ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పిల్లలు కచ్చితంగా బడికి వెళ్లి చదువుకోవాలి

ABN, Publish Date - Feb 01 , 2024 | 01:02 AM

ఉచిత, నిర్బంధ విద్య పొం దడం పిల్లల హక్కు అని.. పిల్లలందరూ కచ్చితంగా బడికి వెళ్లి బాగా చదు వుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి కె.ప్రత్యూష కుమారి పిలుపునిచ్చారు.

  • డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి ప్రత్యూష

రాజమహేంద్రవరం, జనవరి 31(ఆంధ్రజ్యోతి): ఉచిత, నిర్బంధ విద్య పొం దడం పిల్లల హక్కు అని.. పిల్లలందరూ కచ్చితంగా బడికి వెళ్లి బాగా చదు వుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి కె.ప్రత్యూష కుమారి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ వీధి బాలల దినోత్సవం సందర్భంగా డీఎల్‌ఎస్‌ఏ, జిల్లా మహిళా శిశు సంక్షేమాభివృద్ధి సంయుక్త ఆధ్వ ర్యంలో క్వారీ మార్కెట్‌ ప్రాంతంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లల హక్కులు, చదువు వల్ల కలిగే ప్రయోజనాలను స్థాని కులకు ప్రత్యూష కుమారి వివరించారు. బాలబాలికలను పనుల్లో పెట్టడం, వారితో భిక్షాటన చేయించడం వంటివి నేరమని చెప్పారు. మహిళా శిశు సంక్షే మాభివృద్ధి అధికారిణి కె.విజయకుమారి మాట్లాడుతూ ఐదేళ్లలోపు పిల్లలను అంగన్వాడీ సెంటర్లకు పంపిస్తే పౌష్టికాహార లోపం ఉండదన్నారు. వీధి బాలలు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

  • సత్వర న్యాయం అందించాలి

ప్యానల్‌, డిఫెన్స్‌ కౌన్సిల్‌ న్యాయవాదులతో జిల్లా 9వ అదనపు న్యాయ మూర్తి ఎం.మాధురి, డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి కె.ప్రత్యూషకుమారి మానిటరింగ్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఉచిత న్యాయ సహాయం అందిస్తున్న కేసు ల వివరాలు, వాటి పురోగతిపై చర్చించారు. సత్వర న్యాయం అందించే విష యం ఎలాంటి సమస్యలు ఉన్నా సంస్థ దృష్టికి తీసుకురావాలని సూచించారు.

Updated Date - Feb 01 , 2024 | 01:02 AM

Advertising
Advertising