ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

‘ఎన్నికల్లో విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలి’

ABN, Publish Date - Jan 05 , 2024 | 12:26 AM

పెద్దాపురం, జనవరి 4: ఎన్నికల్లో సెక్టోరియల్‌ అధికారులు తమ విధులను సమ ర్థవంతంగా నిర్వర్తించాలని ఆర్డీవో జె.సీతారామారావు అన్నారు. ఆర్డీవో కార్యాలయం లో డీఎస్పీ కె.లతాకుమారీతో కలసి ఆయన నియోకవర్గానికి సంబంధించి ఎన్నికల మార్గదర్శకాలపై సెక్టోరియల్‌, పోలీస్‌, ఏఈఆర్వోలతో గురు

పెద్దాపురం, జనవరి 4: ఎన్నికల్లో సెక్టోరియల్‌ అధికారులు తమ విధులను సమ ర్థవంతంగా నిర్వర్తించాలని ఆర్డీవో జె.సీతారామారావు అన్నారు. ఆర్డీవో కార్యాలయం లో డీఎస్పీ కె.లతాకుమారీతో కలసి ఆయన నియోకవర్గానికి సంబంధించి ఎన్నికల మార్గదర్శకాలపై సెక్టోరియల్‌, పోలీస్‌, ఏఈఆర్వోలతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సెక్టోరియల్‌ అధికారులు తమ పరిధిలో పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక వసతులపై దృష్టిసారించాలన్నారు. పోలింగ్‌కు సంబంధించి పూర్తి అవగాహన ఉండాలని, ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను తూచ తప్పకుండా పాటించాల న్నారు. సిబ్బంది అంతా సమన్వయం చేసు కుంటూ ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగే ందుకు సహకరించాలన్నారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై దృష్టి సారించాలని, వాటికి సంబంధించిన పోలింగ్‌ కేంద్రాలను గుర్తించాలని ఆయన తెలిపారు. కార్యక్రమంలో తహశీల్దార్‌ వజ్రపు జితేంద్ర, మున్సిపల్‌ కమిషనర్‌ జంపా సురేంద్ర, సీఐ రవికుమార, ఎస్‌ఐ సురేష్‌, మున్సిపల్‌ మేనేజర్‌ జ్యోతీరాణీ పాల్గొన్నారు.

Updated Date - Jan 05 , 2024 | 12:26 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising