ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

భూ సర్వే ఆలస్యం చేసే వారిపై చర్యలు తీసుకోండి

ABN, Publish Date - Jan 08 , 2024 | 10:53 PM

భూ సర్వేలు ఆలస్యం చేస్తున్న సర్వేయర్లపై చర్యలు తీసుకోవాలని ఆర్డీవో మురళి ఆదేశించారు. సోమవారం స్థానిక సబ్‌కలెక్టరేట్‌లో ఆర్డీవో మురళి ఆధ్వర్యంలో స్పందన కార్యక్రమం నిర్వహిం చారు.

ఆర్డీవో మురళికి వినతిపత్రాలు సమర్పిస్తున్న అర్జీదారులు

మదనపల్లె టౌన, జనవరి 8: భూ సర్వేలు ఆలస్యం చేస్తున్న సర్వేయర్లపై చర్యలు తీసుకోవాలని ఆర్డీవో మురళి ఆదేశించారు. సోమవారం స్థానిక సబ్‌కలెక్టరేట్‌లో ఆర్డీవో మురళి ఆధ్వర్యంలో స్పందన కార్యక్రమం నిర్వహిం చారు. తమ భూమి కన్వర్షన చేయాలని, చలానా కట్టి ఐదు నెలలు అవు తున్నా అధికారులు స్పందించలేదని డాక్టర్‌ చంద్రమోహన, శంకర నారా యణరెడ్డి ఆర్డీవోకు అర్జీ అందజేశారు. దీనిపై నాలుగు రోజుల్లో సమస్య పరిష్కరించాలని డిప్యూటీ ఇనస్పెక్టర్‌ సర్వేయర్‌ కృష్ణమూర్తిని ఆర్డీవో ఆదేశించారు. వాల్మీకిపురం మండలం మంచూరు పంచాయతీలో అక్రమ కొళాయి కనెక్షన్లను తొలగించాలని చంద్రయ్య ఆర్డీవోకు ఫిర్యాదు చేశాడు. రామసముద్రం మండలం చొక్కాండ్లపల్లెలో గ్రామకంఠం భూమిని కొందరు ఆక్రమించుకున్నారని గ్రామస్థుడు వెంకటరమణ ఫిర్యాదు చేయగా, దీనిపై క్షేత్రస్థాయిలో విచారించి చర్యలు తీసుకోవాలని రామసముద్రం ఈవోపీఆర్‌డీని ఆర్డీవో ఆదేశించారు. వీటితో పాటు ఎక్కువ భూ వివాదాలు, పాసుపుస్తకాలు మంజూరు, పింఛన్ల మంజూరు చేయాలని ప్రజలు అర్డీవోకు వినతులు అందజేశారు.

Updated Date - Jan 08 , 2024 | 10:53 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising