ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అతివేగం.. అరచేతిలో ప్రాణం

ABN, Publish Date - Jan 12 , 2024 | 12:10 AM

ఇరుకు దారులు.. అతివేగం వెరసి భారీ వాహనాలు అదుపుతప్పి మృత్యు శకటాలుగా మారుతున్నాయి.

మలుపు వద్ద వెళ్లలేకపోతున్న భారీ వాహనం

దూసుకొస్తున్న భారీ వాహనాలు

ఇరుకు దారిలో రాకపోకలు

పట్టించుకోని అధికారులు

గడివేముల, జనవరి 11: ఇరుకు దారులు.. అతివేగం వెరసి భారీ వాహనాలు అదుపుతప్పి మృత్యు శకటాలుగా మారుతున్నాయి. దారి వెంట ప్రయాణించే వారిపై దూసుకెళ్తున్నాయి. మలుపుల వద్ద తిరగలేక రహదారిపై నిలిచిపోతూ గంటల కొద్ది ట్రాఫిక్‌ జామ్‌కు కారణమవుతున్నాయి. భారీ వాహనాలను అదుపుచేసి సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ట్రాఫిక్‌ సమస్య జటిలంగా మారి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మండల కేంద్రంలోని రహదారి ఇరుకుగా ఉండి మలుపులు తిరిగి ఉంటుంది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తమ అవసరాల నిమిత్తం గడివేములకు రాకపోకలు సాగి స్తుండటంతో ఈ రహదారి నిత్యం రద్దీగా ఉంటుంది. ఒక వాహనానికి మరోక వాహనం ఎదురుగా వస్తే వెళ్లలేని పరిస్థితి ఉంది. ఇలాంటి రహదారిపై భారీ వాహనాలు హారన్‌ మోగిస్తూ అతివేగంగా దూసుకొస్తుండటంతో ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారు.

దూసుకొస్తున్న భారీ వాహనాలు

మండలంలోని సిమెంట్‌ పరిశ్రమకు ముడి సరుకును తీసుకొని రావడానికి పరిశ్రమ ఉత్పత్తులను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. పరిశ్రమ యాజమాన్యం వాహనాల రాకపోకల కోసం పరిశ్రమ నుంచి నంద్యాల సమీపంలోని ప్రధాన రహదారి వరకు రహదారిని నిర్మించింది. సరుకు రవాణా ఈ రహదారి గుండానే చేయాలని వాహన యజమానులకు శరతులు విధించి అందుకు అనుగుణంగా రవాణా చార్జిలు చెల్లిస్తుంది. పరిశ్రమ నుంచి బళ్లారి, హైదరాబాదుకు అధిక సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. వాహన యజమానులు ఇంధన భారం, టోల్‌ రుసుము తగ్గించుకునేందుకు పరిశ్రమ సూచించిన మార్గంలో కాకుండా గడివేముల మీదుగా పరిశ్రమకు రాకపోకలు సాగిస్తున్నారు. ఇరుకైన రహదారిలో వస్తుండటంతో తరచూ ప్రమాదాలు సంబవిస్తున్నాయి. గతంలో ఈ వాహనాల కింద ముగ్గురు మృత్యువాత పడ్డారు. గురువారం మరోకరు మృతి చెందడంతో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

పట్టించుకోని అధికారులు

గడివేముల మీదుగా భారీ వాహనాల రాకపోకలను నియంత్రించాలని పలుమార్లు ప్రజలు అధికారులకు వినతి పత్రాలను అందజేశారు. గడివేముల పాతబస్టాండులో ధర్నాలు చేశారు. అయిన అధికారులు వాహనాల రాకపోకలను నియంత్రించడంలో విఫలమయ్యారు. గడివేములకు బైపాస్‌ రోడ్డును నిర్మించాలని పలు సంఘాలు డిమాండ్‌ చేసినా పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదు.

చర్యలు తీసుకుంటాం

ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటున్నాం. భారీ వాహనాలను నిర్ణీత సమయంలో రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకుంటాం. అతివేగంగా వాహనాలను నడిపే వాహనచోదకులపై చర్యలు తీసుకుంటున్నాం.

- బీటీ వెంకటసుబ్బయ్య, ఎస్‌ఐ, గడివేముల

Updated Date - Jan 12 , 2024 | 12:10 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising