KCR: కేసీఆర్‌ను వాకింగ్ స్టాండ్‌తో నడిపించిన వైద్యులు
ABN, First Publish Date - 2023-12-09T13:16:49+05:30
మాజీ సీఎం కేసీఆర్‌కు శుక్రవారం సోమాజీగూడ యశోద వైద్యులు విజయవంతంగా తుంటి మార్పిడి చేశారు.

హైదరాబాద్: మాజీ సీఎం కేసీఆర్‌కు శుక్రవారం సోమాజీగూడ యశోద వైద్యులు విజయవంతంగా తుంటి మార్పిడి చేశారు. దాదాపు 3 గంటలకు పైగా సర్జరీ చేశారు. ఆపరేషన్ సక్సెస్ కావడంతో అనంతరం సాధారణ గదికి తరలించారు. ప్రస్తుతం వైద్యుల బృందం కేసీఆర్ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు.
శనివారం ఉదయం వాకింగ్ స్టాండ్ సాయంతో కేసీఆర్‌ను వైద్యం బృందం నడిపించింది. కేసీఆర్ చిన్న చిన్న అడుగులు వేస్తూ ముందుకు సాగారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు.
Updated Date - 2023-12-09T14:07:58+05:30 IST