏర్పడి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.
ఆలయ ఆస్తులు కబ్జా..
రామన్నపేటలోని శ్రీరామలింగేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించిన ఎన్నో ఆస్తులు కబ్జాకు గురయ్యాయి. గతంలో కమిటీ సభ్యులుగా పనిచేసిన వారు కబ్జాకు గురైన స్థలాలపై కోర్టుల్లో కేసులు సైతం వేశారు. ప్రస్తుతం ఉన్న దేవాలయం వెనుక ఖాళీ స్థలంలో ఈ ప్రాంత వాసులకు ఉపయోగపడే విధంగా కల్యాణ మండపాన్ని నిర్మించాలని చాలా కాలం నుంచి ప్రజలు కోరుతున్నారు. నిర్మాణానికి కావాల్సిన నిధులు సైతం దాతలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దీనికి సంబంధించి ప్రతిపాధనలు ఏవీ కూడా అధికారులు తయారు చేయడం లేదు. ఈ ప్రాంతంలో ఎలాంటి జన సంచారం అభివృద్ధి లేని కాలం నుంచి కొనసాగిన ఈ దేవాలయం పరిసర ప్రాంతరాలు ప్రస్తుతం స్వామి వారి అనుగ్రహంతో వాణిజ్య సమూదాయంగా మారింది.
పట్టించుకోని అధికారులు..
ఆలయాల అభివృద్ధి కోసం సీజీఎఫ్ ఫండ్ అంటే కామన్ గుడ్ ఫండ్ నుంచి నిధులు కేటాయిస్తారు. ప్రభుత్వం ఇప్పటి వరకు ఎన్ని ఆలయాలకు ఎంత నిధులు కేటాయించారు. నిర్మాణ దశ, ఏ విధంగా ఉంది, ఇంకా కేటాయించారనే వివరాలు ఇచ్చేందుకు అధికారులు సుముఖంగా లేరని భక్తులు పేర్కొంటున్నారు. ఎవరైనా వీటి వివరాల కోసం దేవాదాయ శాఖ కార్యాలయానికి వెళితే.. సంబంధిత అధికారుల నుంచి ఉన్నతాధికారుల నుంచి దరఖాస్తు చేసుకొని తీసుకోవాలని సమాధానమిస్తున్నారని వాపోతున్నారు.
కల్యాణ మండపాన్ని నిర్మించాలి : అప్పరాజు రాజు, రామలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్
పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన ప్రజలు రామన్నపేట ప్రాంతంలో వేల సంఖ్యలో ఉన్నారు. ఈ ప్రాంతంలో శ్రీరామలింగేశ్వర స్వామి దేవాలయం ఒకటే ఉంది. ఆలయ భూములు చాలావరకు అన్యాక్రాంతమయ్యాయి. ప్రస్తుతం ఉన్న భూమిలో ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడేలా కల్యాణ మండపాన్ని నిర్మిస్తే బాగుంటుంది. ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.
Updated Date - 2023-02-11T00:22:22+05:30 IST