ఎవరికి నష్టం.. లాభం
ABN, First Publish Date - 2023-12-01T23:18:06+05:30
జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలకు గురువారం పోలింగ్ ముగిసింది. చిన్నచిన్న ఘటనలు మినహా ప్రశాం తంగా ఓటింగ్ జరిగింది. అయితే ఈ ఓటింగ్‌తో ప్రధాన పార్టీలు గెలుపుపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో పెరిగిన ఓటర్లు.. స్వల్పంగా తగ్గిన పోలింగ్ శాతం
ఎవరికి లబ్ధి చేకూరుతుందోనని ప్రధాన పార్టీల విశ్లేషణ
ఓటింగ్ సరళీపై స్పష్టమైన అంచనాకు రాని పార్టీల అభ్యర్థులు
ఓటర్ల చైతన్య కార్యక్రమాలు నిర్వహించినా.. ప్రయోజనం అంతంతే..!
మహబూబాబాద్, డిసెంబరు1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలకు గురువారం పోలింగ్ ముగిసింది. చిన్నచిన్న ఘటనలు మినహా ప్రశాం తంగా ఓటింగ్ జరిగింది. అయితే ఈ ఓటింగ్‌తో ప్రధాన పార్టీలు గెలుపుపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మహబూబాబాద్, డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గాలలో ఈసారి అనూహ్యరీతిన ఓటర్లు పెరిగినప్పటికి పోలింగ్ విషయానికొచ్చే వరకు స్వ ల్పంగా తగ్గడంతో ఇది ఎవరికి లాభం.. ఎవరికి న ష్టం అంచనాలకు అందడం లేదు. గ్రామాల వారీ గా కొందరు, మండలాల వారీగా మరికొందరు, పోలింగ్ సరళీని పరిశీలిస్తూ లాభనష్టాలపై విశ్లేషణలు చేస్తున్నారు. పోల్ మేనేజ్‌మెంట్‌పై పూర్తి అవగాహన కలిగిన తలలు పండిన రాజకీయ ప రిశీలకులు అభ్యర్థుల తలరాతలు ఎలా మారా యో గుర్తించేందుకు మల్లగుల్లాలు పడుతున్నారు.
2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో మహబూబాబాద్ నియోజకవర్గంలో 2,17,303 ఓట్లకు గాను 1,84,940 ఓట్లు పోలయ్యాయి. పోలింగ్‌శాతం 85.10గా నమోదైంది. తాజాగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో 2,53, 342 ఓట్లకు గాను 2,08,598 ఓట్లు పోలయ్యాయి. పోలింగ్‌శాతం 82.34గా నమోదైంది. అంటే 2018 ఎన్నికలప్పుడు ఓటర్లు తక్కువగా ఉన్నా 85.10 శాతం ఓట్లు పోలుకాగా, ప్రస్తుత 2023 ఎన్నికల్లో ఓటర్లు భారీగానే పెరిగినప్పటికి పోలైన ఓటింగ్ శాతం 82.34కు తగ్గింది.
ఇక.. డోర్నకల్‌లోనూ ఇదే పరిస్థితి కన్పిస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 1,95,593 ఓట్లకు గాను 1,74,076 ఓట్లు పోలయ్యాయి. పోలింగ్‌శాతం 88. 99గా నమోదైంది. ప్రస్తుత 2023 ఎన్నికల్లో 2,19, 264 ఓట్లకు గాను 1,92,365 ఓట్లు పోలయ్యాయి. పోలింగ్‌శాతం87.73గా నమోదైంది. ఇక్కడ కూడా నాటి ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత ఎన్నికల్లో ఓటర్లు పెరిగినప్పటికి పోలింగ్ శాతం మాత్రం తగ్గిపోవడం గమనార్హం.
చైతన్యం నింపినా..
వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తే పూర్వ రోజుల కన్నా ప్రస్తుత రోజుల్లో ఓటర్లలో చైతన్యం పెంచడానికి జిల్లా వ్యాప్తంగా అనేక కార్యక్రమాలను కలెక్టర్ శశాంక నేతృత్వంలో చేపట్టారు. 18 ఏళ్లు నిండిన యువతీయువకులు ఓటుహక్కు పొందేందుకు అవకాశం కల్పిస్తూ కళాశాలల్లోనూ చైతన్య కార్యక్రమాలు చేపట్టి ఓటరు నమోదు పెంచారు. ఆ క్రమంలోనే పోలింగ్‌శాతం పెంచేందుకు ప్రచా ర కార్యక్రమాలనూ చేపట్టారు. ప్రతీ నియోజకవర్గంలో ఓటర్లలో ఆసక్తి పెంచేందుకు 5 మోడల్ పోలింగ్ కేంద్రాలు, మహిళా పోలింగ్ కేంద్రాలు 5, దివ్యాంగులకు ఒకటి, యూత్‌కు మరోకటి వెరసి 12 ఏర్పాటు చేశారు. ఇవికాక ఓటర్ల సంఖ్యకు అ నుగుణంగా కావాల్సిన గ్రామాలు, పట్టణాల్లో పో లింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేశారు. ఓటర్లకు ఎలాం టి అసౌకర్యం కలుగకుండా అన్ని వసతులు క ల్పించారు. కొత్తగా 80సంవత్సరాలు వయస్సు దా టిన వృద్ధులు, దివ్యాంగులకు రెండ్రోజుల పాటు హోం ఓటింగ్ చేపట్టారు. ఇన్ని చేసినా స్పష్టమైన కారణాలు కానరానప్పటికి పోలింగ్‌శాతం తగ్గడంతో ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు, పార్టీలు ఓటింగ్ సరళీపై స్పష్టమైన అంచనాకు రాలేకపోతున్నాయి.
ఎవరికి లాభం.. ఎవరికి ఖేదం..
మహబూబాబాద్, డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2009, 2014, 2018, 2023 సాధారణ ఎన్నికల సందర్భంగా క్రమంగా పెరుగుతూ వచ్చిన పోలింగ్ శాతంతో ఎవరికి లాభం జరిగింది? ఎవరికి నష్టం జరిగింది..! అంశాలపై ప్రధాన పార్టీల విశ్లేషకులకు అంచనాలు అందక తలలు పట్టుకుంటున్నారు.
మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో 2009 ఎన్నికల్లో 73.53 శాతం పోల్ కాగా, 2014లో 80.36 శాతం ఓట్లు పోలయ్యాయి. అంటే 2.83 శాతం ఓటింగ్ పెరిగిందన్న మాట. తిరిగి 2014 పోలింగ్‌తో పోలిస్తే 2018లో 85.10 శాతం ఓట్లు పోలయ్యాయి. అంటే 4.74 శాతం ఓట్లు పెరిగాయన్న మాట. 2023 ఎన్నికల్లో 82.34 శాతం ఓట్లు పోలయ్యాయి. అంటే 2018తో పోలిస్తే 2.76 శాతం ఓట్లు తగ్గాయి.
డోర్నకల్ నియోజకవర్గంలో 2009 ఎన్నికల్లో 81.19 శాతం ఓట్లు పోల్ కాగా, 2014 ఎన్నికల్లో 85.91 శాతం ఓట్లు పోలయ్యాయి. అంటే 4.72 శాతం ఓటింగ్ పెరిగింది. తిరిగి 2014 ఎన్నికలతో పోలిస్తే 2018 ఎన్నికల్లో 88.99 శాతం ఓట్లు పోలయ్యాయి. అంటే 3.08 శాతం ఓటింగ్ పెరిగింది. ప్రస్తుత 2023 ఎన్నికల్లో 87.73 శాతం ఓట్లు పోలయ్యాయి. 2018 ఎన్నికలతో పోలిస్తే 1.26 శాతం పోలింగ్ తగ్గింది. ఈ గణాంకాలను విశ్లేషించుకుంటూ ప్రధాన రాజకీయ పార్టీల పరిశీలకులు అభ్యర్థుల జయాపజయాలపై మల్లగుల్లాలు పడుతున్నారు.
నాటికి, నేటికి తేడా.!
గత మూడు శాసనసభ ఎన్నికల ఓటింగ్ సరళీలో పోలింగ్‌శాతం పెరగడం, ప్రస్తుత ఎన్నికల్లో తగ్గడం అధికార పార్టీలకు ప్రయోజనం చేకూర్చిందా..? లేక ప్రతిపక్ష పార్టీలకు ప్రయోజనం కలిగించిందా! అనే అంశంపై ప్రధాన పార్టీల్లో విశ్లేషణల జోరు కొనసాగుతోంది. నాటికి, నేటికి ఓటరు మనోభావాలు ఎలా మా రుతూ వచ్చాయి. అభ్యర్థి ప్రాధాన్యతకు అనుగుణంగా ఓటరు మొగ్గు చూపారా, లేక ఆయా పార్టీల మేనిఫెస్టోలు, హామీలకు అనుగుణంగా స్పందిస్తూ వచ్చారా.. అనే విషయంలోనూ స్పష్టత కొరవడిందంటున్నారు. అయినప్పటికి గణాంకాల వారీ గా 2009 ఎన్నికలు ఉమ్మడి రాష్ట్రంలో అధికార కాంగ్రె్‌సను అందలం ఎక్కించాయి. 2014 స్వరాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికలు ఉద్యమ పార్టీ బీ (టీ)ఆర్‌ఎ్‌సకు కార్పెట్ పరిచాయి. రెండోదఫా 2018లోనూ యథా తీర్పునిచ్చిన ప్రజలు బీఆర్‌ఎ్‌సకే పట్టం క ట్టారు. ఇప్పుడు 2023 ఎన్నికల సరళీ భిన్నంగా మారింది.
తెలంగాణ వచ్చాక వరుసగా పదేళ్లు అధికారంలోకి రాలేకపోయిన కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల మేనిఫెస్టోతో ఢిల్లీ అగ్రనేతల ప్రచారం తోడు కాగా, ‘మార్పు కావాలంటే.. కాంగ్రెస్ రావాలి’ అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాయి. ఇక బీఆర్‌ఎస్ అభివృద్ధి మంత్రంతో పాటు అన్ని వర్గాలకు అందించిన సంక్షేమ పథకాలను ఆస్త్రం గా వదులు తూ.. ప్రతీ కుటుంబంలో లబ్ధిదారులు ఉం డడాన్ని పాజిటివ్‌గా తీసుకుంటూ ప్రచారం చేపట్టింది.
బీజేపీ సైతం ఈ సారి ఢిల్లీ పెద్దలు, భా రతప్రధాని నరేంద్రమోదీతోనే ప్రచార సభ చేపట్టింది. దీంతో ఈ రెండు నియోజకవర్గా ల్లో బీజేపీ ఓటింగ్ పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీకి పెరిగిన ఓటింగ్‌తో పాటు తగ్గిన పోలింగ్‌శాతం వల్ల ప్రధాన పోరు నడిచిన కాంగ్రెస్, బీఆర్‌ఎ్‌సల నడుమ ఎవరికి లాభం.. ఎవరికి ఖేదం విఛిత్రంగా ఎవరికి అందడం లేదు. తామం టే.. తామే గెలుస్తామని ఎవరికి వారే.. ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - 2023-12-01T23:18:21+05:30 IST