ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

విడాకుల వేడుక

ABN, Publish Date - Jan 07 , 2024 | 04:46 AM

తొంభైల్లో వచ్చిన ‘ఆహ్వానం’ సినిమా గుర్తుందిగా! అందులో కథానాయిక... తన విడాకులను వేడుకగా జరిపేందుకు అతిథులను ఆహ్వానిస్తుంది

తొంభైల్లో వచ్చిన ‘ఆహ్వానం’ సినిమా గుర్తుందిగా! అందులో కథానాయిక... తన విడాకులను వేడుకగా జరిపేందుకు అతిథులను ఆహ్వానిస్తుంది. అప్పట్లో ఆ కొత్త కాన్సెప్ట్‌ కాస్త వింతగా అనిపించినా... అది ‘రీల్‌ లైఫ్‌’ అని సరిపెట్టేసుకున్నాం. కానీ ఇప్పుడు... చైనాలో సరిగ్గా అలాంటి ‘సన్నివేశ’మే ఒకటి చోటు చేసుకుంది. చైనా గ్వాంగ్‌డంగ్‌ ప్రావిన్స్‌కు చెందిన 34 సంవత్సరాల సంగ్‌... తన నాలుగేళ్ల వైవాహిక జీవితానికి విడాకులతో ఘనంగా వీడ్కోలు పలికింది. ఊరంత పందిరి వేసి... ఊరూవాడను పిలిచి... మేళతాళాలతో పెళ్లి చేసుకోవడం చూస్తూనే ఉంటాం. కానీ భర్తతో బంధాన్ని తెంచుకున్న సందర్భాన్ని కూడా అంతే వైభవంగా, ఉత్సవంలా చేసుకుంది సంగ్‌. బడా బ్యానర్లు కట్టి, బంధువులు, సన్నిహితులను పిలిచి, భారీ స్థాయిలో ఖరీదైన పార్టీ ఒకటి ఏర్పాటు చేసింది. ‘ఇక్కడితో ఈ వివాహ బంధం ముగిసింది’ అంటూ తాటికాయంత అక్షరాలతో రాయించి... అతిథులతో తన ఆనందాన్ని పంచుకుంది.

అంతటితో అయిపోలేదు... పెళ్లికే కాదు విడాకుల వేడుకకూ కొన్ని ఆచారాలు ఉంటాయంటూ... కొత్త సంప్రదాయానికి తెర తీసింది. మండుతున్న తొట్టెలో నుంచి అడుగు బయటకు పెట్టడం... తలపై ఆకులు పెట్టి స్నానం ఆచరించడం... ఇలా ఎన్నో ఉన్నాయి ఆ వేడుకలో. చివరకు అందరూ కలిసి ‘బ్రేకప్‌ హ్యాపీలీ’ అంటూ పాట పాడి... పంచభక్ష పరమాన్నాలతో విందు ఆరగించి... సంబరాలు జరుపుకున్నారు. అతిథులు బహుమతులతో సంగ్‌ను ఆశీర్వదించి వెళ్లారు. ఈ ‘రియల్‌ లైఫ్‌’ రీల్‌ను సంగ్‌ ఇటీవల తన సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసింది. ఇక అక్కడి నుంచి లక్షల షేర్లు... లెక్కకు మించి లైక్‌లతో ఆమె ఇన్‌స్టా సూపర్‌హిట్‌ అయింది. రాత్రికి రాత్రే ఒక సెలబ్రిటీ హోదా రావడంతో సంగ్‌ సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

Updated Date - Jan 07 , 2024 | 04:46 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising