ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Vijayawada: రవాణా శాఖను నిర్వీర్యం చేస్తున్నారు.. లెనిన్ సెంటర్‌లో సీపీఎం ధర్నా

ABN, Publish Date - Feb 03 , 2024 | 02:12 PM

కేంద్రంలోని మోదీ సర్కార్, రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వాలు కలిసి రవాణా శాఖను నిర్వీర్యం చేస్తున్నాయని సీపీఎం నేత బాబూరావు(CPM Baburao) విమర్శించారు. సీపీఎం(CPM) కార్యకర్తలతో కలిసి ఆయన లెనిన్ సెంటర్‌లో శనివారం ధర్నా నిర్వహించారు.

అమరావతి: కేంద్రంలోని మోదీ సర్కార్, రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వాలు కలిసి రవాణా శాఖను నిర్వీర్యం చేస్తున్నాయని సీపీఎం నేత బాబూరావు(CPM Baburao) విమర్శించారు. సీపీఎం(CPM) కార్యకర్తలతో కలిసి ఆయన లెనిన్ సెంటర్‌లో శనివారం ధర్నా నిర్వహించారు. సీఎం జగన్ ప్రభుత్వం రవాణా శాఖ ఫిట్మెంట్ సర్టిఫికేట్ల జారీ ప్రక్రియను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ద్విచక్రవాహనాలపై ఫిట్మెంట్ పేరుతో భారీగా ఫీజులు పెంచడాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు వాహనదారులపై భారం మోపి రూ.వెయి కోట్లు సమకూర్చుకోవాలని పతకం పన్నాయన్నారు.

"వైసీపీ వాహన మిత్ర పథకాన్ని.. వాహన శత్రు పథకంగా మార్చారు. ఆటోలకు ఫిట్ నెస్‌ల పేరుతో అదనపు దోపిడీ చేస్తున్నారు. అధికార పార్టీ నేతల కోసమే ప్రైవేటు టెండర్లు వేస్తున్నారు. ప్రజల నుంచి డబ్బులు లాక్కోవడానికి జగన్ ప్రయత్నిస్తున్నారు. ప్రైవేటు టెండర్లను వెంటనే రద్దు చేయాలి. ఫిట్ నెస్ ఫీజు తగ్గించాలి" అని బాబూ రావు డిమాండ్ చేశారు.

Updated Date - Feb 03 , 2024 | 02:14 PM

Advertising
Advertising