ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మాకు ఫ్రీ బస్సు వద్దు

ABN, Publish Date - Dec 20 , 2023 | 04:54 AM

తమకు ఉచిత బస్సు సౌకర్యం వద్దని, ఆర్టీసీ బస్సుల్లో టికెట్‌ తీసుకొనే ప్రయాణిస్తామని సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల మహిళా ఉపాధ్యాయులు పేర్కొన్నారు.

ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు ఉచిత బస్సు సౌకర్యం అవసరం లేదు

సూర్యాపేట జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాల మహిళా ఉపాధ్యాయులు

పెన్‌పహాడ్‌, డిసెంబరు 19: తమకు ఉచిత బస్సు సౌకర్యం వద్దని, ఆర్టీసీ బస్సుల్లో టికెట్‌ తీసుకొనే ప్రయాణిస్తామని సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల మహిళా ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగం చేసే మహిళలకు బస్సుల్లో ఉచిన ప్రయాణ సౌకర్యం అవసరం లేదని వారు అభిప్రాయపడ్డారు. నిరుపేద, వృద్ధ మహిళలకే ఆర్టీసీ ఉచిత ప్రయాణం వర్తించేలా చూడాలని వారు అన్నారు. ఈ మేరకు ఆ పాఠశాలలోని మహిళా ఉపాధ్యాయులు ఎస్‌కే జెబున్సీసా, పుట్ట మల్లేశ్వరీ, రఫియాబేగం, ఎమ్‌ సునీతాదేవి, ధనలక్ష్మి, కరుణశ్రీ, విజయ.. మంగళవారం విలేకరులతో మాట్లాడారు. మంచి వేతనం పొందే ప్రభుత్వ మహిళా ఉద్యోగులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేటప్పుడు టికెట్లు తీసుకొని ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా సహకరించాలని వారు కోరారు. పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని, రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సకాలంలో ఇవ్వాలని ప్రభుత్వాన్ని వారు కోరారు. యువతీ, యువకులకు వృత్తి నైపుణ్యశిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేలా ప్రభుత్వం కృషి చేయాలని పేర్కొన్నారు.

Updated Date - Dec 20 , 2023 | 04:54 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising