ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో చెరకు తోట దగ్ధం

ABN, Publish Date - Jan 28 , 2024 | 12:17 AM

విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో చెరకు తోట దగ్ధమై రూ.3 లక్షలు విలువైన పంట నష్టం వాటిల్లిన సంఘటన మండలంలోని సంత్తపల్లెలో శనివారం చోటుచేసుకొంది.

షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు వ్యాపించడంతో దగ్ధమవుతున్న చెరకు తోట

తవణంపల్లె, జనవరి 27: విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో చెరకు తోట దగ్ధమై రూ.3 లక్షలు విలువైన పంట నష్టం వాటిల్లిన సంఘటన మండలంలోని సంత్తపల్లెలో శనివారం చోటుచేసుకొంది. బాధితులు, గ్రామస్తుల కథనం మేరకు వివరాలు. మండలంలోని పుణ్యసముద్రం పంచాయతీ సంత్తపల్లె గ్రామానికి చెందిన రామచంద్రారెడ్డి కుమారుడు బాబురెడ్డికి చెందిన చెరకు తోట పక్కన గల విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌లో షార్ట్‌ సర్క్యూటై నిప్పు రవ్వలు రాలి ఎండు గడ్డి అంటుకొన్నాయి. దీంతో పక్కనే ఉన్న చెరకు తోటకు మంటలు వ్యాపించాయి. ఈ సంఘటనలో సుమారు రెండు ఎకరాలు చెరకు తోట దగ్ధమైంది. గ్రామస్తుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకొన్న చిత్తూరు ఫైరింజన్‌ సిబ్బంది పక్క పొలాలకు మంటలు వ్యాపించకుండా అదుపు చేశారు. బెల్లం తయారీకి సిద్ధంగా గానుగ ఏర్పాటు చేసుకొన్నామని, షార్ట్‌ సర్క్యూట్‌తో పంట చేతికి అందే సమయంలో కాలి బూడిదైందని, తనను ఆర్థికంగా ప్రభుత్వమే ఆదుకోవాలని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

Updated Date - Jan 28 , 2024 | 12:17 AM

Advertising
Advertising