ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

జనసేన జోనల్‌ కమిటీల నియామకం

ABN, Publish Date - Jan 21 , 2024 | 02:02 AM

సార్వత్రిక ఎన్నికలకు జనసేన పార్టీ సమాయత్తమవుతోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించే సభలు, అధినేత పవన్‌ కల్యాణ్‌ పాల్గొనే సమావేశాల నిర్వహణకు ప్రత్యేక కమిటీను నియమించింది.

అమరావతి, జనవరి 20(ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికలకు జనసేన పార్టీ సమాయత్తమవుతోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించే సభలు, అధినేత పవన్‌ కల్యాణ్‌ పాల్గొనే సమావేశాల నిర్వహణకు ప్రత్యేక కమిటీను నియమించింది. ఉత్తరాంధ్ర, గోదావరి, సెంట్రల్‌ ఆంధ్ర, రాయలసీమ-1, రాయలసీమ-2 జోన్లుగా విభజించి ప్రత్యేక కమిటీను ఏర్పాటు చేశారు. జోనల్‌ కమిటీలకు కన్వీనర్లు, కో-కన్వీనర్లు, సభ్యులను నియమించారు. వీరితో పాటు ప్రతి జోన్‌కు లీగల్‌, డాక్టర్స్‌ సెల్స్‌ తరఫున సభ్యులను నియమించారు. ఉత్తరాంధ్ర జోన్‌కు తోట సత్యనారాయణ, ఎస్‌.విశ్వక్సేన్‌, వబ్బిన సత్యనారాయణను కన్వీనర్లుగా నియమించారు. గోదావరి జోన్‌కు రాఘవయ్య చౌదరి, రత్నం అయ్యప్ప, చాగంటి మురళీకృష్ణ, తలాటం సత్య కన్వీనర్లుగా ఉంటారు. సెంట్రల్‌ ఆంరఽధ జోన్‌కు బాడిగ శంకర్‌, కందా అమర్నాథ్‌, అలా అనిల్‌కుమార్‌, చీకటి వంశీదీ్‌పలను నియమించారు. రాయలసీమ జోన్‌-1కు కొట్టే వెంకటేశ్వర్లు, కేతుబోయిన సురేష్‌ బాబు, జోగినేని మణి, పగడాల మురళి కన్వీనర్లుగా ఉంటారు. రాయలసీమ జోన్‌-2 కన్వీనర్లుగా భవానీ రవికుమార్‌, పి.పవన్‌కుమార్‌లను పార్టీ నియమించింది. వీరంతా అధ్యక్షుడు పాల్గొనే సభలకు సంబంధించిన ఏర్పాట్లు, నిర్వహణ సాఫీగా సాగడం వంటివి చూసుకుంటారు. ఈమేరకు వీరందరితో ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు జనసేన పార్టీ కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు.

Updated Date - Jan 21 , 2024 | 09:56 AM

Advertising
Advertising