ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పాలకూరులో కవ్వింపు చర్య

ABN, Publish Date - Jan 08 , 2024 | 12:39 AM

ఎన్టీఆర్‌ విగ్రహం పాక్షిక ధ్వంసం టీడీపీనేత దుకాణానికి చెప్పులు, చీపుర్ల మాల వైసీపీ పనేనంటూ ఫిర్యాదు

పాక్షికంగా దెబ్బతిన్న ఎన్టీఆర్‌ విగ్రహం - టీడీపీ నేత దుకాణ తలపుదుకాణానికి చెప్పులు కట్టిన వేసిన గుర్తుతెలియని వ్యక్తులు

పూతలపట్టు, జనవరి 7: పూతలపట్టు మండలం పాలకూరులో గుర్తు తెలియని వ్యక్తులు కొందరు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించడం.. టీడీపీ నేత దుకాణానికి చెప్పులు, చీపుర్లు కట్టారు. ఇదంతా వైసీపీ వారిపనిగా టీడీపీ నేతలు అనుమానిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. ఎగువపాలకూరు దళితవాడకు చెందిన గురుస్వామి 15 ఏళ్ల కిందట స్థానిక నేతల సహకారంతో పాలకూరులో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆదివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు ఈ విగ్రహాన్ని రాళ్లతో కొట్టడంతో కొద్దిగా దెబ్బతింది. పూర్తిగా ధ్వంసం చేయడానికి వీలుకాలేదు. దీంతో అక్కడి శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. పక్కనే ఉన్న టీడీపీ ఎస్సీ సెల్‌ నేత గురుస్వామి చిల్లర దుకాణానికి చెప్పులు, చీపుర్లతో మాలవేసి, ఆవుపేడ తెచ్చి దుకాణం ముందు పడేశారు. ఉదయాన్నే దుకాణం వద్దకు వచ్చిన గురుస్వామి కుటుంబీకులు వీటిని చూసి ఆవేదన చెందారు. పూతలపట్టు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ కలికిరి మురళీమోహన్‌, మండల పార్టీ కన్వీనర్‌ దొరబాబు చౌదరి, పార్లమెంటు అధికార ప్రతినిధి గంగారపు గోపి, మాజీ కన్వీనర్‌ చంద్రమౌళికి సమాచారమిచ్చారు. వీరితోపాటు భారీగా టీడీపీ శ్రేణులు పాలకూరుకు చేరుకోవడంతో ఉత్కంఠ నెలకొంది. ఈ సమాచారం అందుకున్న చిత్తూరు టౌన్‌ డీఎస్పీ శ్రీనివాసమూర్తి, పూతలపట్టు సీఐ శ్రీనివాసులు తమ సిబ్బందితో గ్రామానికి విచారించారు. ఎగువపాలకూరు దళితవాడకు చెందిన ఐదుగురు వైసీపీ వారిపై తమకు అనుమానం ఉందని గురుస్వామి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం టీడీపీ నేతలు ఎన్టీఆర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేశారు.

24 గంటల్లో నిందితులను అరెస్టు చేయాలి

ఎన్టీఆర్‌ విగ్రహాన్ని పాక్షికంగా ధ్వంసం చేసిన వారిని 24 గంటల్లో అరెస్టు చేయకపోతే ఆందోళన తీవ్రం చేస్తామని పూతలపట్టు టీడీపీ ఇన్‌చార్జి మురళీమోహన్‌ హెచ్చరించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రశాంతమైన గ్రామంలో వైసీపీకి చెందిన బడా నాయకులు యువకులకు మద్యం తాగించి ఇలాంటి ఘటనలకు తెరతీయడం సమంజసం కాదన్నారు. ఈ ఘటనకు ప్రేరేపించిన వారితోపాటు నిందితులపైనా చర్యలు తీసుకోవాలన్నారు. వారిని పోలీసులు వదిలిపెట్టినా తాము వదలబోమని హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు గంగారపు గోపి, దొరబాబు చౌదరి, చంద్రమౌళి, ప్రమోద్‌, మోహన్‌, చిరంజీవి, కార్తికేయ చౌదరి, ఆర్‌.ఎస్‌. బాబు, రాజశేఖర్‌ నాయుడు, వేణు, రామచంద్ర నాయుడు, దేవరాజు నాయుడు, మధు, నాదముని, హరి, హిమకర్‌, హిమగిరి నాయుడు, సుబ్బరాజులు, వేణు, ఇతర నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Jan 08 , 2024 | 12:40 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising