ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

CBN: ఆడపిల్లల కోసం చంద్రన్న కానుక.. అధికారంలోకి వచ్చిన వెంటనే 'కలలకు రెక్కలు' పథకం

ABN, Publish Date - Mar 08 , 2024 | 06:57 PM

అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu).. యువతులకు తియ్యటి వార్త చెప్పారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ - జనసేన కూటమి అధికారంలోకి రాగానే 'కలలకు రెక్కలు' అనే పథకాన్ని ప్రారంభిస్తామని చంద్రబాబు అన్నారు.

అమరావతి: అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu).. యువతులకు తియ్యటి వార్త చెప్పారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ - జనసేన కూటమి అధికారంలోకి రాగానే 'కలలకు రెక్కలు' అనే పథకాన్ని ప్రారంభిస్తామని చంద్రబాబు అన్నారు.

ఉన్నత చదువులవైపు వెళ్లాలని కోరిక ఉన్నా.. ఆర్థిక పరిస్థితులు అనుకూలించని యువతుల కోసం ఈ పథకం ఉపయోగపడుతుందని అన్నారు.


"ఇంటర్ పూర్తయిన విద్యార్థులు పైచదువులు చదివేందుకు తీసుకునే రుణాలకు ప్రభుత్వమే పూచీకత్తుగా ఉంటుంది. కోర్సు కాలానికి రుణంపై వడ్డీ కూడా ప్రభుత్వమే భరిస్తుంది. kalalakurekkalu.com వెబ్ సైట్ ద్వారా అర్హులైన విద్యార్థులు నమోదు చేసుకోవాలి. మహిళలంటే సమాజంలో సగం జనాభా మాత్రమే కాదు, సమాజ శక్తిలో సగం. మహిళలను తోబుట్టువుల్లా చూసిన ఏకైక పార్టీ టీడీపీ. మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టి, వారిలో ఆత్మవిశ్వాసం నింపి, ఆర్థిక స్వావలంబనకు తెలుగు దేశం నిరంతరం పని చేస్తోంది. మహిళలను మహాశక్తులుగా మార్చేందుకే మహాశక్తి పథకాన్ని ప్రకటించాం. ఈ పథకం కింద ఇంట్లో చదువుకునే పిల్లలకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ 15,000 చొప్పున ఆర్థిక సాయం, ప్రతి మహిళకు నెలకు రూ.1,500 సాయం, ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందజేస్తాం" అని చంద్రబాబు అన్నారు.

Updated Date - Mar 08 , 2024 | 07:35 PM

Advertising
Advertising