రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధమెక్కడ?
ABN, Publish Date - Feb 03 , 2024 | 11:32 PM
రాష్ట్రంలో అంచెలంచెలుగా సంపూర్ణ మద్య పాన నిషేధం చేస్తానని గత ఎన్ని కల్లో మాట ఇచ్చి అధికారం చేప ట్టాక దాన్ని అమలు చేయకుండా మహిళలను మోసగించారని జనసే న రాయలసీమ కో-కన్వీనర్ గంగా రపు రామ్‌దాస్‌చౌదరి ధ్వజమెత్తారు.
ఫ మరోసారి ఓట్లడిగే అర్హత జగనకు లేదు
ఫ జనసేన నేత రామ్‌దాస్‌చౌదరి విమర్శ
మదనపల్లె, ఫిబ్రవరి 3: రాష్ట్రంలో అంచెలంచెలుగా సంపూర్ణ మద్య పాన నిషేధం చేస్తానని గత ఎన్ని కల్లో మాట ఇచ్చి అధికారం చేప ట్టాక దాన్ని అమలు చేయకుండా మహిళలను మోసగించారని జనసే న రాయలసీమ కో-కన్వీనర్ గంగా రపు రామ్‌దాస్‌చౌదరి ధ్వజమెత్తారు. స్థానిక బెంగళూరురోడ్డులోని పప్పి రెడ్డిపల్లె వద్ద మద్యంషాపు ఎదుట నిరసన తెలిపారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలుపుకోలేని జగన..తిరిగీ 2024 సాధారణ ఎన్నికలకు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారని ఆయన ప్రశ్నించారు. సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేసిన తర్వాతే మీ ముందుకు వచ్చి ఓట్లు అడుగు తానని మహిళలకు చెప్పిన జగన..ఇప్పుడు మహిళలను ఎలా ఓట్లు అడుగుతారని ఆయన నిలదీశారు. మాటతప్పను, మడమ తిప్పను అని పదేపదే చెప్పే జగన నకిలీ, కల్తీ, నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలను హరిస్తున్నారని ఆరోపించారు. పథకాల పేరుతో ప్రజలకు రూ.10ఇచ్చి, రూ.1000 లాగుతున్నట్లు ఆయన విమర్శించారు. జనసేన అధినేత పవనకళ్యాణ్ పిలుపు మేరకు వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ, వైసీపీ రహిత మద నపల్లె, రాజంపేటగా వచ్చే ఎన్నికల్లో ముందుకెళ్లనున్నట్లు ప్రకటించారు. జిల్లా కేంద్రం ఇవ్వకుండా ఇక్కడి ప్రాంత ప్రజల మనోభావాలు, మదనపల్లె ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథునరెడ్డిలను వచ్చే ఎన్నికల్లో మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు, పుంగనూరు ప్రజలు బుద్దిచెప్పడానికి సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. మదనపల్లెను మద్యపాన నిషేధం ఎప్పుడు సీఎం? అని ప్రశ్నిస్తూ సీఎం డౌనడౌన అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరామ్, జనసైనికులు అడపా సురేంద్ర, సనావుల్లా, గ్రానైట్ బాబు, చంద్రశేఖర్, కుమార్, జంగాల గౌతమ్, జనార్దన, ప్రసాద్, లవన్న, రాజారెడ్డి, నరేష్, పవన, శంకర్, విజయ్‌కుమార్, గంగులప్ప, జవిలి మోహన, కృష్ణ, కిశోర్, వీరమహి ళలు రెడ్డెమ్మ, సరోజ, స్వాతి, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Feb 03 , 2024 | 11:32 PM