ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

విశాఖపై జగన్‌ ప్రేమ ఇదేనా?

ABN, Publish Date - Feb 02 , 2024 | 03:35 AM

పాలనారాజధాని అని ఆర్భాటంగా చెబుతున్న సీఎం జగన్మోహన్‌రెడ్డి విశాఖపట్నంపై కపట ప్రేమ చూపుతున్నారని తేలిపోయింది. రైల్వే జోన్‌ ప్రధాన కార్యాలయం నిర్మాణానికి కేంద్రం సిద్ధంగా ఉన్నా..

రైల్వే జోన్‌కు నాలుగున్నరేళ్లుగా భూములివ్వని వైనం

స్వయంగా కేంద్ర మంత్రి వెల్లడి

జోన్‌కు 53 ఎకరాలు ఇవ్వలేరు.. కానీ... రాజధాని చేస్తారట!

రుషికొండకు గుండు కొట్టి 450 కోట్లతో విలాసాల ప్యాలెస్‌

ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ ‘జోన్‌పై మాత్రం అంతులేని నిర్లక్ష్యం

విశాఖలో దోచుకున్న భూముల్లో 53 ఎకరాలు పదో వంతైనా కాదు

వారంలో భూములిస్తే మర్నాడే శంకుస్థాపన చేస్తామన్న కేంద్రం

అయినా పట్టని రాష్ట్ర ప్రభుత్వం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

పాలనారాజధాని అని ఆర్భాటంగా చెబుతున్న సీఎం జగన్మోహన్‌రెడ్డి విశాఖపట్నంపై కపట ప్రేమ చూపుతున్నారని తేలిపోయింది. రైల్వే జోన్‌ ప్రధాన కార్యాలయం నిర్మాణానికి కేంద్రం సిద్ధంగా ఉన్నా.. నాలుగున్నరేళ్లుగా భూమి కేటాయించకుండా దాగుడుమూతలు ఆడుతున్నారు. ఈ విషయాన్ని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ గురువారం ఢిల్లీలో కుండబద్దలు కొట్టారు. రైల్వే శాఖ స్వయంగా అడుగుతున్నా జగన్‌ పట్టించుకోవడం లేదు. ఇక్కడ చేజిక్కించుకున్న భూముల విలువ పెంచుకోవడానికే విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించారని రాజకీయ వర్గాలు మండిపడుతున్నాయి. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటును మోదీ ప్రభుత్వం 2019లో ప్రకటించింది. దీని ప్రధాన కార్యాలయం విశాఖలో నిర్మించడానికి గత బడ్జెట్‌లో రూ.107 కోట్లు కేటాయించింది. అందులో రూ.10 కోట్లు ప్రాథమికంగా విడుదల చేసింది. కార్యాలయం నిర్మాణానికి 53 ఎకరాలను ముడసర్లోవ ప్రాంతంలో ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కానీ ఇంతవరకూ దానిని రైల్వే శాఖకు అప్పగించలేదు. ఆ భూమిలో ఆక్రమణదారులు ఉన్నారు. వారిని తొలగించడం లేదు. ప్రత్యామ్నాయ భూమైనా చూపడం లేదు. ఈ విషయాలన్నీ తొక్కిపెట్టి బీజేపీ నాయకులే రైల్వే జోన్‌ను తీసుకు రాలేకపోతున్నారని వైసీపీ నాయకులు ఎదురుదాడి చేస్తున్నారు. దీనికి సంబంధించిన డీపీఆర్‌ కూడా ఇంకా ఆమోదించలేదని ఆరోపిస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం భూములు ఇవ్వకపోవడం వల్లే జోన్‌ పనులు ప్రారంభించలేకపోతున్నామని రైల్వే మంత్రి స్పష్టంచేశారు. నిరుడు డిసెంబరు 10న.. మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ విశాఖ వచ్చినప్పుడు ఇక్కడి విలేకరులు రైల్వేజోన్‌పై ప్రశ్నించారు. ప్రభుత్వం వారం రోజుల్లో భూమి ఇస్తే ఆ మరుసటిరోజే నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తామని ఆయన ప్రకటించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున, జీవీఎంసీ కమిషనర్‌ సాయికాంత్‌వర్మ.. వారం రోజుల్లో భూములు అప్పగిస్తామని హామీ ఇచ్చారు. ఆ మాట చెప్పి ఈ నెల 9వ తేదీకి రెండు నెలలవుతుంది. కానీ ఇప్పటికీ రైల్వేకు అప్పగించలేదు. రాష్ట్రంలో జగన్‌ సీఎం అయ్యా క విశాఖలో వైసీపీ నాయకులు ఆక్రమించిన, బెదిరించి లాక్కున్న భూముల్లో రైల్వే జోన్‌కు ఇవ్వాల్సిన భూమి (53 ఎకరాలు) పదో వంతు కూడా ఉండదు. రైల్వేజోన్‌ను రూ.170 కోట్లతో నిర్మిస్తామంటే 53 ఎకరాలు ఇవ్వడానికి జగన్‌కు చేతులు రావడం లేదు. కేంద్రం చెబితే తప్ప ప్రజలకు ఈ విషయం తెలియలేదు.

Updated Date - Feb 02 , 2024 | 03:35 AM

Advertising
Advertising