కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఇంకెప్పుడు..?!

ABN, Publish Date - Dec 18 , 2023 | 11:50 PM

రామప్ప దేవాలయం.. ఓ చారిత్రక కట్టడం. తెలుగు రాష్ట్రాల్లో యునెస్కో గుర్తింపు పొందిన ఏకైక నిర్మాణం ఇదే. కాకతీయుల కళా వైభవానికి దర్పణం. ములుగు జిల్లా వెంకటాపూర్‌(రామప్ప) మండలం పాలంపేటలో ఉన్న ఈ ఆలయానికి అరుదైన గుర్తింపు దక్కడంతో ప్రపం చం దాని వైపు చూసింది. దేశమంతా హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి.

ఇంకెప్పుడు..?!
కామేశ్వరాలయం నిర్మాణం లేక బోసిపోయి కనిపిస్తున్న రామప్ప దేవాలయం

మారని ‘రామప్ప’ రాత

ముందుకు సాగని అభివృద్ధి

పనుల పూర్తి గడవు ముగిసినా అడుగు పడని వైనం

యునెస్కో షరతుల ప్రకారం కానరాని పురోగతి

పెదవి విరుస్తున్న పర్యాటకులు

వెంకటాపూర్‌(రామప్ప), డిసెంబరు 18 : రామప్ప దేవాలయం.. ఓ చారిత్రక కట్టడం. తెలుగు రాష్ట్రాల్లో యునెస్కో గుర్తింపు పొందిన ఏకైక నిర్మాణం ఇదే. కాకతీయుల కళా వైభవానికి దర్పణం. ములుగు జిల్లా వెంకటాపూర్‌(రామప్ప) మండలం పాలంపేటలో ఉన్న ఈ ఆలయానికి అరుదైన గుర్తింపు దక్కడంతో ప్రపం చం దాని వైపు చూసింది. దేశమంతా హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి. అయితే.. ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొంది ఇప్పటికే రెండేళ్లు దాటినా ఉప ఆలయాల నిర్మాణ పునరుద్ధరణ, పరిసర ప్రాంతాల అభివృద్ధి, అంతర్జాతీయ స్థాయి సౌకర్యాల కల్పన తదితర పనులు ఇప్పటికీ పట్టాలు ఎక్కలేదు.

కామేశ్వరాలయం కథ కంచికేనా..?!

వారసత్వ గుర్తింపుతో విశ్వఖాతి పొందిన రామప్ప ఆలయ పనులు ముందుకు సాగడం లేదు. ఆలయ శిలలను వరుస సంఖ్యలో పేర్చి శిల్పాలకు అంకెలు వేసి వదిలిపెట్టారు. పరిసరాల్లో శిలలను పడేశారు. శిల్పాల ను తొలగించి దాదాపు 14 ఏళ్లు అవుతున్నా కామేశ్వరాల యం పునర్నిర్మాణానికి నోచుకోలేదు. కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో పనులు చేపట్టాల్సి ఉన్నా ఇంకా పను లు ఆరంభం కాలేదు. కేంద్ర ప్రభుత్వం నిధులు కేటా యించినా ఇప్పటి వరకు కామేశ్వరాలయం పునరుద్ధరణ పనులు చేపట్టకపోవడంతో డబ్బులు మురిగిపోతున్నా యి. కామేశ్వరాలయాన్ని 2012లో పునర్నిర్మాణం కోసం తొలగించారు. నాటి నుంచి ఇప్పటి వరకు ఆలయ పునర్నిర్మాణ పనులను ప్రారంభించకపోవడం పట్ల పర్యాటకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

ఉప ఆలయాల ఊసేలేదు

రామప్ప పరిసరాల్లో 16 ఉప ఆలయాలు ఉండగా సమీపంలో ఉన్న శివాలయం, గొల్లగుడిని పునరుద్ధరిం చాలని యునెస్కో సూచించింది. అయినా రామప్ప సరస్సు కట్టపై ఉన్న శివాలయం, త్రికుటాలయం పను లకు మోక్షం లభించలేదు. రామప్పకు వచ్చే తూర్పు రహదారి వరదలు, వర్షాలకు ధ్వంసమైంది. తాత్కాలిక మరమ్మతులు చేపట్టినా మరోసారి రోడ్డు కొట్టుకుపో యింది. దేవాలయానికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆలయ తూర్పు ముఖద్వారం కోసం ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి నిధులు కేటాయించినా పనులు మాత్రం ముదుకెళ్లడంలేదు. యునెస్కో నిబంధనల ప్రకారం 16 ఉప ఆలయాల అభివృద్ధి ఊసేలేదు. ఈ ఆలయాలను కూడా అభివృద్ధి చేయాలని షరతులు ఉన్నప్పటికీ అధికారులు గాలికి వదిలేశారు. ఉప ఆలయాలు కూడా రామప్ప రమణీయతను పెంచేందుకు చక్కగా ఉపయోగపడనున్నాయి.

అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి జరగనుందా..?

అంతర్జాతీయ పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అంతర్జాతీయ ప్రమాణాలను అభివృద్ధి పనుల్లో పాటించేందుకు రూ.61.99 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు తీర్థయాత్రల పునర్జీవనం, ఆధ్యాత్మిక వారసత్వ వృద్థి పథకం ప్రసాద్‌ స్కీంలో చేరుస్తూ కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ఆదేశాల మేరకు గత డిసెంబరు 28న రామప్పలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా శంకుస్థాపన చేశారు. తొలి విడత రూ.42.14 కోట్లు, రెండో విడత రూ.19.85 కోట్లతో చేపట్టిన పనులను ప్రారంభించారు. 12 నెలల్లో పూర్తి చేయాల్సిన పనులు ఇప్పటి వరకు పూర్తికాలేదు. రామప్ప సకల సౌకర్యాల నిర్మాణంలో ములుగు జిల్లాకే తలమానికం కానుంది. అభివృద్ధి పనులు చురుగ్గా సాగకపోవడంతో రామప్పకు వచ్చే పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

నాలుగులైన్ల రహదారి కలేనా..?

హైదరాబాద్‌- భూపాలపట్నం మధ్య 163వ జాతీ య రహదారిపై ఉన్న జంగాలపల్లి రోడ్డు నుంచి పాలం పేటకు వెళ్లే రోడ్డును నాలుగు వరుసలుగా విస్తరించేం దుకు ప్రణాళికలు రూపొందించినా కాగితాలకే పరిమిత మయ్యాయి. రామప్ప అభివృద్ధి పర్యవేక్షణకు జిల్లా, రాష్ట్ర స్థాయిలో కమిటీలు వేయాలని నిర్ణయించినా అవి ఆచరణలో మాత్రం అమలు కాలేదు. రామప్ప పరిసరా ల అభివృద్ధికి చేపట్టాల్సిన భూసేకరణ కార్యక్రమం ముందుకు వెళ్లడం లేదు. యునెస్కో గుర్తింపును శాశ్వ తంగా ఉండేలా అభివృద్ధి పనులు చేపట్టాలని హైకోర్టు సైతం సూచించింది. రెండేళ్ల నుంచి కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, గవర్నర్‌, రాష్ట్రపతి సైతం సందర్శించ గా నిధుల విషయంలో ఎలాంటి ప్రకటనలు రాలేదు. పనుల గడువు 2022 డిసెంబరు వరకే పూర్తి కావాల్సి ఉండగా ఇంత వరకు అతీగతీ లేదు. యునెస్కో గుర్తిం పు తర్వాత పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివస్తున్నారు. కానీ, ఎలాంటి అభివృద్ధి సైతం లేకపోవడంతో పర్యాట కులు సైతం పెదవి విరుస్తున్నారు. ప్రసాద్‌ స్కీం కింద రూ.62 కోట్లు నిధులు విడుదలైనా రెండు నెలలు మాత్ర మే పనులు చేశారు. ఆ తర్వాత చేతులెత్తేశారు. జిల్లా ఉన్నతాధికారులు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అంటున్నారే తప్ప అమలులోకి మాత్రం రావడం లేదు. ఇప్పటికైనా రామప్పను పట్టించుకుని యునెస్కో షరతు లకు అనుగుణం అభివృద్ధి చేయాలని పర్యాటకులు, భక్తులు కోరుతున్నారు.

Updated Date - Dec 18 , 2023 | 11:50 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising