ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మీ మొబైల్‌ నంబరు ఎందుకు మారింది?

ABN, First Publish Date - 2023-04-25T01:39:39+05:30

మీ మొబైల్‌ నెంబరు ఎందుకు మార్చుకున్నరు? పాత ఫోను ఎక్కడపోయింది?’ అని బీజేపీ ఎమ్మెల్యే ఎం. రఘునందన్‌రావు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చైనాతో మీ సంబంధ బాంధవ్యాలేంటి?

మంత్రి నిరంజన్‌రెడ్డికి రఘునందన్‌ప్రశ్న

4 కోట్లకు మంత్రి ఫాంహౌజ్‌ కొనుగోలుకు సిద్ధమని సవాల్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): ‘మీ మొబైల్‌ నెంబరు ఎందుకు మార్చుకున్నరు? పాత ఫోను ఎక్కడపోయింది?’ అని బీజేపీ ఎమ్మెల్యే ఎం. రఘునందన్‌రావు.. వ్యవసాయశాఖ మంత్రి జి. నిరంజన్‌రెడ్డిని ప్రశ్నించారు. మంత్రి పాత ఫోన్‌ నెంబరు నుంచి చైనాకు చెందిన ఎం.ఓ.మో అనే వ్యక్తికి పలుమార్లు కాల్‌ చేశారని, మో అమెరికాలో వ్యాపారాలు చేస్తున్న వనపర్తి జిల్లాకు చెందిన వ్యక్తితో లావాదేవీలు నిర్వహించారని ఆరోపించారు. మంత్రి పాత ఫోను నెంబరు, మో, అమెరికాలో ఉంటున్న వనపర్తి జిల్లాకు చెందిన వ్యక్తితో జరిపిన లావాదేవీలపై ఈడీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు రఘునందన్‌ తెలిపారు. సోమవారం రఘునందన్‌ మీడియాతో మాట్లాడారు. దత్తపుత్రుడి కాంట్రాక్టులు, చైనాతో మంత్రికున్న సంబంధ బాంధవ్యాలు బయటపెట్టాలని నిరంజన్‌ను డిమాండ్‌ చేశారు. మంత్రి ప్రభుత్వ భూ ఆక్రమణకు సంబంధించి ఎక్కడైనా ఎప్పుడైనా చర్చకు సిద్ధమని ప్రకటించారు. కొత్తకోట వద్ద ఉన్న ఫాంహౌజ్‌ మొత్తం విలువ రూ. 4కోట్లు అయితే, ఆ మొత్తం వైట్‌గా చెల్లించి తీసుకునేందుకు సిద్ధమని ప్రకటించారు. ఫాంహౌజ్‌ .. ఒక్కటే ఇస్తారా? దాని చుట్టూ ఉన్న భూమి కూడానా? అన్నది మంత్రి స్పష్టం చేయాలన్నారు. వనపర్తి నియోజకవర్గంలో అసలు మంజూరే కాని వేరుశనగ పరిశోధన కేంద్రానికి 2020-21లో రూ. 40 లక్షలతో భూమి చదును పనులు ఎలా చేస్తారని, ఇప్పటిదాకా ఈ కేంద్రం ఏర్పాటైందా? అని నిలదీశారు. మీ వియ్యంకుడిని అగ్రికల్చర్‌ యూనివర్శిటీ వీసీగా నియమించడం ఆశ్రిత పక్షపాతం కాదా? అని మంత్రి నిరంజన్‌ను ప్రశ్నించారు.

ఈ ప్రశ్నలకు బదులివ్వండి

‘మీకు ఎంతమంది దత్తపుత్రులు? ఏ దత్తపుత్రుడిని ఏ అవసరానికి వాడుకుంటున్నరు? గత ఎన్నికల ముం దు అమెరికా నుంచి ఒక వ్యక్తిని తీసుకువచ్చి ఆయన దత్తపుత్రుడంటూ నియోజకవర్గ ప్రజలకు పరిచయం చేయలేదా? మీ కూతుళ్ల కోసం కొనుగోలు చేసిన భూమిని మీరు దత్తపుత్రుడిగా ప్రకటించిన గౌడా నాయక్‌ ఎందుకు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నరు? సేల్‌డీడ్‌లో ఎన్ని ఎకరాలు ఉంది? ఆ డబ్బు వైట్‌గా చెల్లించారా? లేక బ్లాక్‌గానా? ఈ లావాదేవీ 2016లో కేంద్రం డీమానిటైజేషన్‌ చేసిన తర్వాత జరిగిన మాట నిజం కాదా? గౌడా నాయక్‌ ఏ అకౌంటు నుంచి రైతులకు చెల్లించారు? తిరిగి మీ కుటుంబ సభ్యులు, గౌడా నాయక్‌ ఏ అకౌంటుకు డబ్బులు బదిలీ చేశారు? నిజంగానే గౌడా నాయక్‌ మీ దత్తపుత్రుడయితే ఆయన పేరిట ఆస్తి ఉంచడంలో ఎలాంటి ఇబ్బంది కలిగింది?’ అని రఘునందన్‌ ప్రశ్నించారు. మంత్రి దత్తపుత్రుడి భూ లావాదేవీలపై ఐటీకి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.

Updated Date - 2023-04-25T01:39:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising