ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

దరియాలతిప్పలో బోట్లో అగ్నిప్రమాదం

ABN, Publish Date - Jan 07 , 2024 | 02:01 AM

యానాం శివారు దరియాలతిప్పలోని గోదావరి ఒడ్డున ఉన్న జెట్టిలో మత్స్యకారుల బోటులో శనివారం అగ్నిప్రమాదం జరిగింది. ఈప్రమాదంలో ఒకరు సజీవ దహనంకాగా మరొకరు గాయాల పాలయ్యారు.

బోటు యజమాని తమ్ముడు సజీవ దహనం

యానాం, జనవరి 6: యానాం శివారు దరియాలతిప్పలోని గోదావరి ఒడ్డున ఉన్న జెట్టిలో మత్స్యకారుల బోటులో శనివారం అగ్నిప్రమాదం జరిగింది. ఈప్రమాదంలో ఒకరు సజీవ దహనంకాగా మరొకరు గాయాల పాలయ్యారు. ఐ.పోలవరం మండలం బైరవపాలెం గ్రామానికి చెందిన కామా డి నాగేశ్వరరావుకు చెందిన బోట్లో ఐస్‌, డీజిల్‌ తరలించే నేపథ్యంలో ఇంజన్‌ స్టార్ట్‌ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో బోటు యజమాని తమ్ముడు కామాడి గంగాద్రి(40) మంటలు ఆర్పేందుకు ప్రయత్నించి ప్రమాదంలో చిక్కుకొని సజీవ దహనమయ్యాడు. యానాం, ఆంధ్రప్రదేశ్‌, ఓఎన్జీసీ అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేసి మృతదేహాన్ని వెలికితీశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు సహాయక చర్యలను పర్యవేక్షించారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమి త్తం యానాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యానాం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బోటు విలువ సుమారు 40లక్షల వరకు నష్టం ఉంటుం దని యానాం అగ్నిమాపక సిబ్బంది అంచనా వేస్తున్నారు.

బోటు ప్రమాదంలో భైరవపాలెం వాసి..

ఐ.పోలవరం: యానాం దరియాలతిప్ప బోటు అగ్నిప్రమాదంలో బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీ మ జిల్లా ఐ.పోలవరం మండలం భైరవపాలేనికి చెందిన కామాడి గంగాద్రి సజీవదహనమయ్యాడు. దరియాలతిప్ప జెట్టీవద్ద బోటుకు మరమ్మతులు చేస్తుండగా మంటలు వ్యాపించడంతో ప్రమాదం జరిగింది. గంగాద్రికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటుంబ యజమాని చనిపోవడంతో అనాఽథలమయ్యామంటూ కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.

Updated Date - Jan 07 , 2024 | 02:01 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising