ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రాష్ట్రంలో టీడీపీ గాలి వీస్తోంది..

ABN, Publish Date - Jan 08 , 2024 | 11:49 PM

రాష్ట్రమంతా తెలుగుదేశం పార్టీ గాలి వీస్తోందని సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. స్థానిక జేవీఎస్‌ ఫంక్షన హాల్‌లో సోమవారం హిందూపురం రూరల్‌ మండలంలో టీడీపీ నాయకులు, ముఖ్య కార్యకర్తలతో పంచాయతీల వారీగా సమీక్ష నిర్వహించారు.

సమీక్షలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే బాలకృష్ణ

కష్టపడి పనిచేసి.. ఫలితం ప్రజలకిద్దాం..

నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే బాలకృష్ణ

హిందూపురం, జనవరి 8: రాష్ట్రమంతా తెలుగుదేశం పార్టీ గాలి వీస్తోందని సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. స్థానిక జేవీఎస్‌ ఫంక్షన హాల్‌లో సోమవారం హిందూపురం రూరల్‌ మండలంలో టీడీపీ నాయకులు, ముఖ్య కార్యకర్తలతో పంచాయతీల వారీగా సమీక్ష నిర్వహించారు. కగ్గల్లు పంచాయతీతో మొదలుపెట్టి రాత్రి 8 గంటలు దాటే వరకు సమీక్ష జరిపారు. ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ.. ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలన్నారు. అప్పుడు ఫలితం ప్రజలకు అందిద్దామన్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధిని, వైసీపీ పాలనలో అవినీతి, అక్రమాలు, భూకబ్జాలు, అక్రమ కేసులపై ప్రజలకు వివరించాలన్నారు. వైసీపీ పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు. టీడీపీ ఎప్పుడు అధికారంలోకి వస్తుందా అని ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. చంద్రబాబు పనితీరు ఏమిటో ఐదేళ్లలో రాష్ట్ర ప్రజలు గుర్తించారన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, కార్యకర్తల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి కార్యకర్తను దగ్గరకు తీసుకుని వారితో ఫొటోలు, సెల్ఫీలు దిగారు. ఉదయం నుంచి రాత్రి వరకు 14 పంచాయతీలకు సంబంధించి 3 వేలకుపైగా నాయకులు, కార్యకర్తలను కలిశారు. మండల కన్వీనర్‌ తప్ప.. ఇతర ముఖ్య నాయకులను ఎవరినీ సమీక్షలో పెట్టుకోకుండా నేరుగా ప్రతి కార్యకర్త నుంచి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబికా లక్ష్మీనారాయణ, రాష్ట్ర కార్యదర్శులు కొల్లకుంట అంజినప్ప, రామాంజినమ్మ, వాణిజ్య విభాగ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అరుణాచల్‌రెడ్డి, బీసీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బేవనహళ్లి ఆనంద్‌, మండల కన్వీనర్‌ అశ్వత్థనారాయణరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jan 08 , 2024 | 11:49 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising