Annamayya Dist.: తిప్పాయ పల్లెలో వింత సాంప్రదాయం
ABN, Publish Date - Jan 07 , 2024 | 09:33 AM
అన్నమయ్యజిల్లా: పుల్లంపేట మండలం, తిప్పాయ పల్లెలో గ్రామస్తులు వింత సాంప్రదాయం పాటిస్తున్నారు. ఆదివారం ఉదయం సంజీవరాయుడి స్వామి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అయితే మహిళలకు ఈ ఆలయంలో ప్రవేశం లేదు. మగవారే పొంగళ్లు పొంగిస్తారు.
అన్నమయ్య జిల్లా: పుల్లంపేట మండలం, తిప్పాయ పల్లెలో గ్రామస్తులు వింత సాంప్రదాయం పాటిస్తున్నారు. ఆదివారం ఉదయం సంజీవరాయుడి స్వామి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అయితే మహిళలకు ఈ ఆలయంలో ప్రవేశం లేదు. మగవారే పొంగళ్లు పొంగిస్తారు. దీంతో "మగవారి పొంగళ్లు" అని పేరుంది. ప్రతి ఏటా సంక్రాంతి పండుగకు ముందువచ్చే ఆదివారం సంజీవరాయుడి ఆలయంలో ‘మగవారిపొంగళ్ల’ సంబరాలు జరుగుతాయి.
హనుమాన్.. ఆ పేరు చెబితే చాలు ధైర్యం. కలియుగం ఉన్నంతవరకూ చిరంజీవిగా నిలుస్తూ, భక్తుల కష్టాలను తీరుస్తూ ఉంటాడని అందరి నమ్మకం. వాయుదేవుని పుత్రుడైన ఈ హనుమంతుడు శ్రీరామ దాసుడు.
ఇక హనుమంతుడుకి భారత దేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. అయితే మనం తెలుసుకునే ఈ దేవాలయం మాత్రం అత్యంత ప్రత్యేకమయ్యింది. హనుమంతుడు ఆవిర్భవించిన పరమ పవిత్రమైన ప్రాచీన క్షేత్రాలలో ‘వెల్లాల’. కడప జిల్లా ప్రొద్దుటూరుకు సమీపంలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది. సంజీవ రాయుడు
గా ఇక్కడ హనుమంతుడు పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. ఈ సంజీవ రాయుడు కొలిచిన వారికి కొంగు బంగారమై నిలుస్తాడని భక్తుల విశ్వాసం. రామ రావణ యుద్ధ సమయంలో లక్ష్మణుడు మూర్ఛిల్లిన ప్పుడు సంజీవని మొక్క కోసం బయలుదేరిన హనుమంతుడు.. సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇచ్చేందుకు ఇక్కడి కుందూ నది దగ్గర ఆగాడట.
అయితే మహర్షులు హనుమంతుడిని దర్శించుకున్న అనంతరం.. కాసేపు ఉండమనగా.. హనుమంతుడు ‘వెళ్లాలి .. వెళ్లాలి’ అంటూ ఆతృతను కనబరిచాడట. అందుకే ఈ గ్రామానికి ‘వెల్లాల’ అనే పేరు వచ్చిందని గ్రామస్థులు అంటుంటారు. ఇక మహర్షుల అభ్యర్థన మేరకు ఆ తరువాత కాలంలో ఇక్కడ వెలసిన స్వామికి, 15వ శతాబ్దంలో హనుమంత మల్లు అనే రాజు ఆలయాన్ని నిర్మించారట. ఇక ఇక్కడి స్వామివారిని దర్శించుకోవడం వల్ల.. ఆకు పూజలు జరిపించడం వల్ల.. ఆపదలు, గ్రహదోషాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. అదేవిధంగా, వ్యాధులు, బాధలు కూడా దూరమవుతాయనేది భక్తుల విశ్వాసం. స్వామివారికి ప్రీతికరమైన వడమాలలను భక్తి శ్రద్ధలతో సమర్పిస్తూ వుంటారు. ఆరోగ్య సమస్యలు, బాలారిష్టాలు ఉన్నవారు ఇక్కడ స్వామిని సేవిస్తే తప్పక అవి దూరం అవుతాయని పండితులు పేర్కొంటున్నారు.
Updated Date - Jan 07 , 2024 | 09:33 AM