ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

తప్పించుకుని తిరుగుతున్న నేరస్థుల అరెస్టు

ABN, Publish Date - Jan 11 , 2024 | 01:12 AM

జగ్గంపేట పోలీస్‌ సర్కిల్‌ పరిధిలోని కిర్లంపూడి పోలీస్‌స్టేషన్‌కు సంబంధించిన ఒక గంజాయి రవాణా కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్‌ చేశామని, మరో ముగ్గురు కోసం గాలిస్తున్నట్లు జగ్గంపేట సీఐ ఎస్‌.లక్ష్మణరావు తెలిపారు.

జగ్గంపేట, జనవరి 10: జగ్గంపేట పోలీస్‌ సర్కిల్‌ పరిధిలోని కిర్లంపూడి పోలీస్‌స్టేషన్‌కు సంబంధించిన ఒక గంజాయి రవాణా కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్‌ చేశామని, మరో ముగ్గురు కోసం గాలిస్తున్నట్లు జగ్గంపేట సీఐ ఎస్‌.లక్ష్మణరావు తెలిపారు. జగ్గంపేట సర్కిల్‌ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2021 డిసెంబరులో విశాఖపట్నం ఏజెన్సీలో గల ధారకొండ గ్రామం నుంచి మహారాష్ట్రకు 152 ప్యాకెట్లతో ఉన్న 750 కిలోల గంజాయిని తరలిస్తున్న స్కార్పియో వాహనం కత్తిపూడి వద్ద పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో పలు దారులలో తిప్పితిప్పి చివరకు కిర్లంపూడి మండలం తామరాడ వద్ద ఏటిగట్టున గంజాయి ప్యాకెట్లుతో వదిలేశారని తెలిపారు. పోలీసులను నుంచి తప్పించుకునే ప్రయత్నంలో తమ వాహనంతో స్కూటీపై వెళుతున్న ఒక వ్యక్తిని గొల్లప్రోలు టోల్‌గేట్‌ సమీపంలో ఢీ కొట్టడంతో అతను మృతి చెందాడని తెలిపారు. ఈ కేసు అప్పట్లో సంచలనం అయిందన్నారు. దీనికి సంబంధించి నిందితులు, అప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతున్నారని తెలిపారు. మంగళవారం కృష్ణవరం టోల్‌గేట్‌ వద్ద నిర్వహించిన తనిఖీలలో ఈ కేసులో ప్రఽధాన నిందితులు హనుమాన్‌ మెహిత్‌(27), సమీర్‌ సుధాకర్‌ గవాంది (29)లను గుర్తింంచి కిర్లంపూడి పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. ఇదే ముఠాకు చెందిన అతుల్‌ ఓంకార్‌, సంజయ్‌ పాండురంగ, ఉమేష్‌, టాకిరే కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

Updated Date - Jan 11 , 2024 | 01:12 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising