ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

డిప్యూటీ సీఎంకు అంగన్వాడీల నిరసన సెగ

ABN, Publish Date - Jan 03 , 2024 | 12:27 AM

తన సొంత మండలమైన కార్వేటినగరంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామికి అంగన్వాడీల నుంచి నిరసన సెగ తగిలింది.

డిప్యూటీ సీఎం నారాయణస్వామి కాన్వాయ్‌ను అడ్డుకున్న అంగన్వాడీలు

కార్వేటినగరం, జనవరి 2: తన సొంత మండలమైన కార్వేటినగరంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామికి అంగన్వాడీల నుంచి నిరసన సెగ తగిలింది. మంగళవారం ఇక్కడి ఎంపీడీవో కార్యాలయంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పాల్గొంటున్న సందర్భంగా, అక్కడ 20 రోజలుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీల శిబిరాన్ని ధర్మరాజుల గుడి వద్దకు మార్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన డిప్యూటీ నారాయణస్వామికి వినతిపత్రం అందజేయడానికి అంగన్వాడీలు వెళ్లగా, ఆయన తీసుకోకుండానే ఎంపీడీవో కార్యాలయం లోపలకు వెళ్లిపోయారు. కార్యక్రమం ముగించుకుని డిప్యూటీ సీఎం కాన్వాయ్‌లో బయటకు వెళుతుండగా, అంగన్వాడీలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఎంపీడీవో కార్యాలయ ప్రవేశద్వారం వద్ద రోడ్డుపై బైఠాయించారు. డిప్యూటీ సీఎం కాన్వాయ్‌ని వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో డిప్యూటీ సీఎం కారు దిగి అంగన్వాడీ సమస్యలకు సంబంధించిన వినతి పత్రాన్ని తీసుకున్నారు. సీఎం దృష్టికి సమస్యను తీసుకెళ్తానని వారికి హామీ ఇచ్చారు.

దున్నపోతుకు వినతిపత్రం

ఫ అంగన్వాడీల వినూత్న నిరసన

చిత్తూరు: తాము 22 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అంగన్వాడీలు ఆగ్రహించారు. కుప్పంలో మంగళవారం దున్నపోతుకు వినతిపత్రం ఇచ్చి వినూత్న తరహాలో నిరసన తెలిపారు. దీక్షా శిబిరంవద్ద ప్రభుత్వ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం నెమరు వేసుకుంటున్న ఓ దున్నపోతు దగ్గరకు వెళ్లి దానికి వినతిపత్రం అందించారు. చిరుద్యోగుల ఆకలి కేకలు, న్యాయమైన డిమాండ్లను కనీసం వినడానికి ఇష్టపడని ప్రభుత్వానికంటే దున్నపోతు నయమని యూనియన్‌ నాయకులు పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్లక్షవైఖరికి నిరసనగా చిత్తూరులో మంగళవారం ప్రాజెక్టు కార్యాలయం వద్ద అంగన్వాడీలు నిరసన తెలిపారు. వీరి నిరసనకు వివిధ ప్రజాసంఘాల నాయకులు మద్దతు తెలిపారు. పలమనేరులో అంగన్వాడీ వర్కర్లు సీడీపీవో కార్యాలయం వద్ద దీక్షా శిబిరంలో చేపట్టిన నిరసనకు హమాలి వర్కర్స్‌ యూనియన్‌ నేతలు సంఘీభావం తెలిపారు. పుంగనూరు సీడీపీవో కార్యాలయం వద్ద అంగన్వాడీలు ధర్నా చేశారు. ఇలా జిల్లాలోని సీడీపీవో, ఎంపీడీవో, తహసీల్దారు కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలను చేపట్టారు.

Updated Date - Jan 03 , 2024 | 12:27 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising