21 కేజీల గంజాయి పట్టివేత
ABN, Publish Date - Jan 10 , 2024 | 02:13 AM
అక్రమంగా తరలిస్తున్న 21 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సెబ్ డీఎస్పీ రమేష్ తెలిపారు.
నలుగురు బెంగళూరు యువకుల అరెస్టు
నాయుడుపేట టౌన్, జనవరి 9 : అక్రమంగా తరలిస్తున్న 21 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సెబ్ డీఎస్పీ రమేష్ తెలిపారు. నాయుడుపేట సెబ్ కార్యాలయంలో మంగళవారం పట్టుబడ్డ నిందితుల వివరాలను ఆయన వెల్లడించారు. సెబ్ సీఐ ప్రసాద్ వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో నాయుడుపేట ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నలుగురు యువకులు అనుమానాస్పదంగా కన్పించడంతో వారిని అదుపులోకి తీసుకున్నామన్నారు.వారి బ్యాగుల్లో 21 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడంతో పాటు బెంగళూరుకు చెందిన కిరణ్, విక్రమ్, గౌడ్‌పాటిల్, శ్యామ్‌లను అరెస్టు చేసినట్లు తెలిపారు. పట్టుబడ్డ గంజాయి విలువ 3.15 లక్షలు ఉంటుందని తెలిపారు.
Updated Date - Jan 10 , 2024 | 02:13 AM