ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Singareni Elections : ప్రారంభమైన సింగరేణి ఎన్నికలు.. గుర్తింపు దక్కేదెవరికో..

ABN, Publish Date - Dec 27 , 2023 | 03:31 AM

మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో పరోక్షంగా రాజకీయ పార్టీల బలాబలాలను తేల్చే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం 7 గంటల నుంచే ఎన్నికలు ప్రారంభమయ్యాయి. సాయంత్రం 5 గంటల వరకూ జరగనున్న ఈ ఎన్నికల పోలింగ్‌కు అధికార యంత్రాంగం విస్తృత ఏర్పా ట్లు చేసింది.

కోల్‌బెల్ట్‌లో 84 పోలింగ్‌ కేంద్రాలు

5 గంటల వరకు పోలింగ్‌

పోటీలో 13 కార్మిక సంఘాలు

కాంగ్రెస్ ఓటమే లక్ష్యం.. సీపీఐ అనుబంధ

ఏఐటీయూసీకి టీబీజీకేఎస్‌ మద్దతు

మంత్రులపైనే ఐఎన్‌టీయూసీ బాధ్యతలు

సింగరేణిలో మిత్రపక్షాల మధ్య పోరు

భూపాలపల్లి/కొత్తగూడెం/గోదావరిఖని, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో పరోక్షంగా రాజకీయ పార్టీల బలాబలాలను తేల్చే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం 7 గంటల నుంచే ఎన్నికలు ప్రారంభమయ్యాయి. సాయంత్రం 5 గంటల వరకూ జరగనున్న ఈ ఎన్నికల పోలింగ్‌కు అధికార యంత్రాంగం విస్తృత ఏర్పా ట్లు చేసింది. పోలింగ్‌ ముగిసిన అనంతరం బుధవారమే రాత్రి 7 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. సింగరేణిలోని మొత్తం 11 డివిజన్లలోని 84 పోలింగ్‌ బూత్‌లలో కార్మికులు బ్యాలెట్‌ పత్రాల్లో రహస్య పద్ధతిలో తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అనుబంధ ఐఎన్‌టీయూసీ, సీపీఐ అనుబంధ ఏఐటీయూసీ, బీఆర్‌ఎస్‌ అనుబంధ టీబీజీకేఎస్‌, బీఎంఎస్‌, సీఐటీయూ, హెచ్‌ఎం్‌సతోపాటు పలు విప్లవ కార్మిక సంఘాలతో కలిపి 13 కార్మిక సంఘాలు ఈ ఎన్నికల్లో పోటీ పడుతున్నాయి. 11 డివిజన్లలో కలిపి మొత్తం 39,773 మంది కార్మికులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అత్యధికంగా శ్రీరాంపూర్‌ ఏరియాలో 9,127 మంది కార్మిక ఓటర్లు ఉన్నారు. రామగుండం-1లో 5,384 మంది, రామగుండం-2లో 3,556 మంది, రామగుడం-3లో 3,884 మంది కార్మిక ఓటర్లు ఉన్నారు. భూపాలపల్లి ఏరియాలో 5,410 మంది ఓటర్లు, కొత్తగూడెంలో 2,326 మంది, కార్పొరేట్‌లో 1,191 మంది ఓటర్లు, ఇల్లెందులో 614మంది, మణుగూరులో 2,450 మంది ఓటర్లు, బెల్లంపల్లిలో 996 మంది, మందమర్రిలో 4,835 మంది ఓటర్లు ఉన్నారు.

అత్యధిక ఓట్ల వచ్చిన సంఘానికి ‘గుర్తింపు’

తొలి ఫలితం ఇల్లెందు డివిజన్‌ నుంచి వెల్లడి కానుంది. శ్రీరాంపూర్‌ ఫలితం చివరగా వచ్చే అవకాశం ఉంది. ముందుగా ఏరియాల వారీగా ప్రాతినిధ్య సంఘాల ను ప్రకటించిన తర్వాత 11 డివిజన్లలో పోలైన ఓట్ల ను కలుపుతారు. మొత్తం 11 డివిజన్లల్లో పోలైన ఓట్లలో అత్యధికంగా ఓట్లు సాధించిన సంఘానికి గుర్తింపు సంఘంగా హోదా కల్పిస్తారు. ఒక్కొక్క ఏరియాకు ఒక ప్రాతినిధ్య సంఘం, 11 డివిజన్లకు కలిపి గుర్తింపు సంఘం ఉంటుంది. అయితే లక్షా 20 వేల మంది కార్మికులు ఉన్నప్పుడు మొదలై న సింగరేణి ఎన్నికలు ఈసారి కేవలం 39,773 మందితోనే జరుగుతున్నాయి. గతంలో ఆరుసార్లు సింగరేణిలో ఎన్నికలు జరిగాయి. ప్రతిసారీ రాజకీయ పార్టీలన్నీ ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకునేవి. కార్మిక సంఘాలకు మాతృ సంస్థలుగా ఉండే రాజకీయ పార్టీలు, ఆ పార్టీ ల ప్రజాప్రతినిధులు, నేతలు కార్మిక సంఘం ఎన్నికల్లో ప్రభావ శక్తులుగా పనిచేసేవారు. కానీ, ఈసారి ఎన్నికలు మాత్రం అందుకు భిన్నంగా జరగనున్నాయి.

ఏఐటీయూసీకి టీబీజీకేఎస్‌ బేషరతు మద్దతు

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ చేతిలో ఓటమిపాలై అధికారాన్ని కోల్పోయిన బీఆర్‌ఎస్‌.. సింగరేణి ఎన్నికల్లో హస్తం పార్టీని దెబ్బకొట్టే వ్యూహం పన్నింది. ఎన్నికల చివరి దశలో అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఈ ఎన్నికల్లో సీపీఐ అనుబంధ సంఘం ఏఐటీయూసీకి మద్దతు ఇవ్వాలని బీఆర్‌ఎస్‌ అనుబంధ టీబీజీకేఎస్‌ నిర్ణయించింది. ఈ మేరకు సింగరేణి వ్యాప్తంగా టీబీజీకేఎస్‌ శ్రేణులు డివిజన్ల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఎన్నికల్లో తీర్మానాలు చేశాయి. ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని తొలుత టీబీజీకేఎస్‌ నిర్ణయించడం, దీంతో ఆ సంఘం అగ్ర నాయకులు వెంకట్రావు, రాజిరెడ్డి, కె.మల్లయ్య తమ పదవులకు రాజీనామా చేయడంతో తిరిగి నిర్ణయాన్ని మార్చుకున్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో టీబీజీకేఎస్‌ పోటీలో ఉంటుందని సంఘం గౌరవాధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ప్రకటన చేశారు. దీంతో కమిటీ నాయకత్వం లేకుండానే డివిజన్‌ స్థాయిలో ఉన్న టీబీజీకేఎస్‌ కమిటీలు ఎక్కడికక్కడ ఏఐటీయూసీకి మద్దతు తెలుపుతూ తీర్మానాలు చేశాయి. తాను గెలిచే అవకాశం లేని పరిస్థితుల్లో రాజకీయ ప్రధాన శత్రువు అయిన కాంగ్రెస్‌ అనుబంధ ఐఎన్‌టీయూసీని ఓడించేందుకు ఏఐటీయూసీకి టీబీజీకేఎస్‌ మద్దతు ప్రకటించింది. ఎన్నికలకు 24 గంటల ముందు ఇలాంటి పరిణామం జరగడం సింగరేణి ఎన్నికల చరిత్రలో ఇదే మొదటిసారి. ఎన్నికల ఫలితాలపై ఈ ప్రభావం తీవ్రంగానే ఉండే అవకాశం ఉంది. మొత్తమ్మీద.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రె్‌సతో పొత్తు పెట్టుకుని బీఆర్‌ఎ్‌సను ఓడించేందుకు పనిచేసిన సీపీఐ.. సింగరేణి ఎన్నికల్లో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది.

ఐఎన్‌టీయూసీ తరఫున రంగంలోకి మంత్రులు

సింగరేణి ఎన్నికలపై తొలుత కాంగ్రెస్‌ పెద్దగా దృష్టిపెట్టలేదు. అయితే ఐఎన్‌టీయూసీ నేతలు సీఎం రేవంత్‌రెడ్డిపై ఒత్తిడి తీసుకురావటంతో పాటు వచ్చే పార్లమెంట్‌ ఎన్నికలను దృష్టిపెట్టుకొని కాంగ్రెస్‌ అధిష్ఠానం సింగరేణిపై ఫోకస్‌ పెట్టింది. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని కొత్తగూడెం, ఇల్లెందు, పినపాక, సత్తుపల్లి ఏరియాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి బాఽధ్యతలు తీసుకున్నారు. ఉమ్మడి కరీంనగర్‌, ఆదిలాబాద్‌, వరంగల్‌ జిల్లాల పరిధిలో ఉన్న చెన్నూరు, బెల్లంపల్లి, రామగుండం, ఆసిఫాబాద్‌, భూపాలపల్లి ఏరియాల్లోని బొగ్గు గనుల్లో ప్రచారాన్ని స్థానిక ఎమ్మెల్యేలతో పాటు మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. సింగరేణిలోనూ ఆరు గ్యారెంటీలను ప్రకటించి, వాటిని అమలు చేసే బాధ్యత తమదే అని మంత్రులు భరోసాను ఇస్తున్నారు.

Updated Date - Dec 27 , 2023 | 08:29 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising