ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP News: తవ్వే కొద్దీ అక్రమాలు.. ప్రభుత్వ ఖజానాకు 26 కోట్లు గండి

ABN, Publish Date - Jan 27 , 2024 | 03:27 AM

ఉమ్మడి కడప జిల్లా మంగంపేట బైరైటీస్ గనుల్లో తవ్వే కొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి. ఎంత దోచుకున్నా ఏమీ కాదన్న ధీమాతో గనుల శాఖలో గజదొంగలు రెచ్చిపోతున్నారు.

మంగంపేటలో తవ్వే కొద్దీ అక్రమాలు

ఏపీఎండీసీలో కుమ్ముడే కుమ్ముడు

నిర్వాసితుల పరిహారంలోనూ దోపిడీ

బినామీల పేర్లతో అక్రమాలు

ముగ్గురు అధికారుల వల్ల

ప్రభుత్వ ఖజానాకు 26 కోట్లు గండి

ఈడీ, సీపీఓపై క్రిమినల్‌ కేసులు

పెట్టాలని విజిలెన్స్‌ సూచన

అరెస్ట్‌ చేసి చర్యలకు సిఫారసు

విజిలెన్స్‌ నివేదికలన్నీ బుట్టదాఖలు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఉమ్మడి కడప జిల్లా మంగంపేట బైరైటీస్ గనుల్లో తవ్వే కొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి. ఎంత దోచుకున్నా ఏమీ కాదన్న ధీమాతో గనుల శాఖలో గజదొంగలు రెచ్చిపోతున్నారు. కంచే చేను మేసిన చందంగా బైరైటీస్ ను కొల్లగొడుతున్నారు. పట్టా భూములు ఇచ్చిన నిర్వాసితులకు పరిహారం కింద కేటాయించాల్సిన బైరైటీస్‌లోనూ అక్రమాలకు పాల్పడినట్టు వెలుగులోకి వచ్చింది. అధికారులు, కాం ట్రాక్టర్లు బినామీలను సృష్టించి టన్నుల కొద్దీ తవ్వేశారు. ముగ్గురు అధికారుల కారణంగా 26 కోట్ల విలువైన బైరైటీ్‌సను దోచుకున్నారు. మంగంపేట బైరైటీస్‌ అక్రమాలపై ‘ఆంధ్రజ్యోతి’లో వరుసగా కథనాలు ప్రచురితమైన సంగతి తెలిసిందే. కంపెనీలు, వ్యాపారులతో అధికారులు కుమ్మక్కవడం ఒక ఎత్తయితే, సొంతంగా బినామీ కంపెనీలను రంగంలోకి దింపి వ్యాపారం చేయడం మరో ఎత్తు. నిబంధనలకు పాతరేసి ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయానికి గండికొట్టారు. ఫిర్యాదులు వచ్చినా గనుల శాఖ, ఏపీఎండీసీ చర్యలు తీసుకోలేదు. బెరైటీస్‌ దోపిడీపై విజిలెన్స్‌ విచారణ జరిపి చర్యలకు సిఫారసు చేసింది. ఏపీఎండీసీలో అసలు దొంగలను కనిపెట్టేందుకు కీలకమైన ఫైళ్లు, సమాచారం ఇవ్వాలని కోరింది. ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, మంగంపేట ప్రాజెక్టు అధికారి సహా పలువురిపై క్రిమినల్‌ కేసులు పెట్టాలని ఆదేశించింది. అవసరమైతే అరెస్ట్‌ చేయించి, చర్యలు తీసుకోవాలని కూడా సిఫారసు చేసింది. అధికారులతో పాటు వ్యాపారుల నుంచి కోట్ల రూపాయలు రికవరీ చేయాలని సిఫారసు చేసింది. కానీ ఒక్కరిపైనా చర్యలు లేవు. కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదు. అంతా సేఫ్‌గా ఉన్నారు. ఇంకేముంది.. మంగంపేట బైరైటీస్‌ దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది.

బినామీలకు బెరైటీస్‌

మంగంపేటలో బైరైటీస్‌ నిల్వలున్న పట్టా భూములను రైతులు మైనింగ్‌ కోసం ఏపీఎండీసీకి అప్పగించారు. వీరికి పరిహారంగా బెరైటీస్‌ అమ్ముకునే అవకాశం ఇచ్చారు. అంటే.. మంగంపేట ఏపీఎండీసీ విభాగమే భూములు ఇచ్చిన రైతులకు బెరైటీస్‌ కేటాయిస్తే, వారు వ్యాపారులకు అమ్ముకుంటారు. తద్వారా వారికి సొమ్ము వస్తుంది. ఇది గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయం. దీన్ని ఏపీఎండీసీ అధికారులు దుర్వినియోగం చేశారు. నిర్వాసితుల కింద 225 మందికి బెరైటీస్‌ కేటాయించగా, అందులో 167 మంది బోగస్‌ అని విజిలెన్స్‌ తేల్చింది. వాస్తవానికి 58 మంది నిర్వాసితులకే పరిహారం కింద బెరైటీస్‌ కేటాయించగా, మిగిలిన వారు అధికారులు, కాంర టాక్టర్లు సృష్టించిన బినామీలేనని విజిలెన్స్‌ తేల్చింది. 167 మందిలో 109 మందికి 2.02 లక్షల టన్నుల ఏ గ్రేడ్‌ బెరైటీ్‌సను సరఫరా చేశారు. ప్రగతి మినరల్స్‌ సంస్థ ఏపీఎండీసీ ఇచ్చిన అనుమతి కంటే ఎక్కువగా ఏ గ్రేడ్‌ బెరైటీస్‌ను తరలించుకుపోయింది. ఈ వ్యవహారంపై విజిలె న్స్‌ విభా గం సమగ్ర విచారణ చేపట్టి సర్కారుకు నివేదిక ఇచ్చింది.

ముగ్గురిపై కేసులకు సిఫారసు

మంగంపేటలో అప్పట్లో మైన్స్‌ సీనియర్‌ మేనేజర్‌గా పనిచేసిన హెచ్‌డీ నాగరాజపై శాఖాపరమైన చర్యలతో పాటు క్రిమినల్‌ ప్రాసిక్యూషన్‌ చేపట్టాలని విజిలెన్స్‌ సిఫారసు చేసింది. ఆయన తప్పిదాలు ఏమిటో, వాటి వల్ల జరిగిన నష్టం ఏమిటో వివరంగా పేర్కొంది. మరో సీనియర్‌ మేనేజర్‌ డి.వెంకటరమణపై క్రిమినల్‌ ప్రాసిక్యూషన్‌ చేపట్టాలని విజిలెన్స్‌ సిఫారసు చేసింది. అంతకన్నా ముందు శాఖాపరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సూచించింది. మంగంపేట ప్రాజెక్టులో సీనియర్‌ సర్వే ఆఫీసర్‌గా పనిచేసిన కె.రామచంద్రారెడ్డిపై కూడా శాఖాపరమైన చర్యలతో పాటు క్రిమినల్‌ ప్రాసిక్యూషన్‌ చేపట్టాలని ఆదేశించింది. ప్రగతి మినరల్స్‌ నుంచి 26.33 కోట్ల రూపాయలను సీనరేజీ ఫీజు కింద రికవరీ చేసి, క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది. ఈ వ్యవహారంలో ఇంకా పలు సిఫారసులు చేస్తూ అధికారులపై తీసుకొనే చర్యలను తమకు నివేదించాలని విజిలెన్స్‌ కోరింది.

సిఫారసులు బుట్టదాఖలు

గనుల శాఖ ఆదేశం మేరకే విజిలెన్స్‌ విచారణ జరిగింది. దాదాపు 28 కోట్ల అక్రమాలు జరిగాయని నిగ్గు తేల్చింది. కేవలం ముగ్గురు అధికారుల నిర్వాకం వల్లే 26 కోట్ల విలువైన బెరైటీస్‌ దోచుకున్నారని లెక్క తేల్చింది. విజిలెన్స్‌ చేసిన సిఫారసులను అమలు చేయాల్సింది గనుల శాఖనే. ముగ్గురు అధికారులపై క్రిమినల్‌ కేసులు పెట్టాలని, శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని గనుల శాఖ ఏపీఎండీసీని ఆదేశింది. అయితే ఈ ఉత్తర్వులను అమలు చేయాల్సిన ఏపీఎండీసీ ఆ ముగ్గురిని కాపాడింది. ఆయా అధికారుల నుంచి వివరణ తీసుకొని వదిలేసింది. క్రమశిక్షణ చర్యలే కాదు.. అరెస్ట్‌, క్రిమినల్‌ కేసులకు అవకాశమే లేకుండా చేసింది. నాటి మంగంపేట సీనియర్‌ మేనేజర్‌, ఏపీఎండీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ హెచ్‌.డి.నాగరాజ ఇటీవల రిటైరయ్యారు. పదవీ విరమణ చేసే వరకు ఆయనపై ఏ చర్యలూ తీసుకోలేదు. కనీసం అభియోగాలు కూడా నమోదు చేయలేదు. దీంతో ఆయన సేఫ్‌గా రిటైరయ్యారు. ఇదే కేసులో తీవ్ర చర్యలు ఎదుర్కోవాల్సిన మరో మేనేజర్‌ డి.వెంకటరమణను మంగంపేట నుంచి చీమకుర్తికి మార్చారు. దీంతో ఆయన కూడా సేఫ్‌గా బయట పడిపోయారు.

మళ్లీ మంగంపేటకు..

వెంకటరెడ్డి ఏపీఎండీసీ ఎండీ అయిన తర్వాత ఏరి కోరి వెంకటరమణను తిరిగి మంగంపేట బైరైటీస్‌ ప్రాజెక్టు చీఫ్‌ ఆఫీసర్‌ (సీపీఓ)గా పోస్టింగ్‌ ఇచ్చారు. అప్పట్లో ఈ చర్యపై తీవ్ర విమర్శలు వచ్చినా వెంకటరెడ్డి ఏ మాత్రం లెక్క చేయలేదు. ఆ తర్వాత మంగంపేట బెరైటీ్‌సలో సీ గ్రేడ్‌ బైరైటీస్‌ స్థానంలో ఏ గ్రేడ్‌ను డంప్‌ చేసి అక్రమంగా కంపెనీలు తరలించడానికి సహకరించారన్న ఫిర్యాదులపై విజిలెన్స్‌ విచారణ జరిగింది. దీనిపై ప్రభుత్వం స్పందించి వెంకటరమణను సస్పెండ్‌ చేయాలని ఆదేశించింది. వెంకటరెడ్డి ఎందుకో ఆ పని చేయలేదు. దీంతో ప్రభుత్వమే రంగంలోకి దిగి ఆయన్ను సస్పెండ్‌ చేసింది. నిజానికి మొదట్లోనే బైరైటీస్‌ అక్రమాలపై విజిలెన్స్‌ సిఫారసు మేరకు ఆయనపై క్రిమినల్‌ ప్రాసిక్యూషన్‌ చేసి, శాఖాపర మైన చర్యలు తీసుకొని ఉంటే ఆయన రెండోసారి మంగంపేటకు వచ్చేవారు కాదు. అక్రమాలకు ఆస్కారం ఏర్పడేది కాదు. మొదటిసారి కాపాడినా, రెండోసారి సస్పెన్షన్‌ తప్పలేదు. ఇప్పుడు ఈ కేసును కూడా గుట్టుచప్పుడు కాకుండా మూసేందుకు గనుల ఘనుడు బంగారుకొండ ప్రయత్నిస్తున్నారు.

Updated Date - Jan 27 , 2024 | 12:03 PM

Advertising
Advertising