ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆగమాగం

ABN, First Publish Date - 2023-02-20T00:33:31+05:30

అంగన్‌వాడీ కేంద్రాలు అస్తవ్యస్యస్తంగా మారాయి. వరంగల్‌ జిల్లాలోని ఆయా సెంటర్లలో సమస్యలు తాండవిస్తున్నాయి. ఆలనాపాలన కరువైంది. పర్యవేక్షణ కొరవడింది. కేంద్రప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలు నెరవేరడం లేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అస్తవ్యస్తంగా అంగన్‌వాడీ కేంద్రాలు

తిష్టవేసిన సమస్యలు

క్షేత్రస్థాయిలో కానరాని అధికారుల తనిఖీలు

సమయపాలన పాటించని సిబ్బంది

పలుచోట్ల డుమ్మాకొడుతున్న కొందరు టీచర్లు

గర్భిణీలకు, నవజాత శిశువులు, బాలింతలకు సరిగా అందని పోషకపదార్థాలు

జిల్లాలో 919 సెంటర్లు

వరంగల్‌ సీటీ, ఫిబ్రవరి 19 : అంగన్‌వాడీ కేంద్రాలు అస్తవ్యస్యస్తంగా మారాయి. వరంగల్‌ జిల్లాలోని ఆయా సెంటర్లలో సమస్యలు తాండవిస్తున్నాయి. ఆలనాపాలన కరువైంది. పర్యవేక్షణ కొరవడింది. కేంద్రప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలు నెరవేరడం లేదు.

జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పని చేయాలి. కానీ, అలా తెరిచిన దఖలాలు చాలాచోట్ల కానరావడం లేదు. సమయ పాలన అధ్వానంగా మారింది. రోజూ కేంద్రాల పనితీరును తనిఖీ చేయాల్సిన సూపర్వైజర్లు దానిని విస్మరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అంగన్‌వాడీకేంద్రాల నుంచి గర్భిణీలకు, నవజాత శిశువులు, బాలింతలకు అందాల్సిన పోషణ పదార్థాలు క్రమంగా అందడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కానరాని సమయ పాలన

జిల్లాలో వరంగల్‌, వర్ధన్నపేట, నర్సంపేటల మూడు సెక్టార్లుగా విభజించారు. వీటిల్లోని వివిధ మండలాల పరిధిలో మొత్తం 919 అంగన్‌వాడీ కేంద్రాలు నడుస్తున్నాయి. ఈయా సెంటర్లలో 75 శాతానికిపైగా టీచర్లు సమయ పాలన పాటించడం లేదు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు టీచర్ల ఉండాల్సి ఉండగా, వారు సమయానికి రాకుండా ఇష్టానుసారంగా వస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. పలుచోట్ల అంగన్‌వాడీ కేంద్రాల్లో పని చేస్తున్న ఆయాలే అన్నీ చూసుకుంటున్నట్లు సమాచారం.

సూపర్వైజర్ల జాడేది..?

అంగన్‌వాడీ కేంద్రాలను నిరంతరం పర్యవేక్షిస్తూ సమయపాలన సక్రమంగా అమలు చేసే బాధ్యత సూపర్వైజర్లదే. ఆయా కేంద్రాల ద్వారా గర్భిణులకు, ఆ ప్రాంత 5 ఏళ్లలోపు చిన్నారులతో పాటు బాలింతలకు పోషకాహారంతో పాటు పలు విషయాలపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత టీచర్లదే. వీరు ఈ పనులను సక్రమంగా నిర్వహిస్తున్నారా! లేదా? అనే అంశాన్ని పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదికలు అందించాలి. అయితే సూపర్వైజర్లు మాత్రం అలాంటి పరిశీలనలు చేసినట్లు కనిపించడం లేదు. కొన్నికేంద్రాల టీచర్లతో సూపర్వైజర్లు కుమ్మక్కైనట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తంగా సూపర్వైజర్ల నిర్లక్ష్యంతో కొన్నిచోట్ల టీచర్లు విధులకు సరిగా హాజరుకావడం లేదని సమాచారం.

క్షేత్రస్థాయిలో నెరవేరని లక్ష్యాలు..

పోషణ లోపంతో బాధపడుతున్న చిన్నారులు, బాలింతలు, గర్భిణులను గుర్తించి వారికి పోషక విలువలుగల ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతే కేంద్రప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలను నిర్వహిస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో ఈ లక్ష్యాలు మాత్రం నీరుగారిపోతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పలు కేంద్రాల్లో ఆయాలదే రాజ్యంగా నడుస్తోంది. టీచర్లు లేకపోవడంతో వారే అన్నీ చూసుకుంటున్నారు. ఆయాల్లో 80 శాతానికి పైగా నిరక్ష్యరాసులే కావడంతో ఏమీ చేయాలో తోచని స్థితిలో వారు ఉంటున్నారు.

బాలామృతం బర్లపాలు..!

అంగన్‌వాడీ కేంద్రాల నుంచి చిన్నారులకు చేరాల్సిన బాలామృతం పక్కదారులు పడుతోంది. లబ్ధిదారులు నుంచి కొంత మేరకు పక్కదారులకు పోతోంటే, అంగన్‌వాడీ కేంద్రాల టీచర్లు బాలామృతంను నేరుగా అమ్ముకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. బాలామృతం దాణాగా తీసుకుంటున్న గేదెలు పాలు అధికంగా ఇస్తోండటంతో బాలామృతం ప్యాకెట్లను నేరుగా వారికే కొందరు టీచర్లు చేరవేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కొన్నిచోట్ల లబ్ధిదారులు వీటిపై ఆసక్తి కనబరచకపోవడంతో ఇదే అదనుగా టీచర్లు అమ్ముకుంటున్నట్లు సమాచారం.

సెంటర్ల వివరాలు..

వరంగల్‌ జిల్లా పరిధిలో అంగన్‌వాడీ కేంద్రాలను మూడు సెక్టార్లుగా విభజించారు. వరంగల్‌ సెక్టార్‌లో 249 అంగన్‌వాడీ కేంద్రాలు పని చేస్తున్నాయి. వర్ధన్నపేట సెక్టార్‌లో 325, నర్సంపేట సెక్టార్‌లో 345 కేంద్రాలు పనిచేస్తున్నాయి. జిల్లాలో మొత్తంగా 919 కేంద్రాలు నడుస్తున్నాయి. ఈ కేంద్రాలను పర్యవేక్షించేందుకు 36 మంది సూపర్వైజర్లు విధుల్లో ఉన్నారు.

జిల్లాలో 70 శాతం టీచర్లు అంతే..

జిల్లాలోని 70 శాతం అంగన్‌వాడీ సెంటర్లలో టీచర్లు సమయ పాలన పాటించడం లేదు. పట్టణ ప్రాంతాల్లో ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆయా కేంద్రాల్లో పని చేస్తున్న ఆయాలే పనులు చక్కబెడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కాస్తగాడిలోనే ఉన్నా నగర పరిధిలోని కేంద్రాల్లో పరిస్థితి బాగా లేదు. నగరంలోని కరీమాబాద్‌, శంభునిపేట, మట్టెవాడ, ఎస్‌ఆర్‌ఆర్‌ తోట, ఎల్లంబజార్‌, కాశీబుగ్గ, లేబర్‌కాలనీ, కొత్తవాడ తదితర ప్రాంతాలతో పాటు వర్ధన్నపేట, సంగెం, గీసుగొండ తదితర అన్ని మండలాల్లో పరిస్థితి ఇలానే ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇకనైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి, అంగన్‌వాడీ కేంద్రాలను గాడిలో పెట్టాల్సి ఉంది.

Updated Date - 2023-02-20T00:33:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising