Warangal MGM: స్ట్రెచర్ లేక ఇబ్బందులు.. భార్యను భుజాలపై మోసుకెళ్లిన భర్త
ABN, First Publish Date - 2023-05-12T21:19:00+05:30
పేదల ఆస్పత్రిలో వైద్యం భారంగా మారింది. వరంగల్ ఎంజీఎం (Warangal MGM)లో స్ట్రెచర్లు కరువై వృద్ధ రోగిని మరో వృద్ధుడు భుజాలపై మోసుకెళుతున్న దృశ్యం కలవరపెట్టింది.
హనుమకొండ: పేదల ఆస్పత్రిలో వైద్యం భారంగా మారింది. వరంగల్ ఎంజీఎం (Warangal MGM)లో స్ట్రెచర్లు కరువై వృద్ధ రోగిని మరో వృద్ధుడు భుజాలపై మోసుకెళుతున్న దృశ్యం కలవరపెట్టింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem District)కు చెందిన లక్ష్మీ అనే వృద్ధురాలికి కుడికాలి రక్తప్రసరణ ఆగిపోవడంతో నవంబరు 10న కుటుంబ సభ్యులు ఎంజీఎంకు తీసుకవచ్చారు. ఎంజీఎంలో వైద్యులు సర్జరీ చేసి పాదం తొలగించారు. ఈ క్రమంలో రోగిని భర్త శుక్రవారం కృత్రిమ కాలు ఏర్పాటు కోసం ఉదయం ఎంజీఎం ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆస్పత్రిలోకి వెళ్లేప్పుడు రోగిని స్ట్రేచర్‌పై తీసుకవెళ్లడానికి భర్త లచ్చులు సిబ్బందిని అడగగా ఇవ్వకపోవడంతో భర్త లచ్చులు ఆమెను భుజాలపై ఎక్కించుకుని ఆస్పత్రిలోకి తీసుకెళ్లాడు. అలాగే ఆమెను బయటకు తీసుకువెళ్లేటప్పుడు కూడా స్ట్చేచర్ ఇవ్వకపోవడంతో భుజాలపై మోసుకుని తీసుకువెళ్లాడు. ఈ దృశ్యం సామాజిక మాధ్యమాలలో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
Updated Date - 2023-05-12T21:19:00+05:30 IST