ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పశ్చిమాన తాగునీటి ముప్పు

ABN, Publish Date - Jan 30 , 2024 | 11:48 PM

వేసవి కాలం రాకముందే జిల్లాలోని పశ్చిమ ప్రాంతమైన కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆదోని, పత్తికొండ ప్రాంతాలలో తాగునీటి సమస్య తీవ్రమవుతోంది.

జీడీపీ ఎడవ కాలువ ద్వారా కోడుమూరుకు తాగునీరు విడుదల చేసిన దృశ్యం

గోనెగండ్ల, జనవరి 30: వేసవి కాలం రాకముందే జిల్లాలోని పశ్చిమ ప్రాంతమైన కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆదోని, పత్తికొండ ప్రాంతాలలో తాగునీటి సమస్య తీవ్రమవుతోంది. కోడుమూరు, కర్నూలు, ఎమ్మిగనూరు, పత్తికొండ, డోన్‌ ప్రాంతాలకు గాజులదిన్నె ప్రాజెక్టు నీరే తాగునీటి పథకాలకు శరణ్యం. అయితే, ప్రాజెక్టులో ఈ ఏడాది నీటి నిలువ పూర్తిగా అడుగంటి పోయింది. ప్రస్తుతం ప్రాజెక్టులో 1.05 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఈ నీటితోనే ఈ ఏడాది జూలై నెల వర్షాలు కురిసే వరకు ఐదు నియోజకవర్గాలకు తాగునీరు అందించాల్సి ఉంది. ఈ ఏడాది వర్షాలు కురియక పోవడంతో వేసవి రాక ముందే కోడుమూరు, గోరంట్ల ప్రాంతాలలో తాగునీటి సమస్య తీవ్రమైంది. దీంతో గత రెండు రోజుల క్రితం జీడీపీ అధికారులు కోడుమూరు, గోరంట్లకు తాగునీటి కోసం ఎడమ కాలువ ద్వారా రోజుకు 30 క్యూసెక్కుల ప్రకారం నీటిని విడుదల చేస్తున్నారు. పది నుంచి పన్నెండు రోజుల పాటు నీటి విడుదల చేస్తున్నట్లు జీడీపీ అధికారులు చెబుతున్నారు. వేసవి రాముందే తాగునీటి సమస్య తీవ్రమైతే జూలై నెల వరకు జీడీపీ నీరు పలు పట్టణాల తాగునీటి పథకాలకు సరిపోవు దీంతో తాగునీటి కష్టాలను ఎలా ఎదుర్కోనాలో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఎల్లెల్సీ నీరు విడుదల చేసి జీడీపీలో నిలువ చేసి అవసరం సమయంలో తాగునీటి పథకాలకు మళ్లించాల్సి ఉంటుంది.

Updated Date - Jan 30 , 2024 | 11:48 PM

Advertising
Advertising