25 మద్యం బాటిళ్లు స్వాధీనం
ABN, First Publish Date - 2023-07-03T23:27:54+05:30
టెక్కలి జాతీయ రహదారి సమీపంలో సోమవారం బూరగాం గ్రామానికి చెందిన గేదెల శేఖర్ వద్దనుంచి 25 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ ఎల్.రామకృష్ణ తెలిపారు.
టెక్కలి రూరల్: టెక్కలి జాతీయ రహదారి సమీపంలో సోమవారం బూరగాం గ్రామానికి చెందిన గేదెల శేఖర్ వద్దనుంచి 25 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ ఎల్.రామకృష్ణ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బూరగాం గ్రామానికి చెందిన శేఖర్ స్థానిక జాతీయ రహదారి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా తనిఖీ చేశామని అతని వద్ద 25 మద్యం సీసాలు (180 మి.లీ) ఉన్నట్లు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నా మన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
Updated Date - 2023-09-09T01:15:57+05:30 IST