CP Ravi Shankar Aiyer: ఏఐపీసీసీ.. ప్రపంచంలోనే బెస్ట్ కమాండో కాంపిటీషన్
ABN, Publish Date - Jan 22 , 2024 | 02:40 PM
సోమవారం విశాఖపట్నం వేదికగా 14వ ఆల్ ఇండియా పోలీస్ కమాండో కాంపిటీషన్-2024 (ఏఐపీసీసీ) ప్రారంభమైంది. ఈ పోటీల్లో పాల్గొన్న సీపీ ఏ రవిశంకర్ అయ్యర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈరోజు (22/01/24) ఈ పోటీల్లో పాల్గొనడం జరిగిందని, దేశవ్యాప్తంగా 23 టీమ్‌లు ఈ కాంపిటీషన్‌లో పాల్గొన్నాయని తెలిపారు.
సోమవారం విశాఖపట్నం వేదికగా 14వ ఆల్ ఇండియా పోలీస్ కమాండో కాంపిటీషన్-2024 (ఏఐపీసీసీ) ప్రారంభమైంది. ఈ పోటీల్లో పాల్గొన్న సీపీ ఏ రవిశంకర్ అయ్యర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈరోజు (22/01/24) ఈ పోటీల్లో పాల్గొనడం జరిగిందని, దేశవ్యాప్తంగా 23 టీమ్‌లు ఈ కాంపిటీషన్‌లో పాల్గొన్నాయని తెలిపారు. ఈ పోటీల్లో పలు రాష్ట్రాల నుంచి కేంద్ర పోలీసుల బలగాలు పాల్గొననున్నాయని.. ప్రస్తుతం 14వ ఏఐపీసీసీ-2024కు ఆంధ్రప్రదేశ్ తరఫున గ్రేహౌండ్స్ ఆతిథ్యం వహిస్తోందని చెప్పారు. రాజీవ్ కుమార్ మీనా ఐపీఎస్, అడిషనల్ డీజీపీ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతున్నాయన్నారు. తన ప్రస్థానం కూడా గ్రేహౌండ్స్ నుంచే ప్రారంభమైందని, కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఈ పోటీలు ప్రపంచంలోనే బెస్ట్ కమాండో కాంపిటీషన్స్ అని చెప్పుకోవచ్చని అన్నారు.
ఇదిలావుండగా.. ఈ పోటీలు 2008 నుంచి జరుగుతున్నాయి. 22వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ పోటీలు.. ఈ నెల 30వ తేదీ వరకు జరుగుతాయి. ఈ పోటీలో మొత్తం 23 జట్లు పాల్గొననుండగా.. వాటిల్లో 16 రాష్ట్రాల పోలీసు జట్లు, ఏడు కేంద్ర పోలీసు సంస్థల జట్లు ఉన్నాయి. ఏఐపీసీసీ 13వ ఎడిషన్ మనేసర్‌లో జరిగింది. 10వ ఏఐపీసీసీ-2018 పూణేలో నిర్వహించారు. అయితే.. 11, 12వ ఎడిషన్ ఏఐపీసీసీలను కొవిడ్ లాక్‌డౌన్ కారణంగా రద్దు చేయడం జరిగింది. 13వ ఏఐపీసీసీ పోటీల్లో ఐటీబీపీ (ITBP) విజేతగా నిలవగా.. ఏపీ గ్రేహౌండ్స్ జట్టు ‘ఉత్తమ కాన్ఫిడెన్స్ కోర్స్ ట్రోఫి’ని, అలాగే 6వ ఏఐపీసీసీ పోటీలలో రన్నర్ ట్రోపీని సొంతం చేసుకుంది. ప్రస్తుతం 14వ ఎడిషన్ ఏఐపీసీసీ పోటీల్లో మొత్తం ఐదు దశలు ఉంటాయి. ఈ పోటీల్లో భాగంగా.. 23 జట్లు తమ సామర్థ్యం, నైపుణ్యం, ఓర్పును ప్రదర్శించి.. అగ్రస్థానంలో నిలిచేందుకు ప్రయత్నిస్తాయి.
Updated Date - Jan 22 , 2024 | 02:40 PM