అడుగడుగునా నిర్బంధం
ABN, Publish Date - Jan 23 , 2024 | 01:13 AM
రాజమహేంద్రవరం, జనవరి 22(ఆంధ్రజ్యోతి): అంగ న్వాడీలు ‘ఛలో విజయవాడ’ రాష్ట్రస్థాయి నిరసనకు విజ యవాడ వెళ్లకుండా జిల్లావ్యాప్తంగా పోలీసులు ఉక్కుపా దం మోపారు. తెల్లవారుజాము నుంచే రంగంలోకి దిగిన పోలీసులు ఎక్కడికక్కడ అంగన్వాడీలను అడ్డుకున్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న కల్యాణమండపాలకు తరలించి నిర్బంధించారు. అంగన్వాడీలు ఎవరూ బయటకు వెళ్ల కుండా పోలీసులు కాపలాగా ఉన్నారు. వారిని నిర్బంధిం చిన కల్యాణమండపాలు తదితర భవనాల గేట్లకు తాళా లు వేశారు. ఇళ్లకు వెళ్లకుండా విజయవాడ వెళ్లాలని ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని
‘ఛలో విజవాయవాడ’కు వెళ్లకుండా వెయ్యి మందికిపైగా అంగన్వాడీలను అడ్డుకున్న పోలీసులు
ముందస్తు అరెస్టుల సంఖ్యపై గోప్యత
అర్ధరాత్రి ప్రభుత్వంతో ఫలించిన చర్చలు.. సమ్మె విరమణ
రాజమహేంద్రవరం, జనవరి 22(ఆంధ్రజ్యోతి): అంగ న్వాడీలు ‘ఛలో విజయవాడ’ రాష్ట్రస్థాయి నిరసనకు విజ యవాడ వెళ్లకుండా జిల్లావ్యాప్తంగా పోలీసులు ఉక్కుపా దం మోపారు. తెల్లవారుజాము నుంచే రంగంలోకి దిగిన పోలీసులు ఎక్కడికక్కడ అంగన్వాడీలను అడ్డుకున్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న కల్యాణమండపాలకు తరలించి నిర్బంధించారు. అంగన్వాడీలు ఎవరూ బయటకు వెళ్ల కుండా పోలీసులు కాపలాగా ఉన్నారు. వారిని నిర్బంధిం చిన కల్యాణమండపాలు తదితర భవనాల గేట్లకు తాళా లు వేశారు. ఇళ్లకు వెళ్లకుండా విజయవాడ వెళ్లాలని ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించి సాయంత్రం వేళ సొంత పూచీకత్తుపై పంపిం చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాతోపాటు ఏజె న్సీ ప్రాంతానికి కూడా రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్ గేట్‌వే వంటిది. దీంతో తెల్లవారుజాము నుంచే రాజమహేంద్రవ రం రైల్వేస్టేషను వద్ద టూటౌన్, ప్రభుత్వ రైల్వే పోలీస్, రైల్వే భద్రతా దళం సిబ్బంది మోహరించారు. ఆర్టీసీ కాం ప్లెక్స్ వద్ద ప్రకాశం నగర్ పోలీసులు గస్తీ నిర్వహించారు. రైళ్లల్లో, బస్సుల్లో, ప్రైవేటు వాహనాల్లో వెళ్తున్న మహిళల ను ప్రశ్నించారు. అంగన్వాడీలని నిర్ధారణ అయితే వెంటనే వాహనాల నుంచి దించేశారు. వాళ్లందరినీ కల్యాణ మండ పాలు తదితర చోట్లకు తీసుకెళ్లారు. రైల్వే స్టేషనులో ఉద యం విజయవాడ ప్యాసింజర్, షిర్డి ఎక్స్‌ప్రెస్, జన్మభూమి ఎక్స్‌ప్రెస్ వెళ్లే వరకూ అంగన్వాడీల కోసం వెతుకులాడు తూనే ఉన్నారు. రాజమహేంద్రవరం టూటౌన్, ప్రకాశం నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో వందమందికిపైగా అంగ న్వాడీలను అదుపులోకి తీసుకున్నారు. అలాగే ధవళేశ్వరం 11, కడియంలో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలో ఈ సంఖ్య వెయ్యి దాటిందని తెలుస్తోంది. అంతే కాకుండా ఎన్‌టీజీ కృష్ణా జిల్లా, విశాఖ, కాకినాడ, శ్రీకాకు ళం ప్రాంతాలకు చెందిన సుమారు 400 మందిని విజ యవాడ తదితర ప్రాంతాల నుంచి బస్సుల్లో తీసుకొచ్చి తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల, దేవరపల్లి ప్రాంతాల్లోని ప్రైవేట్ ఫంక్షన్ హాళ్లలో నిర్బంధించారు. సాయంత్రం వరకూ నిర్బంధం వదిలేశారు. కాగా చిన్న ఉద్యోగులమైన తాము 42 రోజుల నుంచీ తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఎన్నో ఇబ్బందులను ఓర్చుకుంటూ ప్రభు త్వంపై పోరాటం చేస్తున్నామని.. మహిళలని కూడా చూడకుండా తమను ముద్దాయిల మాదిరిగా అరెస్టులు చేసి నిర్భందించడమేంటని అంగన్వాడీలు ప్రశ్నిస్తున్నారు. తమవల్ల శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం లేకపోయినా ప్రభుత్వం తీరు దారుణంగా ఉందని, మహి ళలను అడ్డుకోవడానికి పోలీసులను ప్రభుత్వం వినియో గించుకోవడం బాధాకరమంటూ ఆవేదన చెందారు. అంగ న్వాడీలను ఎక్కడికక్కడ పోలీసులు అదుపులోకి తీసుకోవ డంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తంచేశారు.
అంగన్‌వాడీలను టెర్మినేట్ చేస్తాం : కలెక్టర్
రాజమహేంద్రవరం, జనవరి22(ఆంధ్రజ్యోతి): జిల్లాలో విధుల్లో చేరని అంగన్వవాడీలను ఉద్యోగాల నుంచి తొలగి స్తున్నామని, ఇప్పటికే సంబంధిత పత్రాలుపై సంతకాలు చేశామని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత తెలిపారు. జిల్లా కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో సోమవారం ఆమె విలేకర్లతో మాట్లాడారు. జిల్లాలో మొత్తం 1556 అంగన్వా డీ కేంద్రాల్లో 1538 వర్కర్లు 1493 మంది సహాయకులు ఉన్నారన్నారు. సమ్మె తర్వాత ఇప్పటివరకూ 164 మంది వర్కర్లు, 162 మంది హెల్పర్లు విధుల్లో చేరారన్నారు. ఇంకా ఎవరైనా చేరేవారుంటే మంగళవారం కూడా విధు లకు హాజరు కావచ్చని తెలిపారు. మెటర్నిటీ కారణాలతో 9 మంది వర్కర్లు, 16 మంది హెల్పర్లు సెలవులో ఉన్నా రని ఆమె చెప్పారు.
సమ్మె విరమణ
అంగన్‌వాడీ సంఘాలతో ప్రభుత్వం సోమవారం అర్ధ రాత్రి జరిపిన చర్చలు ఫలించాయి. దాంతో తమ సమ్మె విరమిస్తున్నట్టు అంగన్‌వాడీలు ప్రకటించారు.
Updated Date - Jan 23 , 2024 | 01:13 AM