ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బీసీలకు భరోసానిచ్చేందుకే ‘జయహో బీసీ’

ABN, Publish Date - Jan 12 , 2024 | 01:02 AM

వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బీసీలకు రక్షణ కరువైందని, వారికి రక్షణ కల్పించే దిశగా భరోసా ఇచ్చేందుకు టీడీపీ జయహో బీసీ కార్యక్రమం నిర్వహిస్తోందని పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు.

  • టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామకృష్ణారెడ్డి

అనపర్తి, జనవరి 11: వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బీసీలకు రక్షణ కరువైందని, వారికి రక్షణ కల్పించే దిశగా భరోసా ఇచ్చేందుకు టీడీపీ జయహో బీసీ కార్యక్రమం నిర్వహిస్తోందని పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. గురువారం అనపర్తిలోని పార్టీ కార్యాలయంలో నియో జకవర్గ బీసీ నాయకులతో సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియా తో మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్‌ కల్పించిన ఘనత టీడీపీదేనని, 34శాతం ఉన్న రిజరేషన్లను 24శాతానికి తగ్గించి జగన్‌రెడ్డి బీసీలకు అన్యాయం చేశారన్నారు. బీసీలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం మినహా ఒక్క రూ పాయి నిధులు కూడా వెచ్చించలేదన్నారు. ఈనెల 19న బిక్కవోలులో జయహో బీసీ కార్యక్రమం ప్రారంభించి తర్వాత మిగిలిన మండలాల్లో నిర్వహిస్తామ న్నారు. నియోజకవర్గంలో బీసీ ప్రజాప్రతినిధులకు కనీస గౌరవం లేకుండాపో యిందన్నారు. సమావేశంలో త్రిమూర్తులు, జుత్తుగ కృష్ణ, కర్రి శ్రీనివాసరావు, నాగేశ్వరరావు, లాలయ్య, మామిడిశెట్టి శ్రీను, సూర్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2024 | 01:02 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising