ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రాజ్యాంగ వ్యవస్థలన్నీ ధ్వంసం

ABN, Publish Date - Jan 09 , 2024 | 04:18 AM

జగన్‌ పాలనలో రాజ్యాంగ వ్యవస్థలన్నీ ధ్వం సం చేశారని.. ఒక్క వ్యవస్థ కూడా పనిచేయడం లేదని ఎమ్మెల్సీ సి.రామచంద్ర య్య అన్నారు.

మంత్రి చెప్పకుండా జీతగాళ్లతో చెప్పించడమా?

ఇలాంటి పాలనలో ఉండకూడదనే వైసీపీ నుంచి బయటకు వచ్చా

సి.రామచంద్రయ్య ఆక్షేపణ.. వైసీపీ సభ్యత్వానికి రాజీనామా

కడప, జనవరి 8(ఆంధ్రజ్యోతి): జగన్‌ పాలనలో రాజ్యాంగ వ్యవస్థలన్నీ ధ్వం సం చేశారని.. ఒక్క వ్యవస్థ కూడా పనిచేయడం లేదని ఎమ్మెల్సీ సి.రామచంద్ర య్య అన్నారు. ఇలాంటి పాలనలో భాగస్వామిని కాకూడదనే వైసీపీ నుంచి బయటకు వచ్చి టీడీపీలో చేరానని చెప్పారు. ‘పార్టీలో నెలకొన్న అప్రజాస్వామిక విధానాలు నచ్చక వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తు న్నా.. నా రాజీనామా అమోదించాల్సిందిగా కోరుతు న్నా’ అంటూ సోమవారం ఆయన సీఎం జగన్‌కు లే ఖ రాశారు. అనంతరం ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. ఒకప్పుడు దక్షిణాదిన ఏపీ, తమిళనాడు పరిపాలన లో నంబర్‌వన్‌గా ఉండేవి. అప్పటో వ్యవస్థలు రా జ్యాంగం ప్రకారం పనిచేసేవి. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక వ్యవస్థలను సర్వనాశనం చేశారు. నాలాంటి సీనియర్‌ నాయకులు సీఎంను కలిసే అవకాశం లేదు. అసలు వైసీపీలో ఏం జరుగుతోందో ఎవరికి తెలియదు. ఇద్దరు ముగ్గురు సలహాదారులు మాత్రమే మాట్లాడుతున్నారు. రాజ్యాంగం ప్రకారం ఏ అంశంపై అయినా.. ప్రభుత్వ పాలసీ పై అయినా మంత్రులు మాట్లాడాలి. అయితే ఇక్కడ జీతగాళ్లు మాట్లాడుతున్నారు’ అని విమర్శించారు. రాష్ట్రం అప్పులపాలైందని.. 13 లక్షల కోట్లు అప్పులయ్యాయని.. అభివృద్ధే లేదని వాపోయారు. వైసీపీలో చేరాలని సజ్జల రామకృష్ణారెడ్డి ఎన్నోసార్లు తన చుట్టూ తిరిగితేనే చేరానన్నారు. ‘కీలకమైన పదవులన్నీ రెడ్లకే ఇచ్చి సామాజిక న్యాయం పేరుతో బస్సు యాత్ర చేస్తున్నారు. తిరుపతిలో యాదవులు, బలిజలు ఎక్కువగా ఉంటే టీటీడీ, తుడా చైర్మన్‌ పదవులను రెడ్లకే ఇచ్చారు. ఇదేం సామాజిక న్యాయం? టీడీపీ ఆదేశిస్తే రాజంపేట నుంచి ఎన్నికల బరిలో దిగుతా. షర్మిల పార్టీతో జగన్‌కు పెద్ద నష్టమే జరుగుతుంది’ అని చెప్పారు.

Updated Date - Jan 09 , 2024 | 04:18 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising