మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

జీఎ్‌సఎల్వీ-ఎఫ్‌ 14 అనుసంధాన పనులు షురూ

ABN, Publish Date - Feb 03 , 2024 | 01:13 AM

శ్రీహరికోటలోని షార్‌లో జీఎ్‌సఎల్వీ-ఎఫ్‌ 14 రాకెట్‌ ప్రయోగానికి సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నాయి.

జీఎ్‌సఎల్వీ-ఎఫ్‌ 14 అనుసంధాన పనులు షురూ
ఇన్‌శాట్‌-త్రీడీ ఉపగ్రహం

శ్రీహరికోటలోని షార్‌లో జీఎ్‌సఎల్వీ-ఎఫ్‌ 14 రాకెట్‌ ప్రయోగానికి సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నాయి.ఈ ఏడాది తొలి రోజు ప్రయోగించిన పీఎస్‌ఎల్వీ-సీ 58 రాకెట్‌ ద్వారా ఎక్స్‌పోశాట్‌ ఉపగ్రహాన్ని విజయవంతంగా పంపారు. ఇదే ఉత్సాహంతో శాస్త్రవేత్తలు ఈ నెల 17న జీఎ్‌సఎల్వీ-ఎఫ్‌ 14 రాకెట్‌ ద్వారా ఇన్‌శాట్‌-త్రీడీ ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనున్నారు. ఇందులో అత్యాధునిక 19 పేలోడ్‌లను కూడా పంపుతున్నారు.షార్‌లోని రెండో ప్రయోగ వేదిక వద్ద ఇప్పటికే రెండు దశల అనుసంధాన పనులు పూర్తి కాగా మూడవ దశ పనులు జరుగుతున్నారు.గత నెల 27న బెంగళూరులోని ఉపగ్రహ తయారీ కేంద్రం నుంచి ఇన్‌శాట్‌-త్రీడీ ఉపగ్రహాన్ని షార్‌కు తీసుకొచ్చారు. క్లీన్‌రూమ్‌లో ఉపగ్రహాన్ని పెట్టి తుది పరీక్షలు నిర్వహించారు.దీన్ని హీట్‌షీల్డ్‌లో అమర్చి రాకెట్‌ శిఖర భాగాన అనుసంధానిస్తారు. 2275 కిలోల బరువు గల ఇన్‌శాట్‌-త్రీడీ ఉపగ్రహం ద్వారా వాతావరణ పరిస్థితుల అంచనాతో పాటు విపత్తుల హెచ్చరికలను తెలుసుకోవచ్చు.

-సూళ్లూరుపేట

Updated Date - Feb 03 , 2024 | 01:13 AM

Advertising
Advertising